ఏలూరు గెలుపుతో అపూర్వ విజయం

ప్రజలంతా వైసిపి పక్షానున్నారు
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి
అమరావతి,జూలై 26: జనరంజక పాలనకు ప్రజలు మరోసారి పట్టం కట్టారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సోమవారం ఆయన తాడేపల్లిలో వైఎస్సార్‌ ‌సీపీ కేంద్ర కార్యాలయంలో డియా సమావేశంలో మాట్లాడుతూ, ఏలూరు కార్పొరేషన్‌ ‌ఫలితాలే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. కులాలు, మతాలు, పార్టీల కతీతంగా సంక్షేమాన్ని అందిస్తున్నామని తెలిపారు. 12 కార్పొరేషన్లను వైఎస్సార్‌సీపీ దక్కించుకుందన్నారు. రాష్ట్ర చరిత్రలో వైఎస్సార్‌సీపీది అపూర్వ చరిత్ర అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఏలూరులో జనమంతా ఒకేమాటగా వైఎస్సార్‌సీకి ఓటేశారు. ఏలూరులో వైఎస్సార్‌సీపీకి 56.3 శాతం మంది ఓటేశారు. టీడీపీ ఏలూరులో 28.2 శాతానికే పరిమితమైంది.

ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ప్రజలు ఏకపక్షంగా పట్టం కట్టారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాల్లోనూ ఇవే ఫలితాలు కనిపిస్తాయని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇదిలావుంటే సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ ‌కోసం పరీక్ష చట్ట ప్రకారమే నిర్వహిస్తున్నామని.. అందరు ఉద్యోగులకు ఇలాంటి రూల్‌ ఉం‌దని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఉద్యోగాలు ఎక్కడికీ పోవని.. పరీక్ష పాస్‌ ‌కాకుంటే ప్రొబేషన్‌లోనే ఉంటారని ఆయన వివరణ ఇచ్చారు. డిపార్ట్‌మెంట్‌ ‌టెస్టులు ఏటా ఏపీపీఎస్సీ రెండుసార్లు నిర్వహిస్తుందని.. ఈ విధానంలో ఉద్యోగులకు ఎలాంటి అన్యాయం జరగదన్నారు. జాబ్‌ ‌క్యాలెండర్‌పై టీడీపీ వాళ్లకి మాట్లాడే అర్హత లేదని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.

articles in onlineEluru winprajatantra newssajjala ramakrishnatelugu newstoday updatesUnprecedented victory
Comments (0)
Add Comment