కరోనా తీవ్రతతో అప్రమత్తమైన ఎపి సర్కార్‌

  • 1‌నుంచి 9 తరగతులకు సెలువుల ప్రకట
  • యధావిధిగా టెన్త, ఇంటర్‌ ‌పరీక్షలు : మంత్రి సురేశ్‌

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు సెలవులు ప్రకటించింది. నేటి నుంచి సెలవులు ఇస్తున్నట్లు తెలిపింది. షెడ్యూల్‌ ‌ప్రకారమే టెన్త్, ఇం‌టర్‌ ‌పరీక్షలు జరుగుతాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ‌వెల్లడించారు. విద్యార్థులు నష్టపోకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. 1 నుంచి 9 తరగతి విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు ఉండవని.. ఈ ఏడాది విద్యాసంవత్సరం పూర్తయినట్లు మంత్రి స్పష్టం చేశారు. పాఠశాలల్లో ఇప్పటి వరకు కరోనా నిబంధనలు పాటించామన్నారు. కరోనా నియంత్రణపై ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి దిశానిర్దేశం చేశారని విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. కరోనాపై పూర్తి స్థాయిలో సవి•క్ష జరిపామని మంత్రి తెలిపారు. అందుకే 1 నుంచి 9వ తరగతులకు ఏప్రిల్‌20 ‌సెలవులు ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. టెన్త్, ఇం‌టర్‌ ‌పరీక్షలు యథాతథంగా జరుగుతాయన్నారు. విద్యార్థులు నష్టపోకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కోవిడ్‌ ‌నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

Comments (0)
Add Comment