Take a fresh look at your lifestyle.

ఆం‌ధ్ర ఉద్యమంతో…. క్రియాశీలక రాజకీయాల్లోకి..!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య 1933 జూలై 4న ఆదెమ్మ, సుబ్బయ్య దంపతులకు గుంటూరు జిల్లా వేమూరు గ్రామములో జన్మించారు. జన్మిం చారు. గుంటూరు హిందూ కళాశాలలో వాణిజ్యశాస్త్రంలో డిగ్రీ పూర్తిచేశాడు. ఆయన కాంగ్రెస్‌ ‌పార్టీ తరపున 1968, 1974, 1980లలో శాసనమండలి సభ్యునిగా ఎన్నిక య్యారు. తొలిసారిగా మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వములో రోడ్డు రహదార్లు శాఖ, రవాణ శాఖల మంత్రిగా పనిచేశారు. ఆ తరువాత అనేక ముఖ్యమంత్రుల మంత్రివర్గాలలో పలు కీలకమైన శాఖలు నిర్వహించారు. ఉమ్మడి ఏపీలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీగా సేవలందించారు. ఆర్థిక మంత్రిగా ఏడుసార్లు బడ్జెట్‌ ‌ప్రవేశపెట్టి రోశయ్య రికార్డు క్రియేట్‌ ‌చేశారు. ఆర్థిక సంబంధ విషయాలు, రాజకీయాలపై మంచి పట్టు ఉంది. 1995-97 మధ్యకాలంలో ఆంధ్ర ప్రదేశ్‌ ‌కాంగ్రెస్‌ ‌కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షుడిగా పనిచేశారు. 1998లో నరసరావుపేట నియోజకవర్గం నుండి లోక్సభకు ఎన్నికయ్యారు. 2004-09 కాలంలో 12వ శాసనసభకు చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికైనప్పటికీ, 2009 ఎన్నికల ముందు ప్రత్యక్ష ఎన్నికలలో పోటీచేయకుండా శాసనమండలి సభ్యుడిగా ఎన్నికైనారు.ఆంధ్ర ప్రదేశ్‌ ‌రాష్ట్ర మంత్రిమండలిలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవమున్న రోశయ్య 2009, సెప్టెంబర్‌ 3 ‌నుండి 2010 నవంబరు 24 వరకు ఆంధ్ర ప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2011 ఆగస్టు 31న రోశయ్య తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల గవర్నరుగా బాధ్యతలు నిర్వహించారు. 2016 ఆగస్టు 30 వరకూ తమిళనాడు గవర్నరుగా తన సేవలు అందించారు. పద్దెనిమిదేళ్లకే క్రియాశీలక రాజకీయాల్లోకి రావడం వల్ల, ప్రతి అవకాశానికి న్యాయం చేసే ప్రయత్నం చేశారు. తెలుగు జాతి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత రోశయ్య గొప్ప తనానికి నిదర్శనం. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కొణిజేటి రోశయ్య ఉదయం లో-బీపీతో అకస్మాత్తుగా పడిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే డిసెంబరు 4న ఉదయం హైదరాబాదులో కన్నుమూశారు.

తెలంగాణ వాదుల్లోనూ జోష్‌ ‌నింపింది.
తెలంగాణ రాష్ట్రం లక్ష్యంగా స్థాపించిన టీఆర్‌ఎస్‌ ‌పార్టీకి ఆదరణ పెరగడంతో నాడు విపక్షంలో ఉన్న కాంగ్రెస్‌.. ‌టీఆర్‌ఎస్తో కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించింది. తెలంగాణ కు అనుకూలంగా కాంగ్రెస్‌ అధిష్టానం ఒప్పుకోవడంతో 2004 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌, ‌టీఆర్‌ఎస్‌, ‌కమ్యూనిస్ట్ ‌పార్టీలు కూటమిగా ఏర్పడి పోటీకి దిగాయి. టీఆర్‌ఎస్‌ ‌పార్టీకి ఈ ఎన్నికల్లో 26 అసెంబ్లీ స్థానాలు,5 లోక్సభ సీట్లు గెలుచుకుంది. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంలో చేరింది. ప్రభుత్వంలో భాగమైనా తెలంగాణ ఆకాంక్ష లక్ష్యం వీడలేదు. తెలంగాణకు అనుకూ లంగా దాదాపు 36 పార్టీలు ప్రణబ్‌ ‌ముఖర్జీ కమిటీకి లేఖలు ఇవ్వడంలో టీఆర్‌ఎస్‌ ‌కృషి చేసింది. ప్రభుత్వంలో భాగస్వామ్యులుగా ఉన్న టిఆర్‌ఎస్‌ ‌శాసన సభ్యులను కొవర్టులు గా మార్చుకొని ఉద్యమాన్ని నిర్వీర్యం చేసేందుకు ముఖ్యమంత్రి రాజశేఖర్‌ ‌రెడ్డి చేస్తున్న కుతంత్రాలు బయట పడడంతో కాంగ్రేస్‌ ‌పార్టీ కుట్రలను పసిగట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి టీఆర్‌ఎస్‌ ‌వైదొలిగింది.ఎటూతోచని స్థితిలో ఉన్న టీఆర్‌ఎస్‌ ‌కు వైఎస్సార్‌ ‌దర్శకత్వంలో కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత ఎమ్మెస్సార్‌ ‌సవాల్‌ ‌విసరడం.

