ఎన్టీఆర్‌ ‌తీరుపై మండిపడ్డ వర్ల రామయ్య

  • మేనత్త భువనేశ్వరిపై వ్యాఖ్యలకు ఇదా స్పందన
  • విజయవాడలో దీక్షకు దిగిన వర్ల రామయ్య – వ్యాఖ్యలను సమర్థించిన టిడిపి నేతలు

విజయవాడ, నవంబర్‌ 25 : ‌నందమూరి హీరో జూనియర్‌ ఎన్టీయార్‌పై టీడీపీ నేత వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. నారా భువనేశ్వరిపై కొడాలి నాని, వల్లభనేని వంశీ విమర్శలు చేస్తే జూనియర్‌ ఎన్టీయార్‌ ‌స్పందించిన తీరు సరిగా లేదని వర్ల రామయ్య అభిప్రాయపడ్డారు. వైసీపీ నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ ‌చేస్తూ విజయవాడలో వర్ల రామయ్య దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ నేతలపై జూనియర్‌ ఎన్టీయార్‌ ‌స్పందించిన తీరును తప్పు బడుతూ నందమూరి హరికృష్ణ గురించి ప్రస్తావించారు. బాలయ్య ఎలా స్పందించారో చూశారా అని ఆన్నారు. నాన్న బతికుంటే ఇంకో రకంగా ఉండేది. సీతయ్య(హరికృష్ణ) బతికుంటే నేరుగా రంగంలోకి దిగేవాడు. రచ్చ రచ్చ చేసుండేవాడు. అలా రు(ఎన్టీయార్‌) ఎం‌దుకు చేయలేకపోయారు? నాన్నకు చెల్లెలు అయినప్పుడు కు అత్తే కదా?.. మేనత్తను అంటే ఇలాగేనా స్పందించేది?‘ అంటూ వర్ల రామయ్య నిలదీశారు. నారా భువనేశ్వరిపై కొడాలి నాని, వల్లభనేని వంశీ విమర్శలు చేస్తే ఎన్టీయార్‌ ‌స్పందించిన తీరు సరిగా లేదని వర్ల రామయ్య అభిప్రాయపడ్డారు. భువనేశ్వరి మేనల్లుడిగా ఎన్టీయార్‌ ‌విఫలమయ్యారని విమర్శించారు. మేనత్తను నోటికొచ్చినట్లు అంటే మేనల్లుడిగా ఆయన సరిగ్గా స్పందించలేదని రాష్ట్రం మొత్తం అనుకుంటోందని వర్ల రామయ్య తెలిపారు.

సినిమాల కోసం కుటుంబాన్ని, నైతిక విలువలలను వదులుకుంటారా? అని వర్ల రామయ్య నిలదీశారు. వల్లభనేని వంశీ ఫొటోలు పెట్టినప్పుడే ఎన్టీయార్‌ ‌ఘాటుగా స్పందించి ఉంటే ఇంత జరిగేది కాదని వర్ల అన్నారు. బూతుల మంత్రి పేర్నినానికి ఎన్టీయార్‌ అం‌టే చాలా భయమని, అలాంటి వారిని కంట్రోల్‌ ‌చేసే శక్తి ఆయనకేఉందని చెప్పారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉన్నవాళ్లే టీడీపీ సభ్యులని వర్ల స్పష్టం చేశారు. జూనియర్‌ ఎన్టీయార్‌పై తాను చేసిన వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని, ఈ వ్యాఖ్యలు పూర్తిగా తన వ్యక్తిగతమని వర్ల రామయ్య ప్రకటించారు. ఇదిలావుంటే జూనియర్‌ ఎన్టీఆర్‌పై వర్ల రామయ్య చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ అని టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, నాగుల్‌ ‌రా అన్నారు. చంద్రబాబు కుటుంబానికి వైసీపీ నేతలు క్షమాపణ చెప్పాలంటూ విజయవాడలో వర్ల రామయ్య చేస్తున్న దీక్షకు టీడీపీ నేతలు సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా బుద్దావెంకన్న, నాగుల్‌ ‌రా మాట్లాడుతూ… జూనియర్‌పై తమ మనసులో ఉందే… వర్ల రామయ్య బయట పెట్టారన్నారు. జూనియర్‌ ‌వ్యాఖ్యలు చూసి వైసీపీ నాయకులు ఏంటి జూనియర్‌ ఇలా మాట్లాడారు అని అనుకుంటున్నారని తెలిపారు. ప్రవచనాలు చెప్పినట్లు జూనియర్‌ ఎన్టీఆర్‌ ‌సుభాషితలు పలికారని మండిపడ్డారు. ఒక వర్ల రామయ్య మనసులో మాటే కాదు…తెలుగు ప్రజల భావన అందరిదీ అంతే అని చెప్పుకొచ్చారు. మేనత్తపై వైసీపీ నాయకులు నీచమైన భాష మాట్లాడినా జూనియర్‌ ‌స్పందించి తీరు మాత్రం తమను బాధిస్తోందని అన్నారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ అసలు నందమూరి సంబంధించిన వ్యక్తిలా స్పందించలేదని అన్నారు. మామయ్య, అత్త అని అనుకోవడం కాదని…వారికి కష్టం వస్తే బయటకి వచ్చి మాట్లాడాలని బుద్దా వెంకన్న, నాగుల్‌ ‌రా అన్నారు.

chandra babu naiduJr NTRprajatantra newstelangana updatestelugu kavithaluVarla Ramaiah angry
Comments (0)
Add Comment