“భారతదేశంలోని నేటి అంకుర సంస్థల సమూహానికి తగినంత శక్తిసామర్థ్యాలతోపాటు వాటిని దీటుగా ఎదురొడ్డగల పరిణతి కూడా మెండుగా ఉంది. కాబట్టి అవకాశం ఇప్పుడు ఎదురుగానే ఉంది… చైనా యాప్లపే నిషేధంతో దానికి మరింత బలం తోడైంది… ఇక ముందుకు దూకి, విజయ లక్ష్యాన్ని అందుకోవడమే అంకుర సంస్థల కర్తవ్యం. కఠోర కృషి, వైఫల్యాల నుంచి నిరంతర అభ్యసనం ద్వారానే అన్ని అవరోధాలను అధిగమించగలం. అంకుర సంస్థల అంటే నిర్వచనం ఇదే! అదృష్టవశాత్తూ దేశంలో నేడు అంకుర సంస్థల పర్యావరణం బహు విస్తృతం. ఆ మేరకు ఒకటి కాకపోతే మరొకటి విజయపథంలో ముందడుగు వేయగలదు. ఆ మేరకు మన దేశవాసులంతామొబైల్ ఫోన్లలో సగర్వంగా వినియోగించుకునే స్థాయికి మన అనువర్తనాలు ఎదిగే రోజు త్వరలోనే రావాలని ఎదురుచూద్దామా!”
మొబైల్ ఫోన్ అనువర్తనాలు- ‘వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, జీమెయిల్, పేటీఎం లేదా టిక్‌టాక్ వంటిది ఏదైనా కావచ్చు… అవి తమ రూపకర్తలకు భారీ రాబడులు తెచ్చిపెడతాయి. అంతేకాదు- మన ఫోన్లు, టాబ్లెట్లలోని సదుపాయాలను,వాటి పనితీరును నిర్ధారించేది కూడా ఇలాంటివే. ఆ మేరకు నేడు భారతదేశంలో వినియోగిస్తున్న అనువర్తనాలలో అధికశాతాన్ని సృష్టించింది, నిర్వహిస్తున్నది విదేశాల్లోని… ప్రధానంగా పాశ్చాత్య, ఇటీవలి కాలంలో చైనా దేశానికి చెందిన కంపెనీలే. ఈ నేపథ్యంలో నేడు దేశంలో 80 కోట్లమంది స్మార్ట్ ఫోన్ వాడకందారులుగా మనమంతా ఆ అనువర్తనాల రూపకర్తలకు గణనీయంగా ఆదాయం సమకూరుస్తున్నాం. ముఖ్యంగా “టిక్‌టాక్” యాప్‌కు వేగంగా పెరుగుతున్న మార్కెట్లలో భారత్ కూడా ఒకటి. ఆ మేరకు ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల డౌన్లోడ్లకుగాను 30 శాతం భారత్‌లోనే చోటుచేసుకుంటున్నాయి. అదే సమయంలో భారత కంపెనీలు తమ విదేశీ ప్రత్యర్థులతో పోటీపడగల అనువర్తనాలతో గణనీయ వినియోగదారుల పునాదిని సృష్టించుకోవడంలో విఫలమయ్యాయి.
పదేళ్ల కిందట చైనాలోనూ ఇదే పరిస్థితి ఉండేది. అప్పట్లో అమెరికా, ఐరోపా దేశాలు రూపొందించిన అనువర్తనాలు రాజ్యమేలుతుండేవి. ఈ పరిస్థితుల నడుమ తమ దేశంలో విదేశీ అనువర్తనాల వాడకాన్ని చైనా ప్రభుత్వం ఒక్కదెబ్బతో నిషేధించింది. ఉదాహరణకు॥ ‘వాట్సాప్’కు చైనాలో అనుమతి లేదు… ఈ నిషేధంతో చైనాలోని దేశీయ కంపెనీలకు నాణ్యమైన అనువర్తనాల రూపకల్పన అవకాశం లభించింది. తదనుగుణంగా అవి దేశంలో పెద్దసంఖ్యలోగల మొబైల్ వాడకందారుల సంఖ్యను సద్వినియోగం చేసుకుంటూ అనేక అమెరికా ఉత్పత్తులకు దీటైన అనువర్తనాల సృష్టిలో విజయవంతం అయ్యాయి. ఆ క్రమంలో చివరి విదేశీ పోటీదారు మార్కెట్ నుంచి వైదొలగడంతో చైనాలోని ‘వియ్‌చాట్’ వంటి యాప్‌లు లబ్ధి పొందాయి. అదేవిధంగా ‘గూగుల్ మ్యాప్స్’సహా గూగుల్అనువర్తనాలన్నిటినీ చైనా నిషేధించడంతో అక్కడ ‘బైడు’ (ప్రజాదరణగల శోధన ఉపకరణం) గూగుల్ తరహా యాప్‌లను తయారు చేయడానికి దారితీసింది.
