Take a fresh look at your lifestyle.

ఇక నిరంతరంగా ‘హరితహారం’

నిధుల కొరత లేకుండా ‘హరితనిధి’…టాక్స్ ‌విధింపుకు ప్రతిపాదన
స్కూల్‌ ‌నుంచి కాలేజీ వరకు..రిజిస్ట్రేషన్లపైనా గ్రీన్‌ ‌టాక్స్
‌పల్లె ప్రకృతి వనాలతో బిపి, షుగర్లు మాయం…
ఊరుకో ప్రకృతి వనం..మండలానికో బృహత్‌ ‌వనం
అసెంబ్లీలో హరితహారంపై చర్చలో సిఎం కెసిఆర్‌
‌కంపా నిధులు రాష్ట్రాలు సమకూర్చినవే•నని వెల్లడి

రాష్ట్రంలో చేపట్టిన హరితహారం మంచి ఫలితాలను ఇస్తున్నదని, దీనిని మరింత పక్కాగా నిర్వహించేందుకు నిధుల కొరత రాకుండా చేయాలని సంకల్పించామని సిఎం కెసిఆర్‌ ‌తెలిపారు. అలాగే దీనిని నిరంతర కార్యక్రమంగా చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే విజయవంతంగా కొనసాగుతోన్న హరితహారానికి తోడుగా ‘హరిత నిధి’ కార్యక్రమానికి శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌ప్రతిపాదన చేశారు. నిరంతరంగా హరిత ఉద్యమాన్ని కొనసాగించడానికి ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చామని సీఎం తెలిపారు. దీంతో కొత్తగా ఇప్పుడు హరిత టాక్స్ ‌విధించాలని నిర్ణయించారు. హరితహారంపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ చేపట్టిన సందర్భంగా సీఎం కేసీఆర్‌ ‌హరిత నిధిపై ప్రకటన చేశారు. మన రాష్ట్రంలో పని చేసే ఐఏఎస్‌ అధికారులతో మాట్లాడగా వారు ప్రతి నెల వారి జీతం నుంచి హరిత నిధికి రూ. 100 ఇస్తామని ఒప్పు కున్నారు. ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ ఆఫీసర్లు కూడా రూ. 100 ఇస్తామని ఒప్పుకున్నారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. న్యాక్‌ ‌ద్వారా 0.1 శాతం ఇవ్వాలని ప్రపోజ్‌ ‌చేస్తున్నామని అన్నారు. మన రాష్ట్రంలో పని చేసే ప్రభుత్వ ఉద్యోగులు కూడా ప్రతి నెల రూ. 25ల చొప్పున ఇచ్చేందుకు అంగీకరించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ప్రతి నెల రూ. 500 హరిత నిధికి ఇవ్వాలని కోరాం. టీఆర్‌ఎస్‌ ఎం‌పీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంగీకరించారు. మిగతా పక్షాలకు కూడా అప్పీల్‌ ‌చేస్తున్నాను. వారు కూడా అంగీకరిస్తారని అనుకుంటున్నానని సిఎం కెసిఆర్‌ ‌తెలిపారు. లైసెన్సెస్‌ ‌రెన్యూవల్‌ ‌చేసే సమయంలో రూ. 1000.. హరిత నిధి కింద జమ చేయాలని కోరుతాం. భూముల అమ్మకాలు, కొనుగోలు చేసేటప్పుడు ప్రతి రిజిస్టేష్రన్‌కు హరిత నిధి కింద రూ. 50 కలెక్ట్ ‌చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. విద్యార్థుల పాత్ర కూడా ఇందులో ఉండాలని నిర్ణయించాం. విద్యార్థులు తమ పాఠశాలలు, కాలేజీల్లో ప్రవేశాలు పొందే సమయంలో.. స్కూల్‌ ‌విద్యార్థులు రూ. 5, హైస్కూల్‌ ‌విద్యార్థులు రూ. 15, ఇంటర్‌ ‌విద్యార్థులు రూ. 25, డిగ్రీ విద్యార్థులు రూ. 50, అదే విధంగా ప్రొఫెషనల్‌ ‌కోర్సులు చదివే విద్యార్థులు రూ. 