Take a fresh look at your lifestyle.

ఆన్‌లైన్‌ ‌విద్యలో అసమానతల తండ్లాట

ఏ ‌స్మార్ట్ ‌ఫోన్‌ ‌ద్వారానో, ట్యాబ్‌ ‌ద్వారనో తన ఇంటిలో పిల్లలకు విద్యను అందించాలంటే తక్కువలో తక్కువైనా
ఓ పదివేలు ఖర్చు అవుతుంది దీంతోపాట అదనంగా డేటా,కరెంటు ఛార్జ్ ఇవన్నీ తడిసిమోపేడయ్యే కథనే.విద్యార్థుల బాధలను దిగమింగలేక తల్లిదండ్రులు అప్పుచేసి ట్యాబ్‌ ‌ను సిద్దం చేసినా ఉన్నది ఒకటే గదిఆ గదిలోనే వంట, నిద్ర, ఇతర అవసరాలకు ఉంటుంది దాంట్లోనే  ఆన్లైన్‌ ‌తరగతిలో విద్యార్థులు ఎలా పాఠాలు వింటారో  ఓసారి గ్రామీణ ప్రాంతాలను చూసి మేధావులు ఆలోచించాలి.

భారతదేశ విద్యావిధానంలో ఆధునికీకరణ దిశగా ప్రయాణిస్తున్న తరుణంలో కరోనా విజృంభణ ఒక అడ్డుగోడను నిర్మించినట్లైంది.కరోనా కాలంలో ఏ ప్రాంతాలను ఇంకే వర్గాల ప్రజలను వదలకుండా వెంటాడుతూ వ్యవస్థలను అతలకుతలం చేసి చివరికీ పిల్లల చదువులపై ఎనలేని ప్రభావాలను చూపిస్తుంది.కరోనా దేశంలో విద్యాబోధన విధానాన్ని పూర్తిగా మార్చివేసింది. లాక్‌డౌన్‌ ‌కారణంగా విద్యాసంస్థలు మూసివేయటంతో ఆన్‌లైన్‌ ‌విద్యవైపు చూడటం తప్పనిసరైన అంశమై కూర్చుంది.ఇదే అదునుగా భావించిన కేంద్రం కూడా ఆత్మనిర్భర్‌ ‌ప్యాకేజీలో భాగంగా నూతన డిజిటల్‌ ‌విద్యావిధానాన్ని ప్రకటించింది. దీనిలో ఒక్కో తరగతికి ఒక్కో టీవీ చానల్‌ను ప్రారంభించి ఆన్‌లైన్‌ ‌పాఠాలు ప్రసారం చేయనున్నారు. అయితే, ఆన్‌లైన్‌ ‌బోధన ఎప్పటికీ తరగతి బోధనను భర్తీచేయలేదని,తరగతి గదికి విద్యార్థి కి మధ్య ఉపాధ్యాయుడు వారధిలా ఉంటూ బోధన చేస్తేనే సక్రమమైన విధానం అంటూ విద్యావేత్తల సూచన.ఉపాధ్యాయుడు తరగతి గదిలో ఒక్కో విద్యార్థి సామర్థ్యాలు ఏమిటో,బలహీనతలు ఏమిటో తెలుసుకొని ఉపాధ్యాయులు అందుకు అనుగుణంగా బోధనలో మార్పులు చేర్పులు చేసుకుంటూ బోధన చేస్తారు. ఇలాంటి బోధన ద్వారానే విద్యార్థి సమగ్ర ప్రగతి, మూర్తిమత్వం సాధ్యమనేది వాస్తవికమైన కోణం.స్వయం ప్రభు పేరుతో 1 నుంచి 12వ తరగతి వరకు ఒక్కో తరగతికి ఒక్కో చానల్‌ ‌చొప్పున 12 చానళ్లు ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించింది. అయితే ఇందులో ప్రసారం చేసే సిలబస్‌, ఇతర విధానాలపై స్పష్టత ఇవ్వకుంటే విద్యార్థుల తల్లిదండ్రులు గందరగోళానికి గురయ్యే ప్రమాదం ఉందని సీనియర్‌ ‌ప్రొఫెసర్లు అంటున్నారు. తరగతి గది బోధనకు తోడుగా డిజిటల్‌ ‌బోధనలో ఎడ్యుశాట్‌ ‌ప్రాజెక్టును చాలా రాష్ట్రాలకంటే ముందే మన రాష్ట్రంలో టీ-శాట్‌ ‌పేరుతో తరగతి గది బోధనకు తోడుగా 2016లోనే అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటికే యూట్యూబ్‌లో ఐదుకోట్ల వ్యూస్‌ ‌వచ్చాయని టీ-శాట్‌ ‌సీఈవో ఆర్‌ ‌శైలేశ్‌రెడ్డి తెలిపారు. కొరోనా సృష్ఠించిన ఆర్థికమాంద్యాలకు ప్రభుత్వాలే తల్లాడిల్లినాయి అట్లాంటిది సామాన్య మానవుని పరిస్థితులు ఊహాతీతమే.ఉప్పు పప్పు బియ్యం కొనలేని ప్రజలు ఆకలితో అలమాటిస్తారని పసిగట్టి ఉచిత నిత్యవసర సరుకులను అందించిన ప్రభుత్వం ఇప్పుడు ఆన్లైన్‌ ‌విద్య పేరిట సామాన్యుడి నెత్తిపై మరొ పిడుగు వేసింది.ఏ స్మార్ట్ ‌ఫోన్‌ ‌ద్వారానో, ట్యాబ్‌ ‌ద్వారనో తన ఇంటిలో పిల్లలకు విద్యను అందించాలంటే తక్కువలో తక్కువైనా ఓ పదివేలు ఖర్చు అవుతుంది దీంతోపాట అదనంగా డేటా,కరెంటు ఛార్జ్ ఇవన్నీ తడిసిమోపేడయ్యే కథనే.విద్యార్థుల బాధలను దిగమింగలేక తల్లిదండ్రులు అప్పుచేసి ట్యాబ్‌ ‌ను సిద్దం చేసినా ఉన్నది ఒకటే గదిఆ గదిలోనే వంట, నిద్ర, ఇతర అవసరాలకు ఉంటుంది దాంట్లోనే ఆన్లైన్‌ ‌తరగతిలో విద్యార్థులు ఎలా పాఠాలు వింటారో ఓసారి గ్రామీణ ప్రాంతాలను చూసి మేధావులు ఆలోచించాలి.

