పాహిమాం…విఘ్నేషా !

వరసిద్ధి వినాయకా ..
ఓంకార స్వరూపుడా …
కాసేపు కైలాశ శిఖరం వీడి
మా మోర ఆలకించ రావయ్యా

ఇల దనుమాడుతున్న…
అన్నార్తుల ఆకలి కేకలు….
అన్నదాతల ఆత్మహత్యలు
వలస బతుకుల అక్రందనలు
కష్ట జీవుల కన్నీటి వెతలను
వక్ర తుండంతో ప్రారద్రోలి …
శాంతి సౌభాగ్యం ఒసగుమయ్యా

అవకాశపు మోసాలు
అవివేకపు ఆకృత్యాలు
అజ్ఞానపు చిమ్మ చీకట్లను
అంకుశంతో తరిమివేసి …
విజ్ఞాన కాంతులు పంచుమయ్యా

కొరోనా మృత్యు పాషాలు
ప్రకృతి ప్రకోప వైపరీత్యాలు
పర్యావరణ అసమతుల్యాల్ని
ఏక దంతంతో కడతేర్చి…
శ్యామల క్షేత్రం చేయుమయ్యా

కుల మత విబేధాలు
జాతి వర్ణ విధ్వేషాలు
సాంఘీక దురాచారాల
సామాజిక అసమానతలను
విశిష్ట అస్త్రంతో తుదముట్టించి
సమైక్య జగతి ప్రతిష్టించుమయ్యా

ఓం గణేషా నమోస్తుతే..!
విగ్నేషా నమో నమోస్తుతే..!!

(సెప్టెంబర్‌ 10 ‌న వినాయక చవితి పర్వదినం సందర్బంగా..)
– కోడిగూటి తిరుపతి :9573929493

ap updatesCorona Updates In TelanganaPrajatantratelangana updatestelugu articlestelugu cartoonstelugu epaper read
Comments (0)
Add Comment