అడుగడుగున కేసీఆర్‌ అం‌దిపుచ్చుకుని రాజీనామా చేయడం కరీంనగర్‌ ‌నుంచి మరోసారి భారీ విజయం సాధించడం టీఆర్‌ఎస్‌ ‌లోనూ, తెలంగాణ వాదుల్లోనూ జోష్‌ ‌నింపింది. 2009 ఎన్నికల్లో టీడీపీతో టీఆర్‌ఎస్‌ ‌జతకట్టి మహాకూటమిగా ఏర్పడింది. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.కేవలం 10 అసెంబ్లీ స్థానాల్లో, 2 ఎంపీ స్థానాల్లోనే గెలుపొందింది. గులాబీ శ్రేణుల్లో ఒక్కసారిగా నిరాశా నిస్రహలు. కేసీఆర్‌ ‌పై తిరుగుబాట్ల ను ప్రోత్సహించి,విచ్చిన్నం చేయడానికి అయోమయం సృష్టించి పార్టీ క్యేడర్‌ ‌ను నిర్వీర్యం చేసేందుకు కకణం కట్టుకుంది… అయిన మొక్కవొని ధైర్యంతో ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలతో కేసీఆర్‌ ఉద్యమాన్ని నడిపించారు. తెలంగాణ వాదం బలహీనం చేసేందుకు వైఎస్సార్‌ ‌ప్రతీసారి తన రాజకీయ చాణక్యతను ప్రదర్శించి తాయిలాలతో ఉక్కుపాదం మోపింది. కొవర్టులను అస్త్రంగా ప్రయోగించారు. చాలా సార్లు చీలికలకు గురి చేసింది. ఒకానొక దశలో పార్టీ మనుగడే ప్రశ్నార్థంగా మారే పరిస్థితిని ఎదుర్కొంది.

కేసీఆర్‌ ‘‌దీక్షా దివస్‌’ ‌కీలకమలుపు
60 సంవత్సరాలుగా కొట్లాడుచున్న తెలంగాణ రాష్ట్రం ఆకాంక్షను నెరవేర్చేందుకు పంచభూతాల సాక్షిగా వైఎస్‌ ‌రాజశేఖర్‌ ‌రెడ్డి అకాలమరణం, కొనిటి రోశయ్య ముఖ్యమంత్రి కావడం 1969 నాటి ఉద్యమానికి సజీవసాక్ష్యంగా ఉన్న అపరచాణక్యుడు రోశయ్య ఉద్యమకారులకు ఆజ్యం పోసినట్టయ్యింది. దీంతో తెలంగాణలో ఉద్యమం మరింత ఉధృతమైంది. త్యాగాల కొలిమిగా తెలంగాణ మారింది. తర్వాత జరిగిన సంఘటనలు ఒక్కోక్కటి గా టీఆర్‌ఎస్కు కలసివచ్చాయి.కేసీఆర్‌ ‌చచ్చుడో తెలంగాణ వచ్చుడో తేలిపోవాలంటూ 2009 నవంబర్‌ 29‌న దీక్షా దివస్‌ (‌కేసీఆర్‌ ఆమరణ నిరహార దీక్ష) కు దిగారు.తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఇది కీలకమలుపు.కేసీఆర్‌ ‌దీక్షతో తెలంగాణలో ఉద్యమం ఉధృతం అయింది.దీంతో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది.2009 డిసెంబర్‌ 9‌న అప్పటి హోంమంత్రి చిదంబరం.. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నామని ప్రకటించారు. కానీ, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుంచి నిరసనలు వెల్లువెత్తడంతో డిసెంబర్‌ 23‌న యూపీఎ ప్రభుత్వం యూటర్న్ ‌తీసుకుంది. అయితే ఆయన రాజకీయ జీవితంలో మాత్రం తెలంగాణ ఉద్యమమే అత్యంత గుర్తుంచుకునే గట్టంగా చెబుతున్నారు. ఆయన సీఎంగా కుర్చిలో కూర్చొవడం… అదే సమయంలో తెలంగాణ ఉద్యమం ఉదృతం కావడం… అదే సమయంలో ఇటు రాష్ట్ర ప్రజలు…. అటు రాజకీయ పార్టీలు. అంతేకాకుండా తన సొంత పార్టీ నాయకులు సైతం ఆయన సహకరిం చకపోవడం.. ఆ సమయంలో తెలంగాణ ఉద్యమం ఎగిసిపడింది. తెలంగాణ కోసం పరోక్షంగా చాలానే చేశారు. ఇలా రోశయ్య ఇరకాటంలో పెట్టేసాయని చెప్పక తప్పదు. ఈ క్రమంలో ఆయన జీవితంలో ఇదే అత్యంత టప్‌ ‌టైంగానే చెప్పుకోవచ్చు. తెలంగాణ ఉద్యమం ఉప్పెనలా సాగడానికి రోశయ్య కారణం అంటూ తెలంగాణ వాధులు .. నాడు ముఖ్యమంత్రి రోశయ్యని ఢిల్లీకి పిలిచారని, రాష్ట్రానికి వెళ్లి అసెంబ్లీలో తెలంగాణపై తీర్మానం చేయించమని ఆయనను కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆదేశించితే, ఢిల్లీలో సరేనని ఇక్కడకు వచ్చి సీమాంధ్ర ఎమ్మెల్యేలను ఉసికొల్పి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అప్పట్లో అడ్డుకున్నారనే విమర్శ లేకపోలేదు.

