Take a fresh look at your lifestyle.

వొణికిస్తున్న వలస మిడతల సైన్యం ..!

‌”ప్రభుత్వాలను ‘వలసలు ‘  గడగడ లాడిస్తున్నాయి ..ఒకవైపు వలస కార్మికులు ..మరోవైపు వలస మిడతలు ..లాక్‌ ‌డౌన్‌ ‌సందర్బంగా వలస కార్మికులను సమయానికి ఆదుకోకుండా ..కష్టాలకు గురి చేసి గాలి కొదిలేసారన్న తీవ్రమయిన ఆరోపణలను కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఎదుర్కొంటున్నాయి . ఆ ఆరోపణలను ఎదురుకొనలేక పోతున్న ప్రభుత్వాలు ఇప్పుడు వలస మిడతల తో నానా హైరానా పడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే ..”

  • ఉత్తర భారతదేశం చేరుకున్న ఎడారి మిడత సమూహాలు
  • వ్యవసాయానికి తీవ్రమైన ప్రమాదం ..
  • దేశ ఆహార భద్రతకు హాని.. 

ఏప్రిల్‌ 11 ‌న పాకిస్తాన్‌ ‌దాటుకుంటూ ఎడారి మిడుతలు రాజస్థాన్‌ ‌ద్వారా భారతదేశంలోకి ప్రవేశించాయి. మే 26 న ఎడారి మిడుతలు జైపూర్‌ ‌నగరంలోని కొన్ని నివాస ప్రాంతాలలోకి ప్రవేశించాయి.ఈ మిడుత సమూహాలు రాజస్థాన్‌, ‌పంజాబ్‌, ‌హర్యానా, మధ్యప్రదేశ్‌లోకి ప్రవేశించాయని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ గత వారం హెచ్చరిక జారీ చేసింది. దేశ రాజధాని ఢిల్లీకి కూడా ఎడారి మిడత వచ్చే అవకాశం వుంది అని ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. రాజస్థాన్‌ ఎక్కువగా ప్రభావితమైన రాష్ట్రం అని వ్యవసాయ మంత్రిత్వ శాఖ సమాచారం ఇచ్చింది. ప్రతియేడు కంటే ముందుగానే ఈసారి ఎడారి మిడతల సమూహం భారత్‌ ‌లోకి ప్రవేశించింది. ఐక్యరాజ్యసమితి కూడా భూఖండాలలో తిరుగుతున్న ఎడారి మిడుతల సైన్యాలు ఈ సంవత్సరం భారతదేశ వ్యవసాయానికి ‘‘తీవ్రమైన ప్రమాదం’’ కలిగిస్తాయని హెచ్చరించింది..
ఏప్రిల్‌లో పాకిస్తాన్‌ ‌మీదుగా భారత్‌లోకి ప్రవేశించిన ఎడారి మిడుత సమూహాలు ఉత్తర భారత దేశములో ఐదు రాష్ట్రాలకు చేరుకున్నాయి ఎక్కడ చూసినా ప్రస్తుతం ఇదే చర్చ. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, భారతదేశంలోకి ప్రవేశించిన ఎడారి మిడుత సమూహం ఒకే చోట కూర్చుని ఉంటే ఇవి రెండు నుండి మూడు కిలోమీటర్ల పొడవు దూరాన్ని కవర్‌ ‌చేస్తాయి..నిపుణుల నివేదిక ప్రకారం, పంటను నాశనం చేసే కీటకాలు ఈ వారం ప్రారంభంలో మధ్యప్రదేశ్‌ ‌పొలాలపై దాడి చేశాయి.గత మూడు దశాబ్దాలలో అత్యంత దుర్మార్గపు దాడి ఇది. ఈ కీటకాలు భారతదేశ ఆహార భద్రతకు హాని కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు.. రసాయనాలతో పిచికారీ వేయడానికి ఉత్తర ప్రదేశ్‌ ‌సిద్దపడుతున్నది. ఝాన్సీ పట్టణంలో అగ్నిమాపక సిబ్బందిని సిద్ధంగా ఉంచింది అక్కడి పాలనా వ్యవస్థ. మే 26 న ఈ ఎడారి మిడుతలు జైపూర్‌ ‌నివాస ప్రాంతంలోకి ప్రవేశించాయి.