100 ఇస్తే హరిత నిధికి తోడ్పాటు ఉంటుందన్నారు. హరితహారం కార్యక్రమాన్ని యూఎన్‌వో గుర్తించి ప్రశంసించింది. ఈ గ్రీన్‌ ‌ఫండ్‌ ఇతర రాష్టాల్రకు ఆదర్శంగా నిలుస్తుందని అనుకుంటున్నట్లు చెప్పారు. తెలంగాణ హరిత నిధికి నిరంతరం నిధుల కూర్పు జరిగితే అద్భుత ఫలితాలు వస్తాయని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఇకపోతే కాంపా నిధులు కేంద్ర ప్రభుత్వానివి కావని, వందశాతం అది రాష్టాల్ర డబ్బులు మాత్రమే అని సీఎం కేసీఆర్‌ ‌స్పష్టం చేశారు. శాసనసభలో హరితహారంపై స్వల్పకాలిక చర్చ చేపట్టిన సందర్భంగా సభ్యులు మాట్లాడిన అనంతరం సీఎం కేసీఆర్‌ ‌సుదీర్ఘ వివరణ ఇచ్చారు. నీటి ప్రాజెక్టులు, రోడ్లకు, లేదా ఇతర అవసరాల కోసం అటవీ భూములను కొనుగోలు చేస్తాం. అడ్వాన్స్ ‌కింద రాష్టాల్రు కేంద్రానికి డబ్బులు చెల్లించాలి. ఈ క్రమంలో తెలంగాణ నుంచి కేంద్రం వద్ద జమ చేసిన డబ్బు రూ. 4675 కోట్లు. ఇవి మనం కట్టిన డబ్బులే. కేంద్రానిది నయా పైసా కూడా లేదన్నారు.  అయితే మోదీని కలిసి కాంపా నిధులు విడుదల చేయాలని కోరాం. మొత్తానికి 4 సంవత్సరాల తర్వాత విడుదల చేశారు. అయితే మనకు ఇచ్చే నిధుల్లో 10 శాతం కేంద్రం కట్‌ ‌చేస్తుంది. మొత్తం ఇవ్వాలని అడిగాం. పరిశీలన చేస్తామని కేంద్రం చెప్పిందన్నారు. కాంపా నిధుల్లో భాగంగా రాష్టాన్రికి రూ. 3,109 కోట్లు నిధులు విడుదల చేశారు. ఇందులో రూ. 1320 కోట్లు ఖర్చు పెట్టాం. నరేగా కింద రూ. 3673 కోట్లు ఖర్చు చేశాం. హెచ్‌ఎం‌డీఏ ద్వారా రూ. 367 కోట్లు, జీహెచ్‌ఎం‌సీ ద్వారా రూ. 83 కోట్లు ఖర్చు చేశాం. నర్సీరల పెంపకం, ఏర్పాటు, కూలీలు, మొక్కల సరఫరా, నీటి రవాణాకు ఖర్చు చేశాం. నిధుల దుర్వినియోగం జరగడం లేదు. ఇప్పటి వరకు ఈ కార్యక్రమం కోసం రూ. 6,555 కోట్లు ఖర్చు చేశామని కేసీఆర్‌ ‌వెల్లడించారు. మన రాష్ట్రంలో పంచాయతీరాజ్‌ ‌కింద 67,276 కి.వి•. ఆర్‌ అం‌డ్‌ ‌బీ కింద 28,080 కి.వి•. నేషనల్‌ ‌హైవేస్‌ ‌కింద 4 వేల కి.వి•. ఉన్నాయి. అన్నీ కలిపితే 1,00,156 కి.వి•. మేర రోడ్‌ ‌లెంత్‌ ఉం‌ది. ఇందులో 82491 కి.వి•. మేర ప్లాంటేషన్‌ ‌చేశారు. పంచాయతీరాజ్‌ ‌కింద 59 వేల కిలోవి•టర్లు కవర్‌ ‌చేశారు. ఆర్‌ అం‌డ్‌ ‌బీ వారు 8652 కి.వి•. మేర మొక్కలు నాటారు. ఫారెస్టు డిపార్ట్‌మెంట్‌ అధికారులు.. జాతీయ రహదారులపై మొక్కలు నాటి, వారి పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నారు అని సీఎం కేసీఆర్‌ ‌తెలిపారు.  హరిత నిధి ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ ‌శాసన సభలో ప్రకటించిన నేపథ్యంలో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ ‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. హరిత నిధి ఏర్పాటు చేయడం వల్ల పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతను గుర్తు చేయడంతో పాటు , ప్రజల భాగస్వామ్యం పెరుగుతుందన్నారు. హరిత నిధి ఏర్పాటుకు అన్ని పార్టీల సభ్యులు ముక్తకంఠంతో స్వాగతించడం పట్ల వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిధి ఏర్పాటుతో తెలంగాణకు హరితహార కార్యక్రమ నిర్వహణ మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు.

