Take a fresh look at your lifestyle.

రైతురాజ్యం ముసుగులో అరాచక పాలన

  • సీఎం కెసిఆర్‌పై మండిపడ్డ అఖిలపక్ష నేతలు
  • పేదల కరెంటు బిల్లులను మాఫీ చేయాలి
  • జేఎస్‌ అధ్యక్షుడు, ప్రొ।। కోదండరామ్‌

‌ప్రతిపక్షాలు ఏం చేయాలన్నా ప్రభుత్వానికి లాక్‌ ‌డౌన్‌ ‌నిబంధనలు గుర్తుకొస్తాయని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. అధికార పార్టీ చేస్తే మాత్రం గుర్తుకు రావన్నారు. టిజెఎస్‌ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కోదండరాం రైతురాజ్యం ముసుగులో సీఎం కేసీఆర్‌ ‌రాచరిక పాలన సాగిస్తున్నాడని ఆరోపించారు. ప్రజల సమస్యలను వెలుగులోకి తెచ్చేందుకు ఐక్యంగా పని చేస్తామన్నారు. డబ్ల్యూహెచ్‌ఓ ‌నిబంధనల ప్రకారం కరోనా పరీక్షలు చేయాలని కోరామన్నారు. అసంఘటిత కార్మికులకు ప్రత్యేక ప్యాకేజి ప్రకటించాలని డిమాండ్‌ ‌చేశారు. లాక్‌ ‌డౌన్‌ ‌పొడగించి లిక్కర్‌ అమ్మకాలు చేయడంతో జనం పెద్ద ఎత్తున బయటకు వస్తున్నారన్నారు. రెడ్‌జోన్‌ ‌లలో మద్యం అమ్మకాలను పూర్తిగా నిలిపేయాలన్నారు. పేదల కరెంటు బిల్లులను మాఫీ చేయడంతో పాటు ఇసుక అక్రమ రవాణాను ఆపాలని డిమాండ్‌ ‌చేశారు. లాక్‌ ‌డౌన్‌ ‌లో ధాన్యం కొనుగోలు లో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఆ తర్వాత మాట్లాడిన పొన్న ప్రభాకర్‌ ,‌చాడ వెంటక్‌ ‌రెడడ్డిలు ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మద్యం అమ్మకాలతో కరోనా వ్యాప్తి పెరిగితే కేసీఆర్‌ ‌బాధ్యత వహించాలని డిమాండ్‌ ‌చేశారు. ఆరు వారాల లాక్‌ ‌డౌన్‌ ‌లో సమాచారం సేకరించి సీఎస్‌ ‌కి పంపిస్తే సీఎం అవహేళనగా మాట్లాడుతున్నారన్నారు. చిల్లర రాజకీయాలు ఎవరివో ప్రజా క్షేత్రంలో బయటపడతాయని హెచ్చరించారు. ఆదాయాలు పెంచుకుంటున్నారు తప్పితే పేదల కష్టాలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కరోనా పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య ప్రకటించడంలో ప్రభుత్వానికి పారదర్శకత లేదన్నారు. కోదండరాం నేతృత్వంలో ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాడుతామన అన్నారు. కరోనా విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు.

Leave a Reply