లాక్ డౌన్ ఎత్తివేస్తే ..? కొన్ని సూచనలు  మన ఆరోగ్యం ..మన చేతుల్లో ..!

నమస్తే..నేను దేవులపల్లి అజయ్,ప్రజాతంత్ర..
‘కొరోనా వైరస్..లాక్ డౌన్..ఎత్తివేత ఆలోచన’..పై మీ తో రెండు నిమిషా లు మాట్లాడుతా…నచ్చితే ఆచరించండి.. ఇతరులకు షేర్ చేయండి..

 

కొరోనా వైరస్ విస్తరించకుండా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యల్లో భాగంగా లాక్ డౌన్…దేశ వ్యాప్తంగా.. ప్రకటించి 16 రోజులు గడిచినాయి..ఈ కాలంలో దేశ వ్యాప్తంగా పెరుగుతున్న పాజిటివ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నప్పటికీ  జన జీవనం…ఆర్థిక వ్యవస్థ స్తంభించకుండా …పేదలు,దీనసరి కూలీల జీవనం కోసం లాక్ డౌన్ పై కేంద్ర ప్రభుత్వానికి నిర్ణయం తీసుకోవలసి ఉన్నది. కొవిద్19 విస్తరణ నివారణకు కేంద్రం  గాలిలో దీపం వెలిగించి వేడుకున్నది…రాష్ట్ర ముఖ్య మంత్రి చేతులు జోడించి వేడుకున్నారు..! ఇప్పుడు ..ఎప్పుడూ   మన ఆరోగ్యం మన చేతుల్లోనే .!
 ప్రాణాలకు తెగించి..కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి కొరోనా బాధితులకు సేవలందించిన వైద్యులకు…లాక్ డౌన్ విజయవంతం కావడానికి శ్రమించిన పోలీసులకు…పరిసరాలను పరి శుభ్రంగా ఉంచడంలో చెమటోడ్చిన  పారిశుద్ధ్య కార్మికులకు శతకోటి వందనాలు..! లాక్ డౌన్ ఎత్తివేసే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో..లాక్ డౌన్ ఎత్తివేసిన
తదుపరి రెండు వారాలు తీసుకోవలసిన జాగ్రత్తలు కొన్ని “ప్రజాతంత్ర” సూచిస్తుంది.
  1. 144 సెక్షన్ అమలు
  2. రాష్ట్ర సరిహద్దులు మూసివేత( కేవలం నిత్యావసర వస్తువుల వాహనాలకు మాత్రమే అనుమతి)
  3. పబ్లిక్,ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్ నడుపొద్దు
  4. వ్యక్తిగత ట్రాన్స్  స్పొర్ట్ కు అనుమతి(షరతులతో)
  5. అన్ని ప్రార్థనా స్థలాలు మూసివేత
  6. సభలు,సమావేశాలు నిషేధం
  7. సినిమా షూటింగులు,సినిమా ప్రదర్శనలు రద్దు
  8. బార్లు,రెస్టారెంటులు మూసివేయాలి
  9. రాత్రి 8 నుంచి ఉదయం 7 గం వరకు కర్ఫ్యూ అమలు
ఒకవేళ ప్రభుత్వాలు ఈ సూచనలు పరిగణనలోకి తీసుకోనట్లయితే ..బాధ్యత గల పౌరులుగా మనమే పై జాగ్రత్తలు తీసుకుంటూ..
…రెండు వారాలపాటు వ్యక్తిగత దూరాన్ని పాటిస్తూ..సామాజికంగా దగ్గరవుదాం ..
Devulapalli ajaylockdownPrajatantra
Comments (0)
Add Comment