యుద్ధం ఎప్పటిదో…

యుద్ధం ఇది ఎప్పటిదో
జరుగుతూనే ఉంది
ఎవరో దేనికో మొదలెడతారు
రక్తమాంసాలను కళ్ళ చూస్తారు
ఆక్రమించడం అనుభవించాలనుకోవడం
అనాగరిక సమాజాన్ని
పునరావృతం చేస్తూ…
విధానం వేరు అంతే!
జయించడాల్లో.. ఎత్తులు వేస్తూ..
కాదు అభివృద్ధి!
కనిపించని పురుగులూ
చంపుతాయి మనుషులని
ఊపిరి తీస్తాయి ఉన్నపలంగా…
ఇప్పుడిప్పుడే చావుతో
యుద్ధం చేసి కోలుకుంటున్నాం కదా..!
చరిత్ర గీసిన గీతలో
పరిణామం రాసిన రాతలో
ఎవరి కాంక్షా కుటిలత్వమో
ఉసిగొల్పుతుంది రాబందులను
పడిగాపులు గాస్తుంది
వాలిపోతుంది మానవ దేహపు భూములపై!
మరి ఈ పురుగును అంతమొందించాలి ఇక
ఇది ఇంకా జరుగుతూనే ఉంది
ఇది ఎప్పటిదో…
మనుషులు తడుస్తూనే ఉన్నారు
రక్తపు మెరుపుల వర్షంలో..!!
 – రఘు వగ్గు, 9603245215

ukraine russia news
Comments (0)
Add Comment