Take a fresh look at your lifestyle.

ఇక ఏ ఇంట్లో ఫంక్షన్‌ ‌జరిగినా.. స్టీల్‌ ‌బ్యాంకు సామాగ్రి వినియోగించుకోవాలి

  • మున్సిపల్‌ ‌వార్డుల్లో స్టీల్‌ ‌బ్యాంకులు ప్రారంభం
  • సిద్ధిపేట ప్రజలకు పిలుపునిచ్చిన  మంత్రి  హరీష్‌రావు

మనలో మార్పుతోనే సమాజం లో మార్పు వస్తుంది.! ప్రజల ఆలోచనల్లో మార్పు ఎక్కడో ఒక్కచోట మొదలవ్వాలి.! అది సిద్ధిపేట నుంచే మొదలవ్వాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌ ‌రావు పిలుపు నిచ్చారు. సిద్ధిపేట మున్సిపాలిటీ పరిధిలోని 34,30,15వ వార్డుల్లో మున్సిపల్‌ ‌చైర్మన్‌ ‌రాజనర్సుతో కలిసి స్టీల్‌ ‌బ్యాంకులను ప్రారంభించారు. ఈ మేరకు వార్డు ప్రజల కోసం స్టీల్‌ ‌బ్యాంకులను మంత్రి హరీశ్‌ ‌రావు రంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. భవిష్యత్తు తరాలు, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలంటే మనలో మార్పు రావాలని, ఆరోగ్య సమాజానికి బాటలు వేయాలని మంత్రి సూచించారు. ఇండ్లల్లో వాడిన ప్లాస్టిక్‌ ‌కవర్లు భూమిలోకి వెళ్లి పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోందని, భూమి వాతావరణం కలుషితం అవుతున్నదని చక్కగా అవగాహన కల్పించారు.

మనం వాడుతున్న ప్రతి ఆహారం లో ప్లాస్టిక్‌ ఉం‌టోందన్నారు. ఇది అత్యంత ప్రమాదకరమని, కడుపులో ప్లాస్టిక్‌ ‌చేరి క్యాన్సర్‌ ‌వ్యాధి ప్రబలుతోందన్నారు. ఇండ్లల్లో వాడుతున్న తడి, పొడి చెత్త ను ఖచ్చితంగా వేరు చేసి ఇవ్వాలన్నారు. మార్కెట్‌ ‌కు వెళితే ఇంట్లోనుండి ఖచ్చితంగా సంచిలను తీసుకువెళ్ళాలని సూచించారు. మటన్‌ ‌చికెన్‌ ‌తెచ్చుకునే వారు స్టీల్‌ ‌డబ్బాలను తీసుకువెళ్లాలన్నారు. ఇండ్లల్లో పెళ్ళిల్లు, శుభకార్యాలు చేసే వారు ఇకపై ప్లాస్టిక్‌ ‌ప్లేట్లు, ప్లాస్టిక్‌ ‌గ్లాసులు వాడకాన్ని బంద్‌ ‌చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.ఇకపై సిద్ధిపేటలో ఎవరి ఇంట్లో ఫంక్షన్‌ ‌జరిగినా ఈ స్టీల్‌ ‌బ్యాంకు నుంచి వస్తువులు తీసుకువెళ్లి వాడుకోవాలని సూచించారు. స్టీల్‌ ‌బ్యాంకులో ప్లేట్లు,ఇతర సామాన్లు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఇకపై పట్టణం లో ఎవరూ ఇండ్లల్లో ప్లాస్టిక్‌ ‌వాడవద్దని, వాడిన వారికి రూ.500 రూపాయల జరిమాన విధిస్తామని స్పష్టం చేశారు.

మున్సిపల్‌ ‌పారిశుద్ధ్య కార్మికు లకు ఎనర్జీ డ్రింక్స్
అను నిత్యం శ్రమించి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దే మీ ఆరోగ్యాలు బాగుండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మున్సిపల్‌ ‌పారిశుద్ధ్య కార్మికులకు మంత్రి హరీశ్‌ ‌సూచించారు. కరోనా నేపథ్యంలో నిత్యం పట్టణ అభివృద్ధి కై శ్రమిస్తున్న 500 మంది పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య దృష్ట్యా వారికి ఎనర్జీ డ్రింక్స్ ‌బాటిల్‌ ‌సెట్లను మంత్రి చేతుల మీదుగా అందజేశారు. ప్రతి రోజూ ఒక బాటిల్‌ ఎనర్జీ డ్రింక్స్ ‌తాగాలని కార్మికులకు సూచించారు. అంతకు ముందు 15వ వార్డులో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఆ ప్రాంతంలో మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షిస్తున్న ఎల్‌ఐసీ నర్సింలు ను శాలువాతో మంత్రి, కౌన్సిలర్‌ ‌మరుపల్లి భవాని-శ్రీనివాస్‌ ‌గౌడ్‌ ‌లు కలిసి సన్మానించారు. అనంతరం కౌన్సిలర్‌ ‌మరుపల్లి భవాని-శ్రీనివాస్‌ ‌గౌడ్‌ ఆధ్వర్యంలో పేద కార్మికులకు బియ్యం అందజేశారు. కార్యక్రమంలో ఇంచార్జీ మున్సిపల్‌ ‌కమిషనర్‌ ‌లక్ష్మణ్‌, ‌వివిధ వార్డులకు చెందిన మున్సిపల్‌ ‌కౌన్సిలర్లు, బాల వికాస ప్రతినిధి శౌరీరెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, మున్సిపల్‌ ‌మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply