జహీరాబాద్ అభివృద్దిపై మంత్రి హరీష్ రావు సమీక్ష
జాతీయ రహదారి పక్కన ఉపాధి కోల్పోయిన చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయం చూపాలని మంత్రి హరీష్ రావు మున్సిపల్ అధికారులను ఆదేశించారు. జహీరాబాద్ పట్టణాభివృద్దిపై రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులతో శుక్రవారం సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా జహీరాబాద్ టౌన్‌లో డ్రైన్ నిర్మాణం వల్ల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద రూ. 9 లక్షల 25 వేలతో చిరు వ్యాపారులకు స్టాల్స్ నిర్మించాలన్నారు. ఈ పనులు వేగంగా జరగాలని ఆదేశించారు. రూ. కోటీ 50 లక్షలతో నిర్మిస్తోన్న వైకుంఠధామం పనులు వేగవంతం చేయాలన్నారు.
అదే రీతిలో ఇంటిగ్రేటెడ్ వెజ్- నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. జహీరాబాద్ మున్సిపాలిటీలో విలీనమయిన గ్రామాల్లో నూతనంగా వైకుంఠధామాలు నిర్మించాలన్నారు. మున్సిపాలిటీల్లో విద్యుత్ బిల్లులు తక్కువ వచ్చేలా పొదుపు చర్యలు తీసుకోవాలని సూచించారు. మిషన్ భగీరథ పనులు జరుగుతున్న తీరును తెలుసుకున్న మంత్రి వేగంగా పనులు పూర్తి చేయాలన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ హనుమంతరావు సవి•క్ష జరపాలని ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో పర్యటించి పనులు జరుగుతున్న తీరును చూడాలన్నారు. అదేవిధంగా సదాశివపేట మున్సిపాలిటీలోనూ మిషన్ భగీరథ పనుల వేగం పెంచాలని పేర్కొన్నారు.