- సురక్షితంగా బయటపడ్డ పైలెట్లు
- మధ్యప్రదేశ్ మెరేనా ప్రాంతంలో కూలినట్లు వెల్లడి
- రాజస్థాన్‌లో మరో ఛార్టెడ్ విమాన ప్రమాదం
న్యూ దిల్లీ, జనవరి 28 : భారత వాయుసేనకు చెందిన మూడు యుద్ధ విమానాలు శనివారం కుప్పకూలాయి. మధ్యప్రదేశ్‌లో శిక్షణలో ఉన్న రెండు ఫైటర్ జెట్లు, రాజస్థాన్‌లో మరో యుద్ధవిమానం ప్రమాదానికి గురైనట్లు రక్షణశాఖ అధికారులు వెల్లడించారు. రోజువారీ శిక్షణలో భాగంగా మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ ఎయిర్ బేస్ నుంచి గాల్లోకి ఎగిరిన సుఖోయ్-30, మిరాజ్ 2000 విమానాలు కాసేపటికే మెరెనా ప్రాంతంలో కూలిపోయాయి. కాగా రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో వాయుసేనకు చెందిన యుద్ధ విమానం కూలిపోయింది. సమాచారమందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లకు స్వల్పగాయాలయ్యాయి.
భారత వైమానిక దళానికి చెందిన రెండు యుద్ధ విమానాలు శనివారం మధ్యప్రదేశ్‌లోని మొరెనా పట్టణ సపంలో కూలిపోయాయి. సుఖోయ్-30, మిరాజ్ 2000 విమానాలు కూలిపోయాయి, యుద్ధ విమానాలు కూలిన ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించామని రక్షణశాఖ అధికార వర్గాలు తెలిపాయి.ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన రెండు ఫైటర్ జెట్ విమానాలు కూలిన ఘటనపై విచారణకు ఆదేశించారు. గ్వాలియర్ ఎయిర్ బేస్ నుంచి విన్యాసాలు సాగుతుండగా రెండు ఫైర్ జెట్ విమానాలు కూలిపోయాయని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.
శనివారం తెల్లవారుజామున 5.30 గంటలకు రెండు జెట్ విమానాలు కూలాయని మోరీనా జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ ప్రమాదం నుంచి పైలట్‌లు సురక్షితంగా బయటపడ్డారని, వారికి స్వల్ప గాయాలయ్యాయని కలెక్టర్ చెప్పారు. రాజస్థాన్ రాష్ట్రంలోని భరత్‌పూర్‌లో శనివారం చార్టర్డ్ విమానం కుప్ప కూలిపోయింది. సాంకేతిక లోపం కారణంగానే చార్టర్డ్ విమానం కూలిందని అనుమాని స్తున్నారు. విమానం కూలిన సంఘటనస్థలానికి అధికారులు, పోలీసులు హుటాహుటిన తరలివచ్చారు. విమానం కూలిన ప్రాంతంలో సహాయ పునరావాస పనులు చేపట్టామని జిల్లా కలెక్టర్ అలోక్ రంజన్ చెప్పారు