కేంద్ర ప్రభుత్వం అంతగా ఉలిక్కిపడిన ‘టూల్ కిట్’ లో అంశాలు ఏమిటి?

“దిశారవి లాంటి యువతరం పర్యావరణం వంటి అత్యంత ముఖ్యమైన అంశాల మీద చిన్న వయసులోనే సామాజిక బాధ్యతతో ఆలోచిస్తుండటంఒక కార్యాచరణలో వుండటం అనేవి దేశం గర్వించదగ్గ విషయాలు. కానీ ఇవే మన ప్రభుత్వాలకి కంటగింపుగా మారుతున్నాయి. జాతీయంగాఅంతర్జాతీయంగా రైతాంగ ఉద్యమానికి పెరుగుతున్న మద్ధతు సూటిగా వారి వైఫల్యాన్ని ఎత్తి చూపిస్తోంది. దానిని కప్పి పుచ్చుకోవటం కోసందేశద్రోహం అనే పదాన్ని ఉపయోగిస్తే ఇంక ఎవ్వరూ నోరెత్తటానికి సాహసించరు అనేది వారి వ్యూహం.  ఇది కార్పోరేట్ కంపెనీలకు దాసోహమయిన వారి దుర్మార్గపు స్వభావాన్ని బట్టబయలు చేసింది.”

దిశారవి’ ఇరవై ఒక్క సంవత్సరాల అమ్మాయి. కర్ణాటకలో ఒక రైతు కుటుంబంలో పుట్టిన బిడ్డ. ఆ కుటుంబాల్లో వుండే కష్టం ఏమిటో చిన్నప్పటినుంచీ చూస్తూ పెరిగిన అమ్మాయి. వ్యవసాయ కుటుంబం నుంచీ రావటంతో రైతుకు స్వేచ్ఛలాభం అనే పేర్లతో కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన మూడు కార్పోరేట్ వ్యాపార చట్టాలని వ్యతిరేకిస్తున్న రైతాంగ ఉద్యమానికి మద్దతుగా నిలిచింది. మన భవిష్యత్తు బాగుండాలంటే మన పర్యావరణం బాగుండాలని కోరుకున్న వ్యక్తి. చెట్లనుస్వచ్ఛమైన గాలిని ప్రేమించి వాటి కోసం ఆరాటపడిన యువతి. వాటిని కాపాడటం కోసం తనలాంటి యువతరానికి అవగాహన కల్పిస్తున్న మనిషి. పద్దెనిమిదేళ్ల యువ స్వీడిష్ కార్యకర్త గ్రేటా తన్బర్గ్ పర్యావరణ పరిరక్షణ కోసం మొదలుపెట్టిన ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ (ఎఫ్ ఎఫ్ ఎఫ్) అనే అంతర్జాతీయ ప్రచారోద్యమానికి మన దేశం నుంచీ తన గళం కలిపింది. జంతువధకు వ్యతిరేకంగా తాను కూడా ఒక సంవత్సరం నుంచీ పూర్తిగా శాకాహారిగా మారింది.

పర్యావరణ పరిరక్షణ కోసం యువతరం ఎంతో  బాధ్యతగా పనిచేస్తున్న జాతీయఅంతర్జాతీయ సమూహాలలోవేదికలలో భాగమైన ప్రతినిధి. పర్యావరణ సంక్షోభంతోవాతావరణ మార్పులతోఅభివృద్ధి పేరుతో కార్పొరేట్ కంపెనీలు చేసే విధ్వంసక విస్తరణ కారణంగా పురాతన జీవావరణ వ్యవస్థనుదాని మీద ఆధారపడిన తమ జీవనాధారాలను కోల్పోయే ప్రజా సమూహాల కోసంవారి నిర్ణయాధికారం కోసం బాసటగా గొంతు విప్పుతున్న ఒక ఆధునిక యువ చైతన్యం. సున్నితమైన జీవావరణాన్ని రక్షించి కాపాడటంలో స్థానిక ఆదిమ తెగలసమూహాల ప్రజల పాత్రను గుర్తించి వారి అనుభవాలను గౌరవిస్తూవాటిని బలోపేతం చేసే కృషిలో భాగంగా యువతరం ఆ వైపుగా దృష్టి పెట్టేవిధంగా పనిచేస్తున్న ఒక సాధారణ కార్యకర్త. కానీఒక్కసారిగా ఆమెని దేశద్రోహిగా ముద్రవేసి 14 ఫిబ్రవరి2021న అరెస్టుచేశారు కేంద్రప్రభుత్వ ఆధీనంలో పనిచేసే డిల్లీ పోలీసు అధికారులు. కారణంమూడు నెలల నుంచీ దేశ రాజధాని సరిహద్దుల్లో జరుగుతున్న రైతాంగ ఉద్యమానికి దిశారవి బాసటగా నిలవడం.