పల్లె ప్రకృతి వనాలతో బిపి, షుగర్లు మాయం…ఊరుకో ప్రకృతి వనం..మండలానికో బృహత్‌ ‌వనం
రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రకృతి వనాలు..బీపీ, షుగర్లతో పాటు ఇతర జబ్బులతో బాధపడేవారికి ఎంతో ఉపయోగకరంగా మారాయన్నారు. ప్రశాంతతో పాటు మంచి ఆహ్లాదాన్ని పంచుతున్నాయని సీఎం తెలిపారు. శాసనసభలో హరితహారంపై స్వల్పకాలిక చర్చ చేపట్టిన సందర్భంగా సభ్యులు మాట్లాడిన అనంతరం సీఎం కేసీఆర్‌ ‌సుదీర్ఘ వివరణ ఇచ్చారు. గ్రామపంచాయతీల్లో నర్సరీలు ఏర్పాటు చేశాం. నర్సరీల ఏర్పాటులో అటవీ అధికారుల కృషి విశేషంగా ఉందన్నారు. పల్లె ప్రకృతి వనాలతో చెట్ల ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేశాం. 19,472 ఆవాసాల్లో ప్లలె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసామన్నారు. 13,657 ఎకరాల్లో ఈ వనాలు పెరుగుతున్నాయి. సర్పంచ్‌లను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. పల్లె ప్రకృతి వనాలను సర్పంచ్‌లు, మిగతా అధికారులు అద్భుతంగా తీర్చిదిద్దారు. గ్రామాల్లో బీపీ, షుగర్‌తో బాధపడేవాళ్లకు ఈ పార్కులు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయన్నారు. మండలానికి ఒకటి చొప్పున బృహత్‌ ‌ప్రకృతి వనాలు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. 526 మండల్లాలో స్థలాలు గుర్తించి 7178 ఎకరాల్లో ప్లాంటేషన్‌ ‌పనులు విస్తృతంగా జరుగుతున్నాయి. పట్టణాల్లో 109 ఏరియాల్లో 75740 ఎకరాల్లో అర్బన్‌ ‌ఫారెస్టులు ఏర్పాటు చేస్తున్నారు. 53 అర్బన్‌ ‌పార్కుల్లో పని బాగా జరిగింది. మిగతా ప్రాంతాల్లో కూడా పనులు కొనసాగు తున్నాయి. రంగారెడ్డి జిల్లాలో చెట్లు నరికివేస్తే రూ. 4 లక్షల జరిమానా విధించాం. కఠినంగా వెళ్తున్నాం అని కేసీఆర్‌ ‌స్పష్టం చేశారు. తెలంగాణలో 2 కోట్ల 75 లక్షల ఎకరాల భూభాగం ఉంది. 66 లక్షల 25 వేల ఎకరాల పైచిలుకు అటవీ భూములు ఉన్నాయి. మొత్తం అడవులు మాయమైపోయాయి. ఉమ్మడి నిజామాబాద్‌లో అద్భుతమైన అడవులు ఉండేవి . కానీ మాయమైపోయాయి. నర్సాపూర్‌లో ఒకప్పుడు ఫిలిం షూటింగ్‌లు జరిగేవి. కానీ మన కళ్ల ముందే అడవులు ధ్వంసం అయ్యాయి. అడవిని పునరుద్ధరించేందుకు మేధావులు పలు సూచనలు చేశారు. శాస్త్రీయ పద్ధతిలో వేర్ల ద్వారా అడవిని పునరుద్ధరించే అవకాశం ఉంటుంది. 230 కోట్ల మొక్కలు నాటాలని హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించాం. 1987లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సిద్దిపేటలో 10 వేల మొక్కలు నాటాలని నిర్ణయం తీసుకున్నాం.