‘అలీపే, క్యుక్యూబ్’ యాప్లదీ ఇదేతరహా విజయగాథ… ఇవి ఏకంగా ‘ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్’ వంటి అనువర్తనాల స్థానాన్ని భర్తీచేశాయి. చైనాలోని అలీబాబా గ్రూప్ వంటి సంస్థల ప్రోత్సాహక నిధుల నుంచి ఆయా కంపెనీలకు భారీగా నిధులు అందుబాటులోకి రావడంతో వాటి విలువ నేడు పాశ్చాత్య దేశాల్లోని ప్రముఖ కంపెనీలతో సరితూగుతోంది. ఇటీవలి కాలంలో అనేక చైనా అనువర్తనాలు భారతదేశంలోనూ గణనీయంగా చొచ్చుకుపోయాయి. ఇప్పుడు చైనా అనువర్తనాలపై నిషేధంతో దేశీయ యాప్‌ల రూపకల్పనద్వారా మన మార్కెట్‌ను సొంతం చేసుకోవడంసహా ఒకనాటికి అంతర్జాతీయంగా విస్తరించగల సదవకాశంగా భారత అంకుర సంస్థలు దీన్ని సద్వినియోగం చేసుకోగలవా? ఈ ప్రశ్నకు ‘అవును’ అన్నదే సమాధానం… కానీ, ఇది అంత సులభమేమీ కాదు! అటువంటి యాప్‌లు సృష్టించగల కొన్ని శక్తిసామర్థ్యాలు భారత యువతరానికి ఉన్నమాట నిజమే. ఆ మేరకు ఫేస్బుక్, గూగుల్ వంటి సాంకేతిక దిగ్గజ కంపెనీల కోసం వారు అటువంటి ఉత్పత్తుల రూపకల్పనలో శ్రమిస్తున్నారు. దేశంలో అటువంటి కృషి దిశగా నైపుణ్యం విస్తరిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో మాధ్యమికోన్నత పట్టభద్రులందరికీ అందుబాటులో ఐఐటీ-మద్రాస్ బీఎస్సీ డేటా సైన్సెస్ ఆన్లైన్ డిగ్రీ కోర్సుకు శ్రీకారం చుట్టింది. ఈ వినూత్న ఆరంభంతో పెద్ద సంఖ్యలో అత్యంత నాణ్యమైన అనువర్తన సృష్టికర్తలు ఆవిర్భవించే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి వినూత్న కార్యక్రమాలు ఇటువంటి సామర్థ్యాలను ఇతోధికంగా బలోపేతం చేస్తాయి.
మొబైల్ అనువర్తనాలు విజయం సాధించాలంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని మించి మరేదో కావాలి. అదేమిటంటే… కొత్త యాప్‌లు బహుళ ప్రాచుర్యం పొందాలంటే అవి లక్షిత వాడకందారులను తక్షణం ఆకట్టుకునేలా రూపొందాలి. వాటి స్వరూపం, భావన, నిర్మాణం వంటివి ఎంతో ఆకర్షణీయంగా, సులభంగా వాడుకోగలిగే విధంగా మాత్రమేగాక ఆవిష్కరణాత్మక లక్షణాలుండాలి. అదే సమయంలో వాటిని నిత్యనూతనంగా ఆవిష్కరిస్తూ, స్వరూప-స్వభావాల పునఃరూపకల్పన, కొత్త లక్షణాల జోడింపు వంటివి నిరంతరం సాగాలి. అదే సమయంలో ప్రతి ప్రాంతంలోని వినియోగదారుల అలవాట్లను ప్రతిబింబించేవిగా ఉంటూ వారిని తమతో మరింత మమేకం చేసుకోగలగాలి. ఇందుకోసం భారీ, నిధులుసహా అత్యున్నత ప్రతిభావంతులూ అవసరం. అలాగే మార్కెట్లోకి బలమైన రీతిలో ప్రవేశించగలిగే ఆర్థిక మద్దతు కూడా సదరు యాప్‌లకు దృఢంగా ఉండాలి. ఇవన్నీ అంకుర సంస్థలకు సవాళ్లేననడంలో సందేహం లేదు. ఇలాంటి ఎన్ని సవాళ్లున్నా భారతదేశంలోని నేటి అంకుర సంస్థల సమూహానికి తగినంత శక్తిసామర్థ్యాలతోపాటు వాటిని దీటుగా ఎదురొడ్డగల పరిణతి కూడా మెండుగా ఉంది. కాబట్టి అవకాశం ఇప్పుడు ఎదురుగానే ఉంది… చైనా యాప్లపే నిషేధంతో దానికి మరింత బలం తోడైంది… ఇక ముందుకు దూకి, విజయ లక్ష్యాన్ని అందుకోవడమే అంకుర సంస్థల కర్తవ్యం. కఠోర కృషి, వైఫల్యాల నుంచి నిరంతర అభ్యసనం ద్వారానే అన్ని అవరోధాలను అధిగమించగలం. అంకుర సంస్థల అంటే నిర్వచనం ఇదే! అదృష్టవశాత్తూ దేశంలో నేడు అంకుర సంస్థల పర్యావరణం బహు విస్తృతం. ఆ మేరకు ఒకటి కాకపోతే మరొకటి విజయపథంలో ముందడుగు వేయగలదు. ఆ మేరకు మన దేశవాసులంతామొబైల్ ఫోన్లలో సగర్వంగా వినియోగించుకునే స్థాయికి మన అనువర్తనాలు ఎదిగే రోజు త్వరలోనే రావాలని ఎదురుచూద్దామా!.
అశోక్ ఝన్‌ఝన్‌వాలా.. తమస్వతి ఘోష్,
ఐఐటీ-మద్రాస్ సంవర్ధన విభాగం