Take a fresh look at your lifestyle.

పోతన స్మశాన వాటికలో త్వరలో ఎలక్ట్రిక్‌ ‌క్రిమేషన్‌ ‌యంత్రం

కరోనా వైరస్‌ ‌తో మరణించిన వారి దహన సంస్కారాలు పోతనా స్మశాన వాటికలో  సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని మహానగర పాలక సంస్థ కమిషనర్‌ ‌పమేలా సత్పతి ఆధికారులను ఆదేశించారు. గురువారం కమిషనర్‌ ‌పొతననగర్‌ ‌స్మశాన వాటికి స్థలాన్ని సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించి స్మశాన వాటికను పూర్తి స్థాయిలో వినియోగించేలా ఏర్పాట్లను త్వరితగతిన చేయాలన్నారు. ఈ సందర్భంగా కమిషనర్‌ ‌మాట్లాడుతూ మృతదేహాలను స్మశాన వాటికలకు తరలించడానికి బల్దియా నుండి ఒక క్రొత్త అంబులెన్సును కొనుగోలు చేశామన్నారు.

త్వరలో ఎలక్ట్రిక్‌ ‌క్రీమేషన్‌ ‌యంత్రాన్ని ఏర్పాటు చేస్తున్న దృష్ట్యా ఈ స్మశాన వాటికలో నీటి సౌకర్యం కొరకు ఒక బోర్‌ను, ఒక గదిని, తగినంత వెలుతురు, గ్రీనరీ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పోతాననగర్‌ ‌నుండి స్మశాన వాటికకు శవాలను తీసుకు వెళ్లకూడదని ప్రజలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నందున వెంటనే బల్దియా ప్రధాన కార్యాలయం ప్రక్క నుండి ప్రత్యేక మార్గం ఏర్పాటు చేయాలని ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. బల్దియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం ద్వారా ఈ స్మశాన వాటికలో కోవిడ్‌తో మరణించిన 9 మందికి గురువారం దహన సంస్కరాలు చేయడం జరిగిందని కమిషనర్‌ ‌పేర్కొన్నారు. కమిషనర్‌ ‌వెంట ఇన్చార్జ్ ఆరోగ్య అధికారి జివి నారాయణ రావు, డిఎఫ్‌ఓ ‌కిషోర్‌, ‌డిఈ రవీందర్‌,  ‌తదితరులు ఉన్నారు.

Leave a Reply