Take a fresh look at your lifestyle.

11‌న అంతరిక్షంలోకి వర్జిన్‌ ‌గెలాక్సీ

వాహననౌక నలుగురు సభ్యుల బృందంలో తెలుగు మూలాలున్న యువతి శిరీష బండ్ల

తెలుగు మూలాలున్న ఓ మహిళ అంతరిక్షంలోకి అడుగుపెట్టి.. ఆ ఘనత సాధించిన మొట్టమొదటి తెలుగు మహిళగా గుర్తింపు పొంద బోతున్నారు. గుంటూరుకు చెందిన శిరీష బండ్ల తొలిసారిగా ఈ ఘనత సాధించబోతున్నారు. జూలై 11న అమెరికాకు చెందిన వర్జిన్‌ ‌గెలాక్టిక్‌ ‌సంస్థ అంతరిక్ష వాహక నౌకను ప్రయోగిస్తోంది. నలుగురు ప్రయాణికులతో ఈ వాహక నౌక అంతరిక్షానికి బయల్దేరుతుందని తాజాగా కంపెనీ వెల్లడించింది. నలుగురు ప్రయాణికులలో భారత సంతతికి చెందిన శిరీష బండ్ల కూడా ఉన్నారని ప్రకటించింది. అంతరిక్షంలోకి ప్రయాణికులను తీసుకెళ్లేందుకు వర్జిన్‌ ‌గెలాక్టిక్‌ ‌సంస్థకు జూన్‌ 25‌న ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్టేష్రన్‌ ‌లైసెన్సు జారీ చేసింది. ఈ క్రమంలో అంతరిక్ష పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు వర్జిన్‌ ‌గెలాక్టిక్‌ ‌సంస్థ ఈ ప్రయోగాన్ని చేపడుతోంది.

ఈ నెల 11న న్యూ మెక్సికో నుంచి బయల్దేరే స్పేస్‌ ‌ఫ్లైట్‌లో ఇద్దరు ప్రయాణికులతో పాటు వర్జిన్‌ ‌గెలాక్టిక్‌ అధిపతి రిచర్డ్ ‌బ్రాన్సస్‌ ‌సహా మరో ముగ్గురు కంపెనీ ప్రతినిధులు అంతరిక్షయానం చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే వర్జిన్‌ ‌గెలాక్టిక్‌ ‌ప్రభుత్వ వ్యవహారాల ఉపాధ్యక్షురాలి హోదాలో ఉన్న శిరీష బండ్ల అంతరిక్షంలోకి అడుగుపెట్టనున్నారు. ఇదిలా ఉంటే.. శిరీష బండ్ల ఆంధప్రదేశ్‌లోని గుంటూరులో జన్మించారు. అనంతరం కుటుంబంతో కలిసి ఆమె అమెరికా వెళ్లి, అక్కడే స్థిరపడ్డారు. ప్రస్తుతం ఆమె వాషింగ్టన్‌లో నివసిస్తున్నారు. శిరీష బండ్ల జార్జి వాషింగ్టన్‌ ‌యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశారు. అంతేకాకుండా పర్డ్యూ విశ్వవిద్యాలయంలో ఏరోనాటికల్‌- ఆస్టోన్రాటికల్‌ ఇం‌జినీరింగ్‌లో బ్యాచిలర్‌ ‌పట్టా పొందారు.

Leave a Reply