Take a fresh look at your lifestyle.

ఆంధ్రా హజారే బాగోతం బట్టబయలు ..!

ప్రజలు మూగవారిగా ఉన్నంత కాలం ఏ రాజకీయవేత్త అయినా  ఆకర్షణ శక్తిని కలిగి ఉంటాడు…నిన్నమొన్నటి వరకూ    ఆంధ్ర అన్నా హజారే అని చెప్పుకునే నారా చంద్రబాబునాయుడు  రాజకీయ పాఠశాలలో  ఎంతో ఆకర్షణీయంగా  జీవనం సాగించారు.,  అవినీతి ఆరోపణలు తనపై ఏమీ లేవని చెప్పుకునే వారు.

ఒకప్పుడు ఆయనకు వ్యక్తిగత కార్యదర్సులుగా పని చేసిన వారి నివాసాలపై ఆదాయం పన్ను శాఖ వారు దాడులు చేసినప్పటి నుంచి ఆయనకు ఆంధ్రా హజారే ట్యాగ్ బదులు అవినీతి   బ్యాడ్జ్ తగిలించారు.  ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు సంతరించుకుంటున్న తరుణంలో ఆయన ఎంత కాలం తన    పాత    లేబుల్ ను కొనసాగించగలరు     గతంలో ఆయనకు వ్యక్తిగత కార్యదర్శిగా పని చేసిన అధికారి నివాసంలో   ఐటి దాడులు జరిగాయి. ఏడు రోజుల పాటు సోదాలు జరిగాయి.

చంద్రబాబు నాయుడు మిస్టర్ క్లీన్ గా ఇకపైన కూడా  చెప్పుకుంటారా   ప్రవాహానికి ఎదురు ఈదగలరా  ప్రస్తుత   పరిణామాల్లోకి  చంద్రబాబునాయుడును   వైసీపీ నాయకులు  ఈడ్వడం సరైనదేనా  కాదా

అయితే, ఐటి దాడులు రాష్ట్రంలో  రాజకీయాలను కుదిపేస్తున్నాయన్నది మాత్రం యథార్ధం.   మా నాయకులు వారు చెప్పుకుంటున్నంత  నీతిమంతులు కారని ప్రజలు అనుకుంటున్నారు.

ఐటి దాడుల విషయం బయటకు పొక్కిన నాటి నుంచి  చంద్రబాబునాయుడు,  తెలుగుదేశం నాయకుల తా      ఆ దాడులతో  తమను ముడిపెట్టవద్దని స్పష్టం చేస్తున్నారు.  వైసీపీ ఆరోపణలను ఖండిస్తున్నారు.

 

… చంద్రబాబు రాజకీయ వారసుడు,ఆయన కుమారుడు    లోకోష్ బాబు   ట్విట్టర్లలో    తీవ్ర స్థాయిలో విరుచుకుని పడుతున్నారు.   ఆంధ్రా హజారేగా చెప్పుకునే చంద్రబాబునాయుడుపై  ప్రతిపక్షాలు ముఖ్యంగా వైసీపీ నాయకులు అవినీతి ఆరోపణలు చేయడంతో  తెలుగుదేశం నాయకులు   వాటిని ఖండించడమే కాకుండా, మొహాలు  మాడ్చుకుంటున్నారు.

ఇప్పటి వరకూ     తెలుగు దేశం  వైసీపీ  అధ్యక్షుడు  జగన్ పై ఆరోపణలు చేయడంలో కాపీరైట్ ను కలిగి ఉంది. ఇప్పుడు చంద్రబాబునాయుడు కూడా అవినీతి ఆరోపణలకు గురి అవుతున్నారు.  జగన్, చంద్రబాబు పరస్పరం అవనీతి ఆరోపణలు చేసుకోవ డం అలవాటే. దక్షిణాఫ్రికా   క్రికెటర్  ఎబి డే విలిర్స్ క్రికెట్ ఎలాంటి వాడో   ఆంధ్ర రాజకీయాలకు  చంద్రబాబునాయుడు అలాంటివాడంటారు.  ఆంధ్ర రాజకీయాల్లో

జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అని  అంటారు.  చంద్రబాబును దగ్గర నుంచి పరిశీలిస్తే ఆయనలో  కౌటిల్యుడు,  కుటిల నీతి గలవాడు,  థామస్ బాసో,  బాబా రామదేవ్, అన్నా హజారే మొత్తం వీరందరినీ పోతపోసినట్టుగా ఉంటారు.    మార్కెటింగ్ బాగా చేయగలరనీ,  కార్పొరేట్ మార్కెటింగ్ రాజకీయ వేత్త అని ఆయనకు పేరుంది.

రాజకీయాల నుంచి ఆర్థిక వ్యవహారాల వరకూ ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి పెట్టుబడుల సమీకరణ     స్మార్ట్ విలేజిల నుంచి   గ్లోబల్ సిటీలు,   ఎడ్ల బండ్ల నుంచి బుల్లెట్ రైళ్ళు, ఎర్ర బస్సుల నుంచి ఎయిర్ బస్సుల వరకూ    అన్నింటిలోనూ తానున్నానే రీతిలో వ్యవహరించగలరు.  ఆంధ్రలో ఏ సమస్యనైనా ఆయన ఇట్టే కనిపెట్టగలరు,. కానీ,  చంద్రబాబు రాజకీయాలు కానీ, దార్శనికత కానీ   స్వంత ప్రయోజనాలకే ఉపయోగ పడుతూ వచ్చింది. ఆయన రాజకీయాల్లోకి వ చ్చేటప్పటికి రెండెకరాల ఆసామి,  ఆంధ్రప్రదేశ్ లోని  కుప్పం ఆయన స్వంత నియోజకవర్గం .  ఆంధ్ర ప్రదేశ్ ను     2050 నాటికి గొప్ప రాష్ట్రంగా చేయాలన్నది ఆయన విజన్ . కౌటిల్యుని అర్ధ శాస్త్రంకూడా ఆయన  ప్రకటించే విజన్ కు అంత చిక్కదు.   ఎంతో పేరు సంపాదించిన ఈ నాయకుడి ని ఇప్పుడు అనుమానించే స్థితి వచ్చింది.  ఆయనవి కాలదోషం పట్టిన ఆలోచనలే . ఆయన మాజీ వ్యక్తిగత కార్యదర్శి నివాసంలో  జరిగిన ఐటి దాడులు  వైసీపీ నాయకులకు  చాలినన్ని ఆరోపణాస్త్రాలను  అందించాయి.  ఐటి దాడుల్లో  సంచలనాత్మకమైన   విషయాలు బయటపడలేదు కానీ, వైసీపీ నాయకులకు కావల్సినంత మేత లభించింది.  దాంతో   తమ నాయకుడిపై ఈగ వాలకుండా చూడటానికి తెలుగుదేశం నాయకులంతా కట్టకట్టుకుని ముందుకు వచ్చారు.,  వైఎస్ జగన్ పై కేసులు,అవి నీతి ఆరోపణల గురించి పదే పదే ప్రస్తావిస్తున్నారు.  ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నప్పటికీ    వాస్తవాలు ఇంకా బయటకు రాలేదు.  మొత్తం మీద  చంద్రబాబు మాజీ ప్రత్యేక కార్యదర్శి నివాసంలో జరిగిన ఐటి సోదాలు ఆయన   వ్యక్తిత్వం  డొల్లతనాన్ని బయటపెట్టాయి.

Leave a Reply