కరోనా నేపథ్యంలో కేరళ ప్రభుత్వం టెలివిజన్‌ ‌ద్వారా తరగతులను ప్రారంభించింది ఐతే ఇంట్లో సరిగ్గా ప్రసారమవ్వనందుకు దేవిక అనే విద్యార్థి తాను ఈ విద్యా సంవత్సరం కోల్పోతాననే బెంగతో ఆత్మహత్య చేసుకుంది.సరిగ్గా ఇలాంటి సంఘటలే రేపొద్దున సిగ్నల్‌ అం‌దటం లేదని విద్యార్థులు మిద్దెలపైనా చెట్లపైనా తరగతులింటూ అవి సరిగ్గా ప్రసారం కానీ పక్షంలో మరెన్నో మరణాలను చూడాల్సి వస్తుంది.సమాన విద్యా విధానమంటూ ప్రచారాలు చేసే ప్రభుత్వాలు నేడు మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రవేశపెట్టే డిజిటల్‌ ‌విద్య ఖచ్చితంగా పేద మధ్య తరగతి విద్యార్థులకు విద్యను దూరం చేయడానికి సరైనా సమయమిదేననీ నిర్ణయిం చుకున్నారు.తరగతి గదికి ఉపాధ్యాయుడికి ఉన్న సంబంధం ఏ డిజిటల్‌ ‌విద్య భర్తీ చేయలేదుతరగతి గది ఓ చిన్నపాటి సమాజం,ఆ సమాజంలో విద్యార్థులే ప్రజలు ఆ ప్రజలకే నాయకుడే ఉపాధ్యాయుడు. ఆ ఉపాధ్యాయుడు విద్యా సంవత్సరం తొలినుండి విద్యార్థుల మానసిన స్థైర్యాలను,వ్యక్తిత్వాన్ని, ప్రతిభను,ఉత్తేజాలను గమనిస్తూ నిరంతరం విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం లో బోధన చేసి పరిపూర్ణత దిశలో నడిపిస్తాడు.ఆన్లైన్‌ ‌విద్యలో కంప్యూటర్‌ ‌ముందు కూసున్న విద్యార్థి మానసిక స్థితిగతులు ఎలా ఉంటాయో ఊహించలేము కాసింత సమయం దొరికితే నీలి తెరమీద పబ్జీలాంటి ఆటలు ఆడే విద్యార్థులు ఉపాధ్యాయుల పర్యవేక్షణ లేనిదే సరైనా రీతిలో పాఠాలు వింటాడనడంలో అర్థం లేదు.డిజిటల్‌ ‌యుగంలో విద్యార్థులను తప్పుదోవ పట్టించడానికి ఏవేవో అడ్వర్టైజింగ్‌ ‌మెసేజ్‌ ‌లు,ఇతర అసభ్యకరమైన వీడియోలు పిల్లల మానసిక వికాసమై ఎనలేని ప్రభావం ఖచ్చితంగా ఉంటుందనేది టెక్నికల్‌ ‌నిపుణుల వాదన.

