Take a fresh look at your lifestyle.

అమృత మూర్తులు

పల్లవి:
ఆడపిల్లలు అడవి మల్లెలు
పుడమితల్లి శిగలో సిరిమల్లెలు
ఆడపిల్లలు అడవి మల్లెలు
పుడమితల్లి శిగలో సిరిమల్లెలు

చరణం:1

అవనికి అందాలే ఆడపిల్లలు
అఖిల జగతి అంతా సుమ గంధాలు
పుట్టినిల్లు మెట్టినిల్లు మీ కోవెలలు
మీ పాదమిడిన చోట
దివ్య ధామాలు

చరణం:2

ఆత్మీయ  ఆనవాళ్లు ఆడపిల్లలు
అవిశ్రాంత శ్రామికులు ఆడపిల్లలు
సృష్టికి ఆధారం ఆడపిల్లలు
దృష్టికి ఆనందం ఆడపిల్లలు

–  గుండాల నరేంద్రబాబు, తెలుగు పరిశోధకులు
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి, 9493235992

Leave a Reply