విస్తరించిన అల్పపీడన ద్రోణితో.. రానున్న మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం

హైదరాబాద్‌ ‌వాతావరణ శాఖ వెల్లడి
ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 4 : ‌రాబోయే మూడు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ ‌వాతావరణ శాఖ తెలిపింది. ఎండలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న రాష్ట్ర ప్రజానీకానికి, ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగించే వార్తను వినిపించింది. ఆదిలాబాద్‌, ‌నిర్మల్‌, ‌కుమ్రం భీమ్‌ ఆసిఫాబాద్‌, ‌నిజామాబాద్‌, ‌మెదక్‌, ‌సంగారెడ్డి, నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ ‌జారీ చేసింది. ఈ జిల్లాల్లో మంగళవారం వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరఠ్వాడా నుంచి కర్ణాటక వి•దుగా తమిళనాడు వరకు విస్తరించి ఉన్న ద్రోణి కారణంగా రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాబోయే 48 గంటల పాటు హైదరాబాద్‌ ‌నగరమంతా మేఘావృతం అయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. సాయంత్రం, రాత్రి సమయాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది.

Comments (0)
Add Comment