నెరవేరని మేకిన్‌ ఇం‌డియా సంకల్పం

  • దేశీయ ఉత్పత్తులకు దక్కని ప్రోత్సాహం
  • చిన్నతరహా పరిశ్రమలను ఆదుకుంటేనే మేలు

న్యూదిల్లీ,జనవరి24 : అమెరికాలో ఉద్యోగాల కోత ఆందోళన కలిగిస్తున్న వేళ ..నిరుద్యోగులకు భరోసా కల్పించేలా భారత ప్రభుత్వం పథకాలు అమలుచేయాలి. పట్టాలు చేతబట్టుకుని వెళ్లిన వారు మళ్లీ బ్యాగు సర్దుకుని వచ్చే దుస్థితి వచ్చింది. అలాంటి వారు స్వదేశానికి వస్తే వారికి అండగా నిర్ణయాలు తీసుకోవాలి. ఉక్రెయిన్‌ ‌యుద్దం కారణంగా వెనక్కి వచ్చిన వైద్య విద్యార్థులవిషయంలో అన్యాయం జరిగింది. ఇప్పుడు వీరికీ అలాంటి అన్యాయం జరగరాదు. దేశం అండగా నిలిచిందన్న సంకేతాలు ఇవ్వాలి.
వారి కష్టాలను మననం చేసుకుని స్వయం ఉపాధి పెంచగలిగితే అంతకు మించిన ఆనందం ఉండదు. యువతకు ఉపాధి కల్పించే రాంగాలకు ఇతోధికంగా అంటే..వడ్డీ రహిత రుణాలు ఇవ్వగలగాలి. జెండా ఎగుర వేయడమే గాకుండా ప్రజల కోసం పరితపించేలా పాలన సాగిస్తామని ప్రతిన చేయాల్సిన సమయ మిది.

దేశీయంగా ఉత్పత్తులపై దృష్టి పెట్టి స్వయం సమృద్ది సాధించకుండా విదేశీ పెట్టుబడులకు వెంపర్లాడుతున్న విధానం పోవాలి. దేశీయంగా ఉన్న సాంకేతికతను ఉపయోగించుకుని యువతను స్వయం ఉపాధి వైపు మళ్లేలా సన్నద్దం చేయాలి. వ్యవసాయం, అనుబంధ రంగాలను అభివృద్ది చేస్తే ఈ దేశం ఇతర దేశాలకు ఆహారధాన్యాలను ఎగుమతి చేయగలదు. సింగపూర్‌, ‌మలేషియా తదితర చిన్నదేశాలను ఆదర్శగా తీససుకుని ఆయా రాష్టాల్రు స్వయం సమృద్ది సాధించే ప్రణాళికలతో సాగాల్సిన అవసరాన్ని ఈ గణతంత్రం రోజు ప్రతిన తీసుకోవాలి. మేకిన్‌ ఇం‌డియాను బలంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లి అందుకు అనుగుణంగా కార్యాచరణ చేయాలి. ఇంతకాలం ఎక్కడ లోపం ఉందో గుర్తించి అవలోకనం చేసుకోవాలి.

ఆత్మపరిశీలన చేసుకోవాలి. విద్యావైద్య రంగం ఎందుకు వెనకబడి ఉందో తెలుసుకోవాలి. ఆహారధన్యాలను ఇంకా ఎందుకు దిగుమతి చేసుకుంటున్నామో ఆలోచన చేయాలి. అన్నిరంగాల్లో మనం ముందంజ వేయాల్సిన దశలో ఇంకా దిగుబడులపై ఆధారపడుతూ ఎగుమతుల విషయంలో లక్ష్యం లేకుండా సాగుతున్నాం. మనం చేపట్టిన సంస్కరణలు ఫలితాలు ఇవ్వడం లేదన్న విషయాన్ని గుర్తించడం లేదు. జిఎస్టీని సమర్థించిన ఆయా రాష్టాల్ర సిఎంలే ఇప్పుడు దాని బారినుంచి రక్షించాలని కోరుకుంటున్నారు. వివిధ రంగాలపై అదిచూపిస్తున్న చెడు ప్రభావాన్ని విశ్లేషించుకోవాల్సిన కేంద్రం ప్రభుత్వం మొడిగా వ్యవహరిస్తోందే తప్ప ప్రజల కోణంలో ఆలోచించడం లేదు. బ్యాంకుల్లో దాచుకున్న డబ్బును సొంత అవసరాలకు తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడటాన్ని గ్రామాల్లో ఇప్పటికీ చూస్తున్నాం. ఆహారధాన్యాల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ముక్కుపిండి వసూలు చేస్తున్న పన్నులను పాలకుల విలాసాలకు ఖర్చు చేసుకుంటున్నారు. ఎన్నికలలో డబ్బు అవసరం లేకుండా సంస్కరణలు తీసుకురాకుండా ఎన్ని చర్యలు తీసుకున్నా లాభం లేదు. రాజకీయ పార్టీల ప్రధాన లక్ష్యం అధికారమే కనుక, ఆ అధికారం కోసం ఎంతకైనా తెగబడతాయని ఈ 75 ఏళ్లలో నిరూపితం అయ్యింది.

Comments (0)
Add Comment