ఘనంగా వైఎస్సార్‌ ‌జయంతి వేడుకలు

తాడేపల్లి పార్టీ కార్యాలయంలో వైఎస్‌కు నివాళి
జిల్లాల్లో నివాళి అర్పించిన మంత్రులు, నేతలు
అమరావతి,జూలై 8 : దివంగత మహానేత వైఎస్‌ ‌రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను తాడేపల్లి లోని పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి అధ్యక్షతన పార్టీ శ్రేణులు వైఎస్సార్‌ ‌విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. మహానేత డాక్టర్‌ ‌వైఎస్‌ ‌రాజశేఖరరెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారు. తొలి నుంచి వైఎస్‌ఆర్‌తో అడుగులు వేసిన వాళ్లమే. వైఎస్సార్‌ ‌జయంతి, వర్ధంతి వేడుకలను నిర్వహించుకోవటం ద్వారా వైఎస్‌ ఆశయాలను పునశ్చరించుకుని పునరంకితం అవుదామని పిలుపునిచ్చారు. వైఎస్‌కు పచ్చదనం అంటే చాలా ఇష్టం. అందుకే ఈసారి మొక్కలు నాటడం కూడా చేస్తున్నట్లు వెల్లడించారు. షర్మిల పార్టీ పేడతానని గతంలోనే చెప్పారు.

రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు లేకుండా ఉండాలనే అక్కడ పార్టీ విస్తరించలేదు. షర్మిల పార్టీ గురించి మేము మాట్లాడాల్సిన అవసరం లేదు. విశాఖ స్టీల్‌ ‌ప్లాంట్‌ ‌ని ప్రెవేటికరణ వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసాం. అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని కేంద్రం గౌరవించాలి.ప్రెవేటికరణ వ్యతిరేకంగా ప్రభుత్వం చేయాల్సింది అంతా చేస్తామని సజ్జల తెలిపారు.

central new cabinet listprajatantra newstelugu articlesys sharmila party nameYSR Jayanti celebrations
Comments (0)
Add Comment