Take a fresh look at your lifestyle.

‘ఏసిటినో బాక్టర్‌ ‌బోమని’ బ్యాక్టీరియాతో ఆప్తామాలిక్‌ అసిస్టెంట్‌ ‌మృతి

అరుదైన ‘ఏసిటినో బాక్టర్‌ ‌బాక్టీరియాతో’ అనారోగ్యానికి గురై జమ్మికుంట ఆసుపత్రిలో ఆప్తామాలిక్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్‌ ‌జి.సత్యనారాయణ రెడ్డి ఏసిటినో బాక్టర్‌ ‌బాక్టీరియాతో అనారోగ్యానికి గురై బుధవారం మృతి చెందాడు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం సత్యనారాయణరెడ్డి గత కొంతకాలంగా జమ్మికుంట ఆసుపత్రిలో డిప్యుటేషన్‌పై విధులు నిర్వహిస్తున్నాడు. గత వారం రోజుల క్రితం తీవ్ర దగ్గుతో బాధపడుతుండ టంతో హన్మకొండలోని మాక్స్ ‌కేర్‌ ఆసుపత్రిలో చేర్పించారు. వ్యాధి నిర్ధారణ కాకపోవడంతో హుటాహుటిన హైదరాబాదులోని కిమ్స్ ‌హాస్పిటల్‌కు గత నెల 31న తరలించారు. ఆసుపత్రిలో అన్ని రకాల పరీక్షలు నిర్వహించిన అనంతరం ఎసిటినో బాక్టర్‌ ‌బోమని బ్యాక్టీరియా వైరస్‌గా వైద్యులు నిర్ధారించారు.

బ్యాక్టీరియా సోకిన వ్యక్తి ఐదు రోజుల్లో సరైన చికిత్స అందకపోవడంతో బ్యాక్టీరియాతో పోరాడి బుధవారం మధ్యాహ్నం 12:30 మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. బ్యాక్టీరియాను నిర్ధారించడంలో ఆలస్యం కావడంతో సత్యనారాయణ రెడ్డి మృతి చెందినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యమ్రంలో చురుకుగ్గా సేవలందించి చాలా మంది రోగులకు కంటి చూపు అందించడంలో కృషి చేశారు. ఇటీవల కొరోనా వైరస్‌ ‌నేపథ్యంలో కూడా విధులకు ఆటకం కలుగకుండా అనారోగ్యంతో ఉండి ఏ ఒక్క రోజు కూడా సెలువు తీసుకోలేదని బంధవులు వాపోయారు. విధుల పట్ల ఆయనకు ఉన్న నిబంధత్తతో పని చేసినట్లు ఆయనతో పని చేసే సహోద్యోగులు తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!