 

జాతీయంగాఅంతర్జాతీయంగా రైతాంగ ఉద్యమానికి మద్దతు తెలపాలనుకున్న వాళ్ళు ఏఏ రూపాల్లో తమ అభివ్యక్తిని ప్రకటించవచ్చో తెలియజేసే ఒక టూల్ కిట్’ (తెలుగులో ఉపకరణాలు లేదా సాధనాలు అంటాం! ఆయుధాలు కాదు!)ని గ్రేటా తన్బర్గ్ సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. దానిని ఇక్కడ తన మిత్రులకు పంపటంరైతులకు మద్దతుగా పనిచెయ్యటం కోసం ఒక వాట్సప్ గ్రూప్ ఏర్పరచటం అనేవి దిశరవిఆమె మిత్రులు చేసిన కుట్రగా పోలీసులు అభియోగం మోపారు. అసలు టూల్ కిట్’ తయారుచేయటమే దేశద్రోహంగా పోలీసులుబీజేపీ నాయకులు వాదిస్తున్నారు.

ముందు అసలు సాంకేతికంగా  టూల్ కిట్’ అంటే ఏమిటో తెలుసుకుందాం. ఎవరైనా తమ పనిలో భాగంగా చేయాల్సిన కార్యక్రమాలను చెప్పటానికి పవర్ పాయింట్పిడిఎఫ్వర్డ్ ఫైల్ వంటివి వాడతారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే ఎవరికైనా ఇది తెలిసిన విషయమే. ఒకప్పుడు, ‘థింగ్స్ టు డు’ (చేయాల్సిన పనులు) అని చేత్తో రాసేదేఇప్పుడు ప్రజా సమూహాల్లోకి విస్తృతంగా వెళ్లటం కోసం ఎవరికి కావాల్సిన టూల్ కిట్’ వాళ్ళు తయారు చేసుకుంటున్నారు. తాము ఏ విషయం చెప్పాలనుకుంటున్నారో దాని నేపథ్యందానికి మద్దతుగా సామాజిక మాధ్యమాల్లో శాంతియుతంగాప్రజాస్వామ్య బద్ధంగా చేపట్టే కార్యక్రమాలుఎవరిని ఉద్దేశించి తమ విజ్ఞప్తులు పంపించాలని వంటి అంశాలు టూల్ కిట్ లో వివరంగా వుంటుంది. జాతీయఅంతర్జాతీయ స్థాయిలో సామాజిక ప్రచారోద్యమాల్లో పాల్గొనే అందరికీ ఈ సంగతి తెలిసిందే. వ్యాపార విస్తరణకు కూడా టూల్ కిట్ ని వాడతారు.

 

ఇంతకీ ప్రభుత్వం అంతగా ఉలిక్కిపడిన దిశారవి టూల్ కిట్’ లో ఏముందిక్లుప్తంగా అందులోని అంశాలు ఇలా ఉన్నాయి.

భారతదేశంలో రైతుల నిరసన: భారతదేశంలో రైతులు ఎందుకు ఇంతకాలం ఆందోళన చేస్తున్నారో తెలియని వారికి అవగాహన కల్పించడం కోసం ఉద్దేశించిన పత్రం ఇది. పరిస్థితిని మరింత బాగా అర్థం చేసుకోవడానికితమ స్వంత విశ్లేషణ ద్వారా వారికి మద్దతు ఎలా తెలపవచ్చో వంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఇది ఉపకరిస్తుంది. 2015-16 వ్యవసాయ జనాభా లెక్కల ప్రకారంభారతదేశంలో 86 శాతం భూములు చిన్నసన్నకారు కమతాలు. ఇవి రెండు హెక్టార్ల కన్నా (5 ఎకరాల లోపు ) తక్కువ పరిమాణంలో ఉంటాయి. వీటిని సేద్యం చేసే రైతు కుటుంబాల  ఆదాయాలు ఇప్పటికే అతి స్వల్పంగా ఉన్నాయి. చారిత్రకంగా చూస్తే స్వాతంత్య్రానికి పూర్వం అట్టడుగున ఉన్న ఈ రైతులు మొదట ఫ్యూడల్ భూస్వాముల దోపిడీకివలసవాదుల దోపిడీకి గురయ్యారు. 1990ల తర్వాత ప్రపంచీకరణసరళీకరణ విధానాల ద్వారా నష్టపోయారు. ఈ చిన్న- సన్నకారు రైతులే నేటికీ భారత ఆర్థిక వ్యవస్థకుఆహారభద్రతకు వెన్నెముకగా నిలబడివున్నారు. కానీ అప్పుల వల్లవ్యవస్థాగత మద్దతు లేకపోవడం వల్ల వేలాదిమంది రైతులు ఇప్పటికే ఆత్మహత్యలు చేసుకున్నారు.