జీవన సాఫల్య పురస్కారం
టి.సుబ్బిరామిరెడ్డి లలిత కళాపరిషత్‌ ఆధ్వర్యంలో ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్‌ ‌కొణిజేటి రోశయ్యను గజమాలతో సత్కరించి జీవన సాఫల్య పురస్కారం అందించారు. రోశయ్య బహుముఖ ప్రజ్ఞాశాలి, కార్యదక్షుడని కొనియాడారు. సౌమ్యత, విషయ స్పష్టతతో ఏ పనినైనా నిబద్ధతతో చేసేవారని తెలిపారు.రోశయ్యతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.ఆంధ్ర ఉద్యమంతో తన రాజకీయ జీవితం ప్రారంభమై, కాంగ్రెస్‌ ‌పార్టీ పెద్దలు అందించిన సహకారంతోనే చట్టసభల్లో తగిన గుర్తింపు సంపాదించుకున్నారు తనకు దక్కిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ.. తనకు అప్పగించిన విధిని సక్రమంగా నిర్వహించడంలో అద్వితీయుడు కొనిజేటి,. తెలుగు జాతి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత రోశయ్యలకు దక్కుతుందని సభలో వ్యక్తలు కీర్తించడం ఆయన గొప్ప తనానికి నిదర్శనం. సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న నేతగా రోశయ్య చమత్కారాలు, ఛలోక్తులు విసరటంలో దిట్ట, తమిళనాడు మాజీ గవర్నర్‌ ‌రోశయ్య ఓ ప్రయివేటు ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన రాజకీయ జీవితంలో తాను ఎదుర్కొన్న టఫ్‌ ‌టైం తెలంగాణ ఉద్యమ సమయమేనని, సుదీర్ఘ రాజకీయ జీవితంలో తాను పెద్దగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోలేదన్నారు. అయితే అతి తక్కువ కాలమే తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే తెలంగాణ ఉద్యమం ఎగసిపడిందన్నారు. మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి రానని చెప్పారు. మిగతా జీవితం హైదరాబాదులోనే గడుపుతానని చెప్పారు. విశ్రాంతి తీసుకునేందుకు నిర్ణయించుకున్నందున, జీవిత చరిత్రను పుస్తకంగా తెచ్చే ఆలోచన లేదన్నారు. తానేమీ దేశం కోసం త్యాగం చేయలేదన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన ఎంతోమంది జీవితాలు వెలుగులోకి రావాల్సిన అవసరముందన్నారు. అలాంటి వారి గురించి భావి తరాలకు తెలియాల్సిన అవసరముందని చెప్పడం నిర్వీవాదాంశం.
– డా.సంగని మల్లేశ్వర్‌, ‌జర్నలిజం విభాగాధిపతి, కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్‌. 9866255355

Leave a Reply