ఇలా భయపెడుతున్న ఈ ఎడారి మిడత ఎవరు..? ఎక్కడ పుట్టింది..?
యునైటెడ్‌ ‌నేషన్స్ ‌ఫుడ్‌ అం‌డ్‌ అ‌గ్రి కల్చర్‌ అసోసియేషన్‌ ‌ప్రకారం ఎడారి మిడతలు వసంత ఋతువులో తూర్పు ఆఫ్రికా దేశాలు అయిన సోమాలియా ఏతోపియా కెన్యా దేశాలలో పుట్టి అక్కడ పంటపొలాలను నాశనం చేసి సంతానోత్పత్తి కోసం అనువైన ప్రాంతాలను వెతుకుతూ సుడాన్‌..‌పశ్చిమ ఆఫ్రికా వైపుకు అరబ్‌ ‌దేశాల గుండా ప్రయాణిస్తూ ఏషియా దేశాలకి ప్రయాణిస్తూ ఆఫ్గనిస్తాన్‌ ‌పాకిస్తాన్‌ ‌ల మీదుగా భారత్‌ ‌లోకి ఎడారి మిడతలు ప్రవేశించాయి.. ఎడారి మిడుతలు అంటే ఏమిటి? ఎడారి మిడత అంటే వలసలో తిరుగాడే ఓ కీటకం. ఎడారి మిడుతలు సాధారణంగా పెద్ద సమూహాలుగా కదులుతూ పోతాయి. ఈ కీటకాలు ప్రతిరోజూ తమ సొంత బరువు యెంత ఉందో అంత పంట పొలాన్ని తినేయగలవు. లక్షలాది మిడుతలు ఒక పంటపైకి దిగినప్పుడు అవి సృష్టించే విధ్వంసం చుస్తే దిమ్మదిరిపోతుంది..ఎడారి మిడుతని ప్రపంచంలో అత్యంత వినాశకరమైన వలస తెగులుగా పరిగణిస్తారు.ఒక చదరపు కిలోమీటరు విస్తీర్ణంలో 80 మిలియన్ల మిడుతలు పోగుపడతాయి.ఈ మిడుతలకు కూడా సాధారణ మిడుతలకి మల్లే.. రెండు పెద్ద వెనుక కాళ్ళు ఉంటాయి.వీటి ఆహారం కేవలం మొక్కలు. వర్షానికి ముందు పొడి వాతావరణంలో పచ్చని భూమి కలిసిపోయి ఉంటాయి.వలస మిడుతలకి అన్ని రకాల మొక్కలు విందు భోజనంలాగా కనిపిస్తాయి.

అందుకే అన్ని మొక్కలని తినేస్తాయి.మహారాష్ట్ర వలస మిడతల తెగుళ్ళ నుండి పంటని కాపాడటానికి రాష్ట్రంలోని వ్యవసాయ శాఖ సిబ్బంది పంటలు వృక్షసంపదపై రసాయన స్ప్రే చేయడం ప్రారంభించారు.మహారాష్ట్రలో ఎడారి మిడుతల సమూహం అమరావతి జిల్లా మీదుగా మహా రాష్ట్రంలోకి అడుగు పెట్టాయి.ఇప్పుడు వార్ధాకు నాగ్పూర్‌ ‌కటోల్‌ ‌తహసీల్‌ ‌లో పోగుపడుతున్నాయి. వ్యవసాయ శాఖ జాయింట్‌ ‌డైరెక్టర్‌ ‌రవీంద్ర భోసలే నివేదిక ప్రకారం, ఈ మిడుతలు రాత్రిపూట ప్రయాణించవు. ఈ వలస తెగుళ్ళు మిడతలు పగటిపూట ప్రయాణిస్తాయి గాలి దిశ ఆధారంగా ఎగురుతా వలసకు పోతూ ఉంటాయి.ఈ మిడతల దాడి తట్టుకునేందుకు ఉత్తర ప్రదేశ్‌ ‌యూపీలోని మధురలో జిల్లా యంత్రాంగం టాస్క్‌ఫోర్స్‌ను రూపొందించింది. పెరుగుతున్న మిడుత ముప్పును దృష్టిలో ఉంచుకుని పరిపాలన వ్యవస్థ ముందస్తు సన్నాహాలను చేస్తున్నది. మధుర జిల్లా మేజిస్ట్రేట్‌ ‌ప్రకారం, 200 లీటర్ల క్లోరోపైరిఫోస్‌ను రిజర్వ్‌గా ఉంచారు. ఈ ప్రాంతంలోని అమ్మకందారులకు జిల్లా వెలుపల క్లోరోపైరిఫోస్‌ ‌రసాయనాన్ని అమ్ముకోవద్దని సూచించారు. స్ప్రేయర్‌లతో నిండిన డజనుకుపైగా ట్రాక్టర్లను సిద్ధం చేసినట్లు మధుర జిల్లా మేజిస్ట్రేట్‌ ‌తెలిపారు. అగ్నిమాపక దళం కూడా అప్రమత్తంగా ఉంచామని తెలిపారు.. కరోనా వైరస్‌ ‌బయటినుంచి వచ్చింది మనదేశ వలస కార్మికులను పట్టిపీడించింది..ఎడారి మిడతలు కూడా బయటినుంచి వచ్చి రైతులను గదడలాడిస్తున్నాయి.

Leave a Reply