తీవ్రమైన ఇలాంటి సమస్యలకు పరిష్కారాలుగా చెప్తున్న ఈ కొత్త వ్యవసాయ చట్టాల ద్వారా ఇక్కట్లు మరింత తీవ్రమవుతాయి. అత్యధిక శాతంగా వున్న ఈ రైతులతో ఎక్కడా ఎటువంటి సంప్రదింపులు జరపకుండానే ఇవి ఆమోదించబడ్డాయి. ఈ మూడు చట్టాలు భారతదేశ జనాభాకి ఆహార భద్రతను అందించే  అత్యధికశాతం రైతుల స్వావలంబనకు మద్దతు ఇవ్వడానికి బదులుగా కేవలం లాభార్జనే ధ్యేయంగాదోపిడీ స్వభావాన్ని నరనరాన జీర్ణంచుకున్న పెద్ద పెద్ద కార్పోరేట్ సంస్థలుఅంతర్జాతీయ సంస్థల నియంత్రణలోకి వారిని కుదించే విధంగా వున్నాయి. ఇవే మన భూగ్రహాన్ని విధ్వంసం చేస్తున్న  శక్తులు కూడా. ప్రపంచవ్యాపితంగా కూడా ఫిలిప్పీన్స్ నుండి కొలంబియా వరకు ఈ విధ్వంసకర  ప్రైవేటీకరణ నమూనాలను పునరావృతం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ చట్టాల వల్ల మన దేశంలోని అత్యధిక జనాభా జీవితాలు వారి స్వాధీనంలోకి వెళ్ళిపోతాయి. ప్రపంచవ్యాపితంగా పెరుగుతున్న ఆధిపత్యానికి ఇది ఒక సంకేతం. ఇది కేవలం ఒక దేశంఅందులోని  అణగారిన ప్రజల గురించి మాత్రమే కాదు. ప్రపంచ దేశాల్లో వున్న సాధారణ ప్రజల జీవితాల గురించివారువారి కుటుంబాలు స్వయం సమృద్ధితో జీవించి ఉండటానికి గల అవకాశాల గురించివారు తమదైన స్వతంత్రతతో జీవించడానికి ఏ ప్రజాస్వామ్య ప్రక్రియ అయినా వీటిని సులభతరం చేయాలి.

వీటి అమలు కోసం ఈ కింది కార్యక్రమాలు చేపట్టవచ్చు: భారతీయ రైతులకు మీ మద్దతును ట్వీట్ చేయండి. #FarmersProtest #standwithfarmers అనే హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగించండిమీ ప్రభుత్వ ప్రతినిధులలో ఎవరికైనా కాల్ చేయండి/ ఇమెయిల్ చేయండిదీని గురించి చర్య తీసుకోవాలని వారిని అడగండికర్బన ఉద్గారాలను తగ్గించే విధంగా చర్యలు తీసుకోమని పిటిషన్లు వేయండి. ఆన్‌లైన్‌లో సంతకం చేయండి. వీటి గురించి చర్యలు కోరుతూ మీ దగరలోని ఇండియన్ ఎంబసీమీడియా హౌసులుస్థానికంగా కార్యక్రమం చేపట్టండి. సోషల్ మీడియాలో చిత్రాలను పంచుకోండి. సంఘీభావం ఫోటో/ వీడియో సందేశాన్ని సోషల్ మీడియాలో #FarmersProtest # standwithfarmers అనే హ్యాష్‌ట్యాగ్‌లతో భాగస్వామ్యం చేయండి. #AskIndiaWhy వీడియో/ ఫోటో సందేశం పెట్టండి. @PMOIndia, @nstomar (వ్యవసాయ మంత్రి రైతు సంక్షేమం)లకు ఈ అంశాల మీద ట్వీట్ చేస్తూ ఉండండి. IMF, WTO, FAO, ప్రపంచ బ్యాంక్ లతో పాటు మీ స్వంత దేశాధినేతలు ఇతరులు గమనించవలసిన అంశాలు ఇవి. సమస్య గురించి మరింత చదవండి –      https://ruralindiaonline.org/en/stories/categories/farming-and-its-crisis/

 

ఇవీ దేశద్రోహంగాకుట్రగా డిల్లీ పోలీసులు అభివర్ణించిన అంశాలు. సామాజిక మాధ్యమాలను ఉపయోగించి ప్రజల సమస్యల మీద మద్దతు కోరాలని చెప్పటం  కుట్ర! సమస్య గురించి మరింత చదివి ఒక అవగాహనతో స్వీయ నిర్ణయంతో మద్దతు తెలపండి అని కోరటం దేశద్రోహం!! మీ స్థానిక ప్రజా ప్రతినిధికి ఈ విషయంలో విజ్ఞప్తి చేయండి అనటం తీవ్రమైన నేరం!!! ఇలాంటి నేరారోపణలతోనే డిల్లీ పోలీసులు బెంగళూరు వెళ్లి దిశారవిని అరెస్టుచేశారు. తమ పరిధికాని ప్రాంతంలో ఏదైనా నేరారోపణతో వ్యక్తులను అరెస్టు చేయాల్సి వచ్చినప్పుడు స్థానిక మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచటం అనేది చట్టబద్ధమైన నిబంధన. అయితే దిశారవి విషయంలో ఈ విషయాన్ని పట్టించుకోకుండా నేరుగా ఆమెని డిల్లీలోని పాటియాలా హౌస్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచటంవెనువెంటనే ఐదు రోజులపాటు పోలీసు కస్టడీకి ఆమెని పంపించడం చట్ట ఉల్లంఘనే అని అనేక మంది న్యాయనిపుణులు ప్రకటించారు.

 

దిశారవి లాంటి యువతరం పర్యావరణం వంటి అత్యంత ముఖ్యమైన అంశాల మీద చిన్న వయసులోనే సామాజిక బాధ్యతతో ఆలోచిస్తుండటంఒక కార్యాచరణలో వుండటం అనేవి దేశం గర్వించదగ్గ విషయాలు. కానీ ఇవే మన ప్రభుత్వాలకి కంటగింపుగా మారుతున్నాయి. జాతీయంగాఅంతర్జాతీయంగా రైతాంగ ఉద్యమానికి పెరుగుతున్న మద్ధతు సూటిగా వారి వైఫల్యాన్ని ఎత్తి చూపిస్తోంది. దానిని కప్పి పుచ్చుకోవటం కోసందేశద్రోహం అనే పదాన్ని ఉపయోగిస్తే ఇంక ఎవ్వరూ నోరెత్తటానికి సాహసించరు అనేది వారి వ్యూహం.  ఇది కార్పోరేట్ కంపెనీలకు దాసోహమయిన వారి దుర్మార్గపు స్వభావాన్ని బట్టబయలు చేసింది. ప్రజాస్వామ్య ప్రక్రియలను నిరంతరం అపహాస్యం చేస్తూ ప్రజల మీదముఖ్యంగా ఆలోచనాపరులైన యువతరం మీద దారుణ నిర్బంధాన్ని ప్రయోగించటంమతమౌడ్యంలోకి ప్రజల దృష్టిని మళ్ళించాలని చూడటం.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటం.. అధికారబలంతో చట్ట ఉల్లంఘనలు చేయటం.. ఇలాంటి వన్ని ఈ ఘటనలో స్పష్టంగానే కనిపిన్నాయి. అటాఇటా- నువ్వెటు వైపు అని తేల్చుకోవాల్సింది మనమే! ఇప్పుడు దిశారవి కావొచ్చు.. ఈ క్రమం ఇక్కడితో ఆగదు. రైతుల గురించి మాట్లాడటంపర్యావరణం కాపాడాలనటం దేశద్రోహంగా పరిగణింపబడతాయని దిశారవిఆమె మిత్రులు ఎన్నడూ ఊహించి వుండరు! ఆమే కాదుమనమెవ్వరం కూడా కలలో ఊహించని విషయం కదా ఇది! బహుశా కొన్నాళ్ళకు జైకిసాన్’ అనేది నిషేధిత నినాదం కావొచ్చు.

Comments (0)
Add Comment