మన దేశంలో బడి అంటే ఉదయం నుండి సాయంత్రం దాకా ఒక గదిలో బందించే విధానమేననీ, పొద్దస్తమానం పరీక్షలు,అసైన్‌ ‌మెంట్లు,వగైరాలే విద్యార్థులకు వచ్చే ఆలోచన కానీ నెదర్లాండ్స్ ‌స్విట్జర్లాండ్‌ ‌లాంటి దేశాలలో ఓ సంవత్సరం పాటు పాఠశాల తెరువకున్న ఇంటి దగ్గరే నేర్చుకునే కరికులం అంశాలు సిద్దంగా ఉండి విద్యార్థుల మానసిక,శారీరక ధృఢత్వాలను పెంచుతాయి.అలాంటి నూతన విధానాలు కూడా మన దేశానికి అవసరమైన కరోనా సందర్భంలో ప్రొఫెసర్ల వాదన.ఈ దేశంలో ఎన్నోయేం డ్లపాటు దళిత బహుజన ప్రజలకు విద్య దూరం కాకుండా చేసిన తీరుగానే నేడు డిజిటల్‌ ‌విద్యావిధానం సరిగ్గా అదేబాటలో పయనిస్తుంది.ఇరవై ఒకటవ శతాబ్దంలోకి అడుగుపెట్టిన సమాన విద్యా విధానం అందని ద్రాక్షలాగే బడుగు బలహీన వర్గాల చేతుల్లోకి రాకుండా పోతుంది.మన దేశంలో డిజిటల్‌ ‌విద్యావిధానం అమలు చేయాలంటే ప్రతీ విద్యార్థికి ఉచితంగా ట్యాబ్‌,‌డేటా,ఆ జ్యూమ్‌ ‌యాప్‌ ‌లను వాడటంలో శిక్షణ,సిలబస్‌ ‌లాంటి సమస్యలను అధిగమించినప్పుడే డిజిటల్‌ ‌విద్యావిధానం ద్వారానే డిజిటల్‌ ‌విద్య సాధ్యమౌతుంది.
అవనిశ్రీ. కవి,రచయిత. 9985419424

Leave a Reply