ప్రశంసించిన ప్రధాన మంత్రి
హైదరాబాద్, పిఐబి. ఫిబ్రవరి 03 : ‘శ్రీ అన్నాని’ కి ప్రజాదరణ లభించేటట్టు చూడడం కోసం దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రయాసలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. అసమ్ సచివాలయంలో మిలిట్ కేఫ్‌ను ప్రారంభించిన సందర్భంలో అసమ్ ముఖ్యమంత్రి చేసిన ట్వీట్‌కు ప్రధాన మంత్రి స్పందిస్తూ చేసిన ఒక ట్వీట్‌లో…‘‘ ‘శ్రీ అన్నా’ని’ కి ప్రజాదరణ లభించేటట్లు చూడడానికి భారతదేశం అంతటా చేపడుతున్న ఈ తరహా విభిన్న ప్రయాసలను చూసి సంతోషం కలిగింది. ’’ అని పేర్కొన్నారు.