Take a fresh look at your lifestyle.

విభజన హామీల సాధనలో విఫలం

  • నీళ్లు, నిధులు, నియామకాల మాటే మరిచారు
  • రాష్ట్రంలో సమస్యలన్నీ ఎక్కడివక్కడే
  • టీ-జర్నలిస్టుల ఫోరమ్‌ ‌రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశంలో ప్రభుత్వంపై మండిపడ్డ వక్తలు
    పొత్తూరికి ఘన నివాళి

విభజన హామీల సాధనలో టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్‌ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేనికారణంగా సమస్యలన్నీ ఎక్కడ వేసినవి అక్కడే ఉన్నాయని విమర్శించారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌ ‌క్లబ్‌ ‌లో టీ-జర్నలిస్టుల ఫోరమ్‌ ఆధ్వర్యంలో ‘తెలంగాణ రాష్ట్రం-విభజన హామీలు’ అంశంపై రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశం జరిగింది.సమావేశంలో ముందుగా సుప్రసిద్ధ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావుకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా హాజరైన ప్రొఫెసర్‌ ‌కోదండరాం మాట్లాడుతూ విభజన చట్టం తయారైనప్పుడు అప్పటికి కేంద్రంలో జైపాల్‌ ‌రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందో తెలిసేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. విభజన చట్టంలో కొన్ని సమస్యలు ఉన్నాయని, ఉద్యోగుల విభజనకు సంబంధించిన జిల్లా, రాష్ట్ర స్థాయిలో పనిచేసే వారు పూర్తి విరుద్ధంగా ఉద్యోగుల విభజన జరిగిందన్నారు. ఆంధ్రా ప్రాంతంలో ఉన్న ఉద్యోగులు ఇక్కడికి రావాలి కానీ ఉద్యోగుల విభజన నేటికీ కూడా పూర్తికాలేదన్నారు. చట్ట ప్రకారం జరగాల్సిన ఉందన్నారు. తక్షణమే పబ్లిక్‌ ‌రంగ సంస్థల విభజన జరగాలన్నారు. ఇంకా అనేక సంస్థలు విభజనకు నోచుకోలేదన్నారు. తెలంగాణకు రావాల్సిన నీటి వాటా గోదావరి నీళ్లు వాటాలో ఎలాంటి ఇబ్బంది లేదని, కృష్ణ విషయంలో మాత్రమే మన వాటా కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. నీటి వాటా విషయంలో క్రిష్టా బోర్డు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉందన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెంచాల్సి ఉందన్నారు. అభివృద్ధి కోసం కొన్ని రాయితీలు ప్రకటించారు, ఆర్టికల్‌ 93, 94 అమలు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన రాబట్టంలో అధికార పార్టీ రాబట్టుకోలేకపోతుందన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివ్రుద్ధికి నిధులు రావడం లేదన్నారు.

లక్షన్నర పోస్ట్ ‌పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వెంటనే భర్తీ చేయాలన్నారు. బడ్జెట్‌ ‌లెక్కలు ప్రకటించనదానికి ఖర్చు పెట్టిన దానికి చాలా వ్యత్యాసం ఉందన్నారు. నిధులు లేవని చెబుతున్నారని, ఖర్చు అయిన నిధులు 50-55 శాతం మాత్రమే అన్నారు. వ్యవసాయ రంగానికి కేటాయింపులు ఉన్నాయని కానీ నిధులు లేవు, మూడెకరాలు ప్రకటించారు కానీ నిధులు లేవనీ, నిధులు కొరత ఎందుకు ఏర్పడుతుందని ప్రశ్నించారు. పత్రికల తప్పిదాలను జర్నలిస్టుల ఫోరంపై ఆపాదించకోడదన్నారు. కీలక అంశాలపై ఓ కార్యాచరణ ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఓ వేదికను కేవలం చర్చల కోసం ఏర్పాటు చేసుకోవాలన్నారు. పత్రికలు, ఛానళ్లను ఆక్రమించుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయని వాటిపై పోరాటం చేయాలన్నారు.

