రష్యా సైన్యం ఆధీనంలోకి ఉక్రెయిన్‌ ‌రాజధాని కీవ్‌

  • రెండో రోజూ కొనసాగిన రష్యా దాడులు
  • 137 మంది ఉక్రెయినియన్లు మరణించినట్లు అంచనా
  • ఉక్రెయిన్‌పై పట్టు బిగించిన రష్యా దళాలు

ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌ఫిబ్రవరి 25 : ఉక్రెయిన్‌పై రష్యా బలగాలు దాడులు రెండోరోజూ కొనసాగించాయి. ఉక్రెయిన్‌పై పూర్తి పట్టు సాధించే దిశగా రష్యా దళాలు కదిలాయి. అలాగే రాజధీని కీవ్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఉక్రెయిన్‌పై రెండో రోజూ రష్యా భీకర యుద్ధం చేస్తుంది. ఉక్రెయిన్‌ ‌రాజధాని నగరం కీవ్‌ ‌సహా ప్రధాన నగరాలపై గురువారం ఉదయం ప్రారంభమైన భీకర దాడుల్లో ఇప్పటి వరకు దాదాపు 137 మంది ఉక్రెయినియన్లు ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా. భూ, ఆకాశ, సముద్ర మార్గాల్లో ఈ దాడులు జరుగుతున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరోపులో ఏర్పడిన భారీ సంక్షోభాల్లో ఇదొకటి. రెండు రోజులుగా రష్యా భీకర యుద్ధంతో ఉక్రెయిన్‌ ‌చిగురుటాకులా వణికిపోతుంది. యుద్ధం విషయంలో వెనక్కి తగ్గేదే లేదని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ‌ఛాలెంజ్‌ ‌చేసి మరీ చెబుతుండగా..ఉక్రెయిన్‌ను ఒంటరిగా వదిలేశారని.. ప్రపంచం పట్టించుకోవట్లేదని అధ్యక్షుడు వోలోడిమిర్‌ ‌జెలెన్‌స్కీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా.. రష్యా జరుపుతున్న దాడుల్లో జరుగుతున్న విధ్వంసాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో చూసిన ప్రపంచం తల్లడిల్లిపోతుంది. ప్రపంచ దేశాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తూ, సంయమనం పాటించాలని రష్యాను కోరుతున్నారు. కీవ్‌లో యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శనలు నిర్వహించిన దాదాపు 1,700 మంది రష్యన్లను అరెస్టు చేశారు. శుక్రవారం ఉదయం సెంట్రల్‌ ‌కీవ్‌లో రెండు భారీ పేలుళ్ళు వినిపించాయి. రష్యన్‌ ‌సేనలు కీవ్‌ను సపిస్తున్నాయి. అయితే ఉక్రెయిన్‌ ‌సైన్యం ఫేస్‌బుక్‌ ‌పేజీలో తెలిపిన వివరాల ప్రకారం, కీవ్‌లో సాధారణ ప్రజలు నివసించే ప్రాంతాలపై రష్యా దాడులు చేస్తుంది.

రష్యాకు రెండు భయానక బహుమతులను ఇచ్చామని ఉక్రెయిన్‌ ఎయిర్‌ ‌డిఫెన్స్ ‌సిస్టమ్స్ ‌తెలిపింది. తొలిరోజు రష్యా దాడుల్లో మొత్తం 137 మంది మృతిచెందారు. సైనికులు, ప్రజలు 137 మంది చనిపోయినట్టు ఉక్రెయిన్‌ ‌వెల్లడించింది. వందలాది మంది గాయపడినట్టు ఉక్రెయిన్‌ అధికారులు వెల్లడించారు. ప్రశాంత నగరాలపై రష్యా విరుచుకుపడిందని ఉక్రెయిన్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేసింది. ఉక్రెయిన్‌పై మెరుపు దాడులతో రష్యా బలగాలు విరుచుకుపడుతున్నాయి. ఉక్రెయిన్‌ ‌సైనిక, వైమానిక స్థావరాలే లక్ష్యంగా రష్యా దాడులు జరుపుతుంది. 83 స్థావరాలను ధ్వంసం చేసినట్టు రష్యా ప్రకటించింది. కానీ రాష్యా మొత్తం 203 దాడులు చేసినట్టు ఉక్రెయిన్‌ ‌వెల్లడించింది. ఉక్రెయిన్‌ ‌రాజధాని కీవ్‌ ‌నగరంపై రష్యా సైన్యం బాంబులు దాడి చేసింది. రష్యా దాడులను ఉక్రెయిన్‌ ‌సైన్యం ప్రతిఘటిస్తోంది. ఉక్రెయిన్‌ ‌దళాలు శుక్రవారం తెల్లవారుజామున కైవ్‌ ‌దుగా శత్రు విమానాన్ని కూల్చివేశాయి. కీవ్‌ ‌నగరంలో విమాన శకలాలు పడి భారీ అపార్ట్ ‌మెంట్‌ ‌ధ్వంసం అయింది. రష్యా దళాలను అడ్డుకోవడానికి ఉక్రెయిన్‌ ‌చేస్తున్న ప్రయత్నాలేవి ఫలించడం లేదు. యుద్ధం ప్రారంభించిన రెండో రోజే రష్యా బలగాలు ఉక్రెయిన్‌ ‌రాజధాని కీవ్‌ ‌నగరంలోకి ప్రవేశించాయి. రాజధాని కీవ్‌పైనే ప్రధానంగా గురిపెట్టిన రష్యా.. నలువైపుల నుంచి చుట్టుముట్టి ఆక్రమించేశాయి. కీవ్‌ను రష్యా తన ఆధీనంలోకి తీసుకుంది. ఈ విషయాన్ని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అధికారికంగా ప్రకటించారు. మరికొన్ని గంటల్లో రష్యా చేతుల్లోకి రాజధాని కీవ్‌ ‌వెళ్లనుందని తెలిపారు. వైమానిక దాడులు జరిగే ప్రమాదం ఉందని, ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని సూచించారు.

Russian military controlUkraine Air Defense SystemsUkraine's capital Kiev
Comments (0)
Add Comment