విమానాశ్రయంలో ఘనంగా స్వాగతించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్, ఫిబ్రవరి 2 : ఇటీవల ఇంగ్లాండ్‌లో జరిగిన అండర్-19 ఉమెన్స్ వరల్డ్ కప్ లో భారత జట్టు విజేతగా నిలిచింది. జట్టులో తెలంగాణకు చెందిన క్రీడాకారిణిలు జి.త్రిష, యశశ్రీ, ఫిట్ నెస్ ట్రైనర్ శాలినీ ఇంగ్లాండ్ నుంచి హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో వారికి రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఘన స్వాగతం పలికి అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ డా. ఆంజనేయ గౌడ్, సంస్థ అధికారులు ధనలక్ష్మి, సుజాత, క్రికెట్ కోచ్ రాజశేఖర్ రెడ్డి, క్రీడాభిమానులు పాల్గొన్నారు. అండర్?19 ఉమెన్స్ వరల్డ్ కప్ విజేతగా భారత్ అవతరించింది. సౌతాఫ్రికాలో జరిగిన తొలి మహిళల ప్రపంచ కప్ ను టీమిండియా కైవసం చేసుకుంది.్గ •నైల్లో ఇంగ్లాండ్ పై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ లో తొలుత భారత బౌలర్ల ధాటికి ఇంగ్లాండ్ కేవలం 68 పరుగులకే ఆలౌట్ కాగా..ఆ తర్వాత 69 పరుగుల టాగంట్ ను భారత్ కేవలం 14 ఓవర్లలోనే చేధించింది.