Take a fresh look at your lifestyle.

బిజెపి మేనిఫెస్టోలో ఆచరణ సాధ్యం కాని హాలు

విమర్శలు గుప్పించిన కాంగ్రెస్‌ ‌పార్టీ
సిమ్లా:  ‌హిమాచల్‌ ‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపిస్తే ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో అడ్మిషన్లలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ ‌కల్పిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. నిజానికి బిజెపి ఈ హ గతంలోనే ఇచ్చినా వాటిని నెరవేర్చలేదు. తాజాగా మరోమారు హా ఇవ్వడం ద్వారా ప్రజలను బురిడీ కొట్టించాలని చూస్తోంది. విపక్ష కాంగ్రెస్‌ ‌దీనిపై ఘాటుగానే స్పందించింది. నిజానికి గత ఎనిమిదేళ్లుగా మోడీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లును అటకెక్కించింది. నిరుద్యోగాన్ని గాలికొదిలేసింది. ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను అమ్మకానికి పెట్టింది. వీటి గురించి ఎక్కడా మాట్లాడడం లేదు. కేవలం ఓట్లకు అవసరమైన మాటలనే మాట్లాడుతోంది. ఈ క్రమంలో తాజాగా హిమాచల్‌ ఎన్నికల ప్రణాళిక విడుదలలో ఇవే వాగ్దానాలు చేయడంపై కాంగ్రెస్‌ ‌మండిపడింది.

యూనిఫామ్‌ ‌సివిల్‌ ‌కోడ్‌(‌యూసీసీ) అమలు చేస్తామని ప్రకటించింది. ఇది దేశానికి సంబంధించినదైతే రాష్ట్రంలో మాట్లాడడంపై కాంగ్రెస్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేసింది. ఈనెల 12న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆదివారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. పార్టీ మేనిఫెస్టోను సంకల్ప్ ‌ప్ర ‌పేరుతో విడుదల చేశారు. మహిళల కోసం ప్రత్యేక మేనిఫెస్టోను రిలీజ్‌ ‌చేశారు. ఇందులో 11 అంశాలను ప్రస్తావించారు. తాము ఇచ్చిన హాలు ఉచితాలు కాదని.. సాధికారతకు, ప్రలోభాలకు తేడా ఉందని అన్నారు. సమాజంలోని అన్ని వర్గాల సాధికారత కోసం బీజేపీ పని చేస్తుందని, ప్రలోభాలకు, ఉచితాలకు తమ పార్టీ వ్యతిరేకమని చెప్పారు.

కాంగ్రెస్‌ ‌విడుదల చేసిన మేనిఫెస్టోకు దశ, దిశ లేదని విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్‌ ‌మేనిఫెస్టోల మధ్య పోలికే లేదన్నారు. పెద్దపెద్ద హాలను కాంగ్రెస్‌ ఇచ్చిందని, కానీ వాటిని అమలు చేసే ఉద్దేశం ఆ పార్టీకి లేదని అన్నారు. 2017లో రాజస్థాన్‌, ‌చత్తీస్‌గఢ్‌లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌..ఇచ్చిన హాలను మాత్రం అమలు చేయలేదని ఆరోపించారు. పాత పెన్షన్‌ ‌స్కీమ్‌(ఓపీఎస్‌)‌ను పునరుద్ధరిస్తామని కాంగ్రెస్‌ ఇచ్చిన హాపై బీజేపీ నేత మంగళ్‌ ‌పాండే స్పందించారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రిపోర్టు ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

Leave a Reply