Take a fresh look at your lifestyle.

కొరోనా చికిత్సల కోసం అదనంగా మరో వేయి కోట్లు

  • 138 ఆస్పత్రుల్లో క్రిటికల్‌ ‌కేర్‌ ‌సదుపాయాలు
  • అందుబాటులోకి అదనంగా 2380 క్రిటికల్‌ ‌కేర్‌ ‌బెడ్లు 

అమరావతి,జూలై 24 : రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బాధితుల చికిత్స కోసం అదనంగా మరో 54 ఆస్పత్రులు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తంగా 138 ఆస్పత్రుల్లో క్రిటికల్‌ ‌కేర్‌ ‌సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు. క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జరిగిన కోవిడ్‌ ‌సక్షా సమావేశంలో సీఎం వైఎస్‌ ‌జగన్‌ ఈ ‌మేరకు వెల్లడించారు. రాష్ట్ర స్థాయిలో అదనంగా మరో 5 ఆస్పత్రుల్లో క్రిటికల్‌ ‌కేర్‌ ‌సదుపాయలు కల్పించే దిశగా సాగుతున్నామని, వాటిలో ఇప్పటికే 3 ఆస్పత్రులు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. వచ్చే 6 నెలల్లో అదనంగా రూ.1000 కోట్లు ఖర్చు చేస్తామని అన్నారు. మందులు, ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సిబ్బంది నియామకాల కోసం ఖర్చు చేస్తామని పేర్కొన్నారు. ఇవికాకుండా కోవిడ్‌ ‌టెస్టులు, క్వారంటైన్‌ ‌సదుపాయాలకోసం రాష్ట్ర ప్రభుత్వం రోజుకు సుమారు రూ.6.5 కోట్లు చొప్పున ఖర్చు చేస్తోందని తెలిపారు.

కోవిడ్‌ ‌బాధితుల చికిత్స కోసం అదనంగా 2380 క్రిటికల్‌ ‌కేర్‌ ‌బెడ్లు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, పారామెడికల్‌ ‌సిబ్బంది, వైద్యుల నియామకం, ఆరోగ్య సిబ్బంది నియామకాల కోసం ఖర్చు చేస్తామని పేర్కొన్నారు. ఇవికాకుండా కోవిడ్‌ ‌టెస్టులు, క్వారంటైన్‌ ‌సదుపాయాలకోసం రాష్ట్ర ప్రభుత్వం రోజుకు సుమారు రూ.6.5 కోట్లు చొప్పున ఖర్చు చేస్తోందని తెలిపారు.కాగా,ఏపీలో ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 72,711కి చేరింది.అందు?లో 884 మంది మరణించగా, 37555 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 34,272 మంది వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో నిమ్మ ధరలు పడిపోవడంపై సీఎం వైఎస్‌ ‌జగన్‌ ‌సక్షించారు. రైతులకు మేలు చేసేలా కీలక ఆదేశాలు జారీ చేశారు. వెంటనే ప్రభుత్వమే నిమ్మ కొనుగోలు చేసి మద్దతు ధర వచ్చేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశాలిచ్చారు. శనివారం నుంచి నిమ్మ కొనుగోలు చేపడతామని ఈ సందర్భంగా వ్యవసాయ మంత్రి కన్నబాబు డియాకు తెలిపారు. ఏలూరు, గుడివాడతో పాటు నిమ్మ మార్కెట్లలన్నింటిలో కొనుగోలు చేపడుతామని చెప్పారు.

 

Leave a Reply