ఆ మొక్కలను సేకరించేందుకు చాలా కష్టపడ్డాం. అనేక ఇబ్బందులు పడి 10 వేల మొక్కలు సేకరించి నాటామని తెలిపారు. అప్పట్లో నర్సరీలు ఉండేవి కావు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం 20 కోట్ల మొక్కలు అడవుల్లో పెట్టాలని నిర్ణయించాం. వేర్ల ద్వారా 80 కోట్ల మొక్కలను పునరుద్ధరించాలని, 100 కోట్ల మొక్కలు బయట నాటాలని ప్రయాణం మొదలు పెట్టాం. 20 కోట్ల మొక్కలు టార్గెట్‌గా పెట్టుకుంటే..ఇప్పటికే 20.64 కోట్ల మొక్కలు నాటాం. జీహెచ్‌ఎం‌సీ, హెచ్‌ఎం‌డీఏ పరిధిలో 10 కోట్ల మొక్కలు టార్గెట్‌ ‌పెట్టుకుంటే 14.5 కోట్ల మొక్కలు నాటాం. అటవీ ప్రాంతాల బయట 130 కోట్లు టార్గెట్‌గా పెట్టుకుంటే, 176.82 కోట్లు నాటడం జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది అని సీఎం కేసీఆర్‌ ‌పేర్కొన్నారు. గ్రీనరీలో ప్రపంచంలోనే తెలంగాణ రాష్ట్రం మూడో స్థానంలో ఉందని సీఎం కేసీఆర్‌ ‌స్పష్టం చేశారు. మొదటి స్థానంలో కెనడా, రెండో స్థానంలో బ్రెజిల్‌, ‌మూడో స్థానంలో తెలంగాణ నిలిచిందన్నారు. యూఎన్‌వో కూడా తెలంగాణ హరితహారం కార్యక్రమాన్ని గుర్తించి ప్రశంసించింది అని సీఎం గుర్తు చేశారు. శాసనసభలో హరితహారంపై స్వల్పకాలిక చర్చ చేపట్టిన సందర్భంగా సభ్యులు మాట్లాడిన అనంతరం సీఎం కేసీఆర్‌ ‌సుదీర్ఘ వివరణ ఇచ్చారు. మన దేశంలోనే అత్యంత నిరాదరణకు గురైన రంగం అటవీ రంగం. దీని కారణంగా పర్యావరణ సమతుల్యత దెబ్బతిన్నది. ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. వర్షాలు తగ్గిపోయాయి. కరువులు వచ్చాయి. దీన్ని ప్రపంచవ్యాప్తంగా అందరూ గమనిస్తుంటారు. భవిష్యత్‌ ‌తరాలకు ప్రమాదం, నష్టం జరగకుండా ఉండేందుకు శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు తగు సూచనలు చేస్తుంటారు. పర్యావరణ సమతులత్యత పెంచడం, గ్రీనరీని పెంచడం వంటి అంశాలపై దృష్టి సారిస్తారు. న్యూజిలాండ్‌లో ఓ పార్టీ పేరే గ్రీన్‌ అని ఉంది. ఆ పార్టీ సృష్టించిన అవగాహన వల్ల అక్కడ పర్యావరణ సమతుల్యత దెబ్బతినలేదు. గ్రీనరీ పెంచడమే లక్ష్యంగా గ్రీన్‌ అని పార్టీకి పేరు పెట్టారు. ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు మారిపోయాయి. సామాజిక అడవులతో అనేక ప్రయోజనాలుంటాయి. జీడీపీలు, జీఎస్‌డీపీలు పెంచినా, వ్యక్తులు తమ ఆస్తులు పెంచినా.. జీవించలేని పరిస్థితులు లేకపోతే ఏం చేయగలం. కాబట్టి దీనిపై ప్రతి ఒక్కరూ దృష్టిసారించాలి. తెలంగాణ రాష్ట్రంలో గ్రీనరీని పునరుద్ధించాలనే ఉద్దేశంతో.. ఈ స్జబెక్టుపై సవి•క్ష చేశాను. పచ్చదనం తగ్గిపోవడం, పరిస్థితులు మారిపోవడం, వాతావరణ పరిస్థితులు ప్రతికూలించడం.. వీటిని పునరుద్ధరించడం కోసం అనేక ప్రయత్నాలు ఉంటాయి. అనేక రకాల ప్రకృతి వైపరీత్యాలను తట్టుకోవాలంటే మొక్కలు నాటాలి. మొక్కలు నాటడం ద్వారా ప్రకృతి వైపరీత్యాలను అడ్డుకోవచ్చని సీఎం కేసీఆర్‌ ‌తెలిపారు.

Leave a Reply