ఒకే దేశం – ఒకే భాష, ఒకే దేశం – ఒకే దేవుడు… పిచ్చి ముదిరిన బిజేపి కొత్తగా ఒకే భారత్, ఒకే సైనిక శ్రేణి పద్దతితో సాంప్రదాయంగా దేశ సైన్యంతో కొనసాగుతున్న రెజిమెంటల్ వ్యవస్థను బలహీనపరుస్తూ, తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ కాంట్రాక్ట్ తాత్కాలిక సైనిక రిక్రూట్‌మెంట్‌ను తెలంగాణ ఇంటి పార్టీ వ్యతిరేకిస్తున్నది. పెన్షన్ చెల్లించక పోవడంతో పాటు దేశ రక్షణ వ్యవస్థ, ఇంకా అనేక విషయాల్లో ఎంతో చర్చ జరిగి ఆర్మీ రిక్రూట్మెంట్ అభ్యర్ధులను అయోమయానికి గురిచేయకుండా రావల్సిన ‘‘అగ్నిపథ్’’ అగ్నివీర్ యువకుల్ని నిరుద్యోగ బాధితులుగా, వంచితులుగా ఆగ్రహానికి గురిచేసిన ఫలితమే దేశవ్యాప్త రైల్వే ఆందోళన. సికింద్రాబాద్‌లో చోటు చేసుకున్న అల్లర్లు… ఆందోళన, తమ ధర్మాగ్రహాన్ని అత్యంత శాంతియుతంగా వ్యక్తీకరించడం కోసం డిఫెన్స్ అకాడమీలలో కోచింగ్ తీసుకుంటున్న ఇప్పటికే వివిధ ఆర్మీ పరీక్షలు నెగ్గిన అభ్యర్ధులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకున్నప్పటికీ వివిధ కారణాలతో మరో రూపంలో వ్యక్తమయ్యింది. అది అవాంచనీయమైన, సమస్య తీవ్రత దృష్యా అతి చర్యలకు పోరాదు.
హద్దు మీరిన హింస, విధ్వంసం, రైల్వేకు నిప్పు ఎవ్వరూ సమర్ధించనప్పటికి, ఇప్పటికి అరెస్టయిన అందరూ జరిగిన పరిణామాలకు దారితీసిన పరిస్థితులను వివరించారు. నేరుగా చాతీలోకి కాల్చి రాకేష్‌ను పొట్టనపెట్టుకున్న పోలీసులు అనేక అబద్దాలతో నిరుద్యోగుల్ని కేసులపాలు చేయాలని చూస్తున్నారు. జీవిత ఖైదులు, ఉరిశిక్షలు వేయవచ్చని తోచిన ప్రకారం రైల్వే అధికారులు భయపెడుతున్నారు. మరో వైపు కేంద్ర దర్యాప్తు సంస్థలు ఉగ్రవాద చర్య తీవ్రతను ఆపాదిస్తున్నారు. కోట్లాది రూపాయల ఆస్తీ నష్టమే, ఎవరినీ గాయపరిచనది లేదు. అగ్నిపథ్ ఆందోళనకు ఉన్న సున్నిత ఉద్వేగాలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వమే కొంత ఉదారత చూపెట్టవలసి ఉన్నది. రాకేష్ మా కార్యకర్త అని ఊరేగింపులు తీసిన టి.ఆర్.యస్, అరెస్టులు అవుతున్న ఆందోళనకారుల గురించి మాట్లాడడం లేదు. నిరసకారులకు మద్దతుగా కాంగ్రెస్ తీసుకున్న వైఖరితో ఏకీభవిస్తూ, వారి విడుదలకు న్యాయ సలహాలు, వారికి తోడుగా ఉంటామని తెలియజేస్తున్నాం. తెలంగాణలోని అన్ని ఇతర యువజన, విద్యార్ధి సంఘాలు కలిసిరావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఫోన్ నెంబర్ 9000600744 ను సంప్రదించాలని కోరుతున్నాం.
– డా. చెరుకు సుధాకర్
తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు