విశాఖ స్టీల్‌ ‌కేంద్ర పరిధిలోని అంశం

అయినా సిఎం జగన్‌ ‌ప్రధానికి లేఖ రాశారు
అనవసర విమర్శలు చేయడం సరికాదు: సజ్జల
‌కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌ప్రకటనను కొన్ని పార్టీలు రాజకీయం చేస్తున్నాయని వైఎస్సార్‌ ‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్టీల్‌ప్లాంట్‌ అం‌శంపై ప్రధానికి సీఎం జగన్‌ ‌మరోసారి లేఖ రాశారని, స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని కోరినట్లు వెల్లడించారు. అఖిలపక్షాన్ని, కార్మిక సంఘం నేతలను తీసుకొస్తానని లేఖలో పేర్కొన్నారని తెలిపారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ‌కేంద్ర పరిధిలోని అంశమని తెలిపారు. వందశాతం కేంద్రం ఆధీనంలోని పరిశ్రమ అని తెలిపారు.
స్టీల్‌ ‌ప్లాంట్‌ ‌పునరుద్ధరణపై సీఎం జగన్‌ ‌పలు సూచనలు కూడా చేశారని సజ్జల పేర్కొన్నారు. ప్రభుత్వ పరంగా చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. విశాఖ ఉక్కు ఆంధ్రా సెంటిమెంట్‌లో ఒక భాగమని చెప్పారు. విశాఖ ఉక్కుపై పవన్‌ ‌కల్యాణ్‌ ‌కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. వక్రబుద్ధితో చంద్రబాబు, ఎల్లో వి•డియా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వంపై విషప్రచారం చేసేలా కథనాలు ప్రచురించాయని తెలిపారు. వాళ్ల తల నిండా విషమే కాబట్టి విషపూరిత వార్తలు రాస్తున్నారని దుయ్యబట్టారు.

advisorAP governmentgimmicspolitical partiesSajjala
Comments (0)
Add Comment