పెగాసస్‌పై మధ్యంతర ఉత్తర్వులు ఇస్తాం

  • సిజెఐ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణ
  • పౌరుల హక్కుల ఉల్లంఘన జరిగిందో లేదో తెలపాలి
  • శాంతిభద్రతల అంశలోకి వెళ్లడం లేదు
  • విచారణ సందర్భంగా సుప్రీమ్‌ ‌కోర్టు సిజె ఎన్వీ రమణ
  • విశాల ప్రయోజనాల దృష్ట్యా వివరాలు వెల్లడించలేమన్న కేంద్రం

పెగాసస్‌ ‌స్పైవేర్‌ అం‌శంపై మధ్యంతర ఉత్వర్వులు ఇస్తామని సుప్రీమ్‌ ‌కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. పెగాసస్‌ ‌స్పైవేర్‌ అం‌శంపై సుప్రీమ్‌ ‌కోర్టులో సోమవారం విచారణ ప్రారంభం అయ్యింది. ప్రధాన న్యాయమూర్తి ఎన్వీరమణ, జస్టిస్‌ ‌సూర్యకాంత్‌, ‌జస్టిస్‌ ‌హిమ కోహ్లి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. పెగాసస్‌ అం‌శంపై ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు అభ్యంతరం లేదని కేంద్రం ధర్మాసనానికి తెలిపింది. ఈ అంశంపై మరో అఫిడవిట్‌ ‌దాఖలు చేయాల్సిన అవసరం లేదని కేంద్రం తెలిపింది. కేంద్రం ప్రత్యేక సాప్ట్‌వేర్‌ను ఉపయోగించిందా లేదా అన్నది అఫిడవిట్‌లో చర్చించే అంశం కాదని స్పష్టం చేసింది. విశాల ప్రజాప్రయోజనాల దృష్ట్యా వాటిని అఫిడవిట్లో పొందుపర్చాలని తాము అనుకోవడం లేదని కేంద్రం సుప్రీమ్‌ ‌కోర్టు ఎదుట తమ వాదనలను వినిపించింది. దీనిపై స్పందించిన ధర్మాసనం దేశ భద్రత, శాంతి భద్రతల అంశాలలోకి తాము వెళ్లడం లేదని స్పష్టం చేసింది. అదే విధంగా డిఫెన్స్ ‌తదితర విషయాలు అడగట్లేదని తెలిపింది. పెగాసస్‌ అం‌శం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని..పౌరుల హక్కుల ఉల్లంఘన జరిగిందో లేదో స్పష్టం చేస్తే చాలని ధర్మాసనం కేంద్రానికి తెలిపింది.

కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్‌ ‌జనరల్‌ ‌వాదనలు వినిపించారు. స్పైవేర్‌పై నిపుణుల కమిటీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు సొలిసిటర్‌ ‌జనరల్‌ ‌కోర్టుకు తెలిపారు. దేశ భద్రత అంశాలు చర్చించడం మంచిది కాదన్నదే కేంద్రం అభిప్రాయమని, ఈ అంశంపై స్వతంత్ర కమిటీ అన్నీ పరిశీలించి నివేదిస్తుందని ఎస్‌జీ చెప్పారు. ఈ సందర్భంగా సీజేఐ ఎన్వీ రమణ మాట్లాడుతూ..దేశ భద్రత, శాంతి భద్రతల అంశాల్లోకి తాము వెళ్లడం లేదని, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, తదితరులు వారి హక్కుల రక్షణకై దాఖలు చేసిన పిటిషన్లపై మాత్రమే విచారణ జరుపుతున్నామని తెలిపారు. ప్రభుత్వం ఏమైనా స్పైవేర్‌ ‌నిఘాను ఉపయోగించిందా? అని సీజేఐ ఎన్వీ రమణ ప్రశ్నించారు. దీనికి సొలిసిటర్‌ ‌జనరల్‌ ‌సమాధానం ఇస్తూ..స్పైవేర్‌ అం‌శంపై లోక్‌సభలో ఐటీ మంత్రి వివరణ ఇచ్చారని తెలిపారు.

అయితే స్పైవేర్‌పై కమిటీని నియమించడం..విచారణ చేయడం ఇక్కడ ప్రశ్న కాదని, పూర్తి వివరాలతో అఫిడవిట్‌ ‌దాఖలు చేస్తే ప్రభుత్వ వైఖరి ఏంటో తెలుస్తుందని సీజేఐ సూచించారు. కేంద్ర మాజీమంత్రి రవిశంకర్‌ ‌ప్రసాద్‌ 2019‌లో పెగాసస్‌పై చేసిన ప్రకటనను ఈ సందర్భంగా సీజేఐ ప్రస్తావించారు. కేంద్రానికి ఇప్పటికే చాలా అవకాశాలు ఇచ్చామని, అయినా కేంద్రం అఫిడవిట్‌ ‌దాఖలు చేసేందుకు సుముఖంగా లేనట్లు కనిపిస్తుందని సీజేఐ అభిప్రాయపడ్డారు. అయితే స్పైవేర్‌పై నిపుణుల కమిటీ వేసేందుకు సిద్ధంగా ఉన్నామని సొలిసిటర్‌ ‌జనరల్‌ ‌మరోసారి కోర్టుకు తెలియజేశారు. దీనిపై సీజేఐ స్పందిస్తూ..అఫిడవిట్‌ ‌దాఖలు చేస్తారనే గత విచారణలో సమయం ఇచ్చామని, కానీ వి•రు మరోలా మాట్లాడుతున్నారని ఎస్‌జీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అఫిడవిట్‌ ‌దాఖలు చేసేందుకు కేంద్రం సుముఖంగా లేనందున మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామని సీజేఐ ఎన్వీరమణ పేర్కొన్నారు. ఈ కేసులో పిటిషనర్ల తరపున కపిల్‌ ‌సిబల్‌, ‌శ్యామ్‌ ‌దివాన్‌, ‌రాకేష్‌ ‌ద్వివేది, దినేష్‌ ‌ద్వివేది వాదనలు వినిపించారు.

breaking newscrime todayPegasusprajatantra epaperread news onlineSupreme Court CJ NV Ramanatelugu articlestelugu vaarthalu
Comments (0)
Add Comment