రాష్ట్రంలో పరిస్థితులపై విశ్లేషణ జరగాలి : చుక్కా రామయ్య
ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య మాట్లాడుతూ పత్రికలు అంటే కేవలం వార్తలు అమ్ముకునే వ్యవస్థ కాదు ప్రజలను చైతన్యం చేసి వార్తలు రాసి పోరాటలకకు సిద్ధం చేయా లన్నారు. రాష్ట్రం, దేశంలో సమస్యలపై పోరాడాల్సిన అవసరరం ఉందని, దేశం, రాష్ట్రంలో పరిస్థితులపై విశ్లేశించాల్సిన అవసరం ఉందని తెలంగాణ కోసం పోరాడడిన పొత్తూరి వెంకటేశ్వరరావు మరణం కలవరపరుస్తుందన్నారు. పొత్తురి లాంటి వాళ్లు ప్రజల కోసం ఎంతో పోరాడారని అన్నారు. చాడ వెంకట్‌ ‌రెడ్డి మాట్లాడుతూ ఆరేళ్లైనా హామీలు నెరవేరలేదని పునర్‌ ‌విభజన చట్టం హామీలను నేటికీ కూడా అమలు చేయలేదన్నారు. విద్యార్థులు, యువకుల బలిదానాల ఫలితంగానే తెలంగాణ ఏర్పడిందని విభజన హామీలను నెరవేర్చాల్సిన అవసరం ఉందన్నారు. విభజన హామీల కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. టీ జర్నలిస్టుల ఫోరం నేత పల్లె రవికుమార్‌ ‌మాట్లాడుతూ వివిధ పార్టీల నాయకులు తెలంగాణ పునర్‌ ‌నిర్మాణం విభజన హామీల అమలు కోసమే ఈ వేదిక పని చేస్తుందని ఈ వేదిక ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు. సీనియర్‌ ‌జర్నలిస్టు పాశం యాదగిరి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రా మీడియా అణిచివేశారన్నారు. తెలంగాణను ముంచి పోలవరం కడుతుంటే ఒక్కరు కూడా స్పందించలేదన్నారు.

ఉద్యమ స్ఫూర్తితో పోరాడాలి : రమణ
టీటీడీపీ ఎల్‌. ‌రమణ మాట్లాడుతూ మా చిన్న వయస్సులో ప్రాథమిక విద్య సమయంలో మొదటి దశ ఉద్యమం, తర్వాత మలి దశ, తుదిశ ఉద్యమాలు జరిగాయని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ పరిపాలన తీరు, నిర్ణయాలు రాష్ట్రం ఏర్పాటు కాకముందు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నామని, నీళ్లు, నిధులు, నిమయాకాలు కోసం తెచ్చుకున్న రాష్ట్రం మీడియా అంటే వార్తలు రాయడం కాదని, ప్రజలను చైతన్యం పర్చాలన్నారు. టీ కాంగ్రెస్‌ ‌నేత అద్ధంకి దయాకర్‌ ‌మాట్లాడుతూ ఉద్యమాలు, ప్రాణ త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణలోఆత్మ వంచనాతో బతకాల్సి వస్తుందన్నారు. వాస్తవానికి తెలంగాణ ఆంధ్రా టెక్నికల్‌ ‌మాత్రమే విడిపోయాయి, రెండు కలిసిగా పని చేస్తున్నట్లు అనిపిస్తుందన్నారు.

ప్రభుత్వ హామీలు బుట్ట దాఖలు : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌
•‌బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ‌మాట్లాడుతూ ప్రభుత్వ హామీలు బుట్టదాఖలు అవుతున్నాయనీ, విభజన హామీల అమలు అనే దానికంటే..ఆరేళ్లుగా అధికార పార్టీ రాష్ట్రంలో హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. ఏ హామీలతో అధికారంలో వచ్చిందో వాటిని టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం వాటి ఊసెత్తడంలేదు..నీళ్లు, నిధులు, నియామకాలంటే మన బతుకుల్లో వెలుగులు నిండుతున్నాయని అనుకున్నామన్నారు. కొత్త ఉద్యోగాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిమ్స్ ‌కోసం ప్రభుత్వ స్థలం సేరించి ఇస్తే కేంద్రం అన్ని విధాలుగా సహకరించేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కిగౌడ్‌ ‌మాట్లాడుతూ ప్రపంచంలో కరోనా ఎంత ప్రమాదకరమో కల్వకుంట్ల కుటుంబం కూడా అంతే ప్రమాదకరమన్నారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర అత్యంత కీలకమని టి జర్నలిస్టుల ఫోరమ్‌ ‌రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. తెలంగాణలో ప్రాజెక్టుల పేరుతో లక్ష కోట్లకుపైగా కల్వకుంట్ల కుటుంబం దోచుకుందన్నారు.

Leave a Reply