విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్‌ ‌సిన్హా

  • 27న నామినేషన్‌
  • ‌సిన్హాకు జడ్‌ప్లస్‌ ‌భద్రత కల్పించిన కేంద్రం

న్యూ దిల్లీ, జూన్‌ 24 : ‌విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ ‌సిన్హా ఈ నెల 27న నామినేషన్‌ ‌వేయనున్నారు. మరోవైపు ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ ‌సిన్హాకు కేంద్ర •ం మంత్రిత్వశాఖ శుక్రవారం జడ్‌ ‌కేటగిరి భద్రత కల్పించింది. సెంట్రల్‌ ‌రిజర్వ్ ‌పోలీస్‌ ‌ఫోర్స్ (‌సీఆర్‌పీఎఫ్‌) ‌తో ’జడ్‌’ ‌కేటగిరీ సాయుధ భద్రతను కల్పించింది.యశ్వంత్‌ ‌సిన్హా వచ్చే గురువారం తన నామినేషన్‌ ‌పత్రాలను దాఖలు చేయనున్నారు. ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్మూకు ఇప్పటికే జడ్‌ ‌ప్లస్‌ ‌కేటగిరి భద్రత కల్పించారు.కేంద్ర మాజీమంత్రి సిన్హాను జూన్‌ 21‌వ తేదీన ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించారు. ప్రతిపక్షాల అభ్యర్థిగా రాష్ట్రపతి పదవికి శరద్‌ ‌పవార్‌, ‌ఫరూక్‌ అబ్దుల్లా, మహాత్మా గాంధీ మనవడు గోపాల్‌ ‌కృష్ణ గాంధీ ఎన్నికల్లో పోటీ చేయడానికి నిరాకరించిన తర్వాత, యశ్వంత్‌ ‌సిన్హా పేరు వెలుగులోకి వచ్చింది.

మంగళవారం, తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌నాయకుడైన సిన్హా పార్టీ పదవికి రాజీనామా చేశారు. ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ ‌సిన్హాకు కేంద్రం జడ్‌ ‌ప్లస్‌ ‌కేటగిరి భద్రత కల్పించింది. ‘జాతీయ ప్రయోజనాల కోసం పని చేయాల్సిన సమయం ఆసన్నమైంది. టీఎంసీలో మమతాజీ నాకు అందించిన గౌరవం, ప్రతిష్ఠకు ఆమెకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు ఒక పెద్ద జాతీయ ప్రయోజనం కోసం విపక్షాల ఐక్యత కోసం పని చేయడానికి నేను పార్టీ నుంచి తప్పుకోవాల్సిన సమయం వచ్చింది. ఆమె ఈ చర్యను ఆమోదిస్తారని అనుకుంటున్నాను’ అని సిన్హా ట్వీట్‌ ‌చేశారు. జూన్‌ 27‌వతేదీ గురువారం ఉదయం 11.30 గంటలకు సిన్హా తన నామినేషన్‌ ‌పత్రాలను దాఖలు చేయనున్నారు.

presidential candidateYashwant Sinha
Comments (0)
Add Comment