నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్
సిద్ధిపేట పట్టణానికి చెందిన ఆటో డ్రైవర్ ఒకరు తన నిజాయితీని చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్లితే…ఆటో డ్రైవర్ ఆంజనేయులు తన ఆటోలో ప్యాసింజర్లను ఎక్కించుకుని మెదక్ రోడ్లో గల సెంట్రల్ బ్యాంకు చౌరస్తాలో వారి దిగి వెళ్లి పోగా ఆటో వెనుక సీటులో వివో కంపెనీకి చెందిన 25 వేల రూపాయల విలువ గల ఫోను మరిచి పోయారు. ఆటోడ్రైవర్ వారి గురించి వెతుకగా దొరకనందున వెంటనే సిద్దిపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు వచ్చి సెల్ ఫోన్ అందజేశాడు.
ట్రాఫిక్ ఎస్ఐ షకీల్ హైమద్, ట్రాఫిక్ సిబ్బంది ఫోన్ గురించి ఆరా తీయగా సిద్దిపేట పట్టణం సాజిద్పూర కాలనీకి చెందిన శమీనా బేగందని తెలుసుకొని వారికి సంబంధించిన వారిని పోలీస్ స్టేషన్కు పిలిపించి సెల్ ఫోన్ను అందజేశారు. నిజాయితీని చాటుకున్న ఆటో డ్రైవర్ ఆంజనేయులును పోలీసులు అభినందించారు.