Take a fresh look at your lifestyle.

విస్తరిస్తున్న స్వైన్‌ ‌ఫ్లూ

On the irregularities in Gandhi .. Government is serious

  • 30కి చేరిన రోగుల సంఖ్య
  • గాంధీ, ఉస్మానియా, చెస్ట్
  • ఆసుపత్రులలో వైద్య చికిత్సలు

రాష్ట్రంలో స్వైన్‌ ‌ఫ్లూ క్రమంగా విస్తరిస్తున్నది. ఈ వైరస్‌ ‌సోకిందన్న అనుమానంతో రాజధానిలోని ఉస్మానియా, గాంధీ, చెస్ట్ ‌వంటి ప్రధాన ఆసుపత్రులకు వస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. జనవరి 1 నుంచి ఇప్పటి వరకు బుధవారం వరకు ఈ ఆసుపత్రులకు దాదాపు 500కి పైగా అనుమానితులు రాగా, ఆయా ఆసుపత్రుల వైద్యులు వారికి పరీక్షలు నిర్వహించారు. , వారిలో ఇప్పటి వరకు 30 మందికి స్వైన్‌ ‌ఫ్లూ వైరస్‌ ‌సోకినట్లు నిర్ధారణ అయిందని వైద్యులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా స్వైన్‌ ‌ప్లూ వైరస్‌ ‌సోకిన వారికి ఆయా ఆసుపత్రులలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వార్డులలో కాకుండా సాధారణ వార్డులలోనే వైద్య చికిత్సలు అందిస్తుండటం రోగులను భయభ్రాంతులకు గురి చేస్తున్నది. స్వైన్‌ ‌ఫ్లూ కారక హెచ్‌1ఎన్‌1 ‌వైరస్‌ ఇతరులకు అతి సులువుగా సోకుతుంది. స్వైన్‌ ‌ఫ్లూ సోకిన వ్యక్తి అతి సమీపం నుంచి తుమ్మినా, దగ్గినా వైరస్‌ ‌వేగంగా వ్యాప్తి చెందుతుంది. అయితే, గాంధీ, ఉస్మానియా, చెస్ట్ ఆసుపత్రులలో వైద్యులు జనరల్‌ ‌వార్డులలోనే చికిత్సలు అందిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో గాంధీ ఆసుపత్రిలో స్వైన్‌ ‌ఫ్లూ రోగులకు చికిత్స అందించే క్రమంలో వైద్యులకు సైతం ఈ వైరస్‌ ‌సోకడం కలకలం సృష్టించింది. అప్పటి నుంచి స్వైన్‌ ‌ఫ్లూ రోగులకు చికిత్స అందించే వైద్యులకు ప్రత్యేక్లంగ్‌ ‌గ్లవ్స్, ‌మాస్క్‌లను వైద్య, ఆరోగ్య శాఖ సమకూర్చింది. ఇదిలా ఉండగా, చలికాలం మారి వేసవి కాలం ప్రవేశిస్తున్న సమయంలో స్వైన్‌ ‌ఫ్లూ వైరస్‌ ‌క్రమంగా విస్తరిస్తుండటంపై వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. సహజంగా చలి వాతావరణంలో మాత్రమే విజృంభించే లక్షణం కలిగి ఉండే ఈ వైరస్‌ ‌వేసవి కాలంలోనూ ప్రభావం చూపించడానికి వాతావరణంలో మార్పులే కారణమని పేర్కొంటున్నారు.

ప్రస్తుతం వాతావరణంలో అసహజ మార్పులు కనిపిస్తున్నాయనీ, ఉదయం, రాత్రి వేళల్లో చలి ఎక్కువగా ఉండటం, మధ్యాహ్నం వేళ ఎండల తీవ్రత కూడా అంతే స్థాయిలో ఉండటంతో స్వైన్‌ ‌ఫ్లూ వ్యాధి కారక వైరస్‌ ‌విస్తరించడానికి కారణమని పేర్కొంటున్నారు. మరోవైపు, స్వైన్‌ ‌ఫ్లూ సోకిన తరువాత వైద్య చికిత్సలు తీసుకోవడం కంటే దాని బారిన పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం మేలని వైద్యులు సూచిస్తున్నారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలకు దూరంగా ఉండటం, బయటకు వెళ్లి వచ్చినప్పుడు వెంటనే కాళ్లు చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. అలాగే, స్వైన్‌ ‌ఫ్లూ సోకినట్లు తెలిపే లక్షణాలైన తరచూ దగ్గు, జలుబు తీవ్రమైన జ్వరం వంటి లక్షణాలు కనిపించిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply