నాగర్ కర్నూల్, మే 21.ప్రజాతంత్రవిలేకరి: రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని పెద్దకొత్తపల్లి మండలం భారతీయజనతాపార్టీ మండలాధ్యక్షులు పధిర భీమేష్ అన్నారు. గురువారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పిలుపు మేరకు రైతు బంధు పథకాన్ని ఎలాంటి పంట వేయాలి అనే షరతులు లేకుండా అమలు, ఏకకాలంలో రైతు రుణమాఫీ వెంటనే అమలు చేయాలని పెద్దకొత్తపల్లి మండల తహసీల్దారుకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల కు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బందు పథకం కింద ఏ ప్రాతిపదికన రైతుల ఖాతాలో డబ్బులు జమ చేశారో అదే ప్రాతిపదికన ప్రస్తుతం మరియు కొత్తగా అర్హులైన రైతులందరికీ 5వేల రూపాయల చొప్పున రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు.
అసెంబ్లీ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి రైతులందరికీ లక్ష రూపాయల వరకు రుణాలు మాఫీ చేస్తామని వాగ్దానం చేశారని గుర్తు చేశారు.టీఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టి 18 నెలలు గడిచినా ఇంతవరకు రైతు రుణమాఫీ చేయలేదని, రైతుల పట్ల అశ్రద్ధ తూపుతుందని అన్నారు. కావునా లక్ష రూపాయలు కలిగిన రైతు రుణాలను వెంటనే మాఫీ చేసి మళ్లీ కొత్త రుణాలను ఇచ్చేందుకు తగిన చర్యలు చేపట్టాలని భారతీయ జనత పార్టీ తరుపున ప్రభుత్వా నికి వినేస్తున్నామని అన్నారు.ఈ కార్యక్ర మంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జలాల్ శివుడు, నాయకులు గువ్వలి వెంకటయ్య, ప్రధీప్, తిరుమల్, మల్లేష్, శివ, సాతాని శ్రీనివాస్, విష్ణు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.