నిషేధిత గుట్కా తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్

తాండూరు : నిషేధిత గుట్కా ప్యాకెట్లు తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు తాండూరు రూరల్‌ ‌సీఐ జలంధర్‌ ‌రెడ్డి తెలిపారు. బుధవారం తాండూరు రూరల్‌ ‌కరణ్‌ ‌కోట్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలో రాష్ట్ర సరిహద్దు కర్ణాటక రాష్ట్రం నుండి నిషేధిత గుట్కా.ప్యాకెట్లను తీసుకువస్తున్నారని సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు నిర్వహించి ఎండి అస్లాం, మిరియన్‌ ఆరీఫ్‌ అనే ఇద్దరు వ్యక్తుల నుండి సుమారు 40 వేల రూపాయల విలువగల 9000 నిషేధిత గుట్కా ప్యాకెట్లు గుట్కా ప్యాకెట్లను సీజ్‌ ‌చేసి సదరు వ్యక్తులను అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు. ఈ సందర్భంగా సిఐ జలంధర్‌ ‌రెడ్డి  మాట్లాడుతూ  లాక్‌ ‌డౌన్‌ ‌టైంలో ఎవరైనా ఇలాంటి నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. తనిఖీలలో ఎస్‌ఐ ‌సంతోష్‌ ‌మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నట్లు తెలిపారు. నిషేధిత గుట్కాలను పట్టుకున్న సిబ్బందికి క్యాష్‌ ‌రివార్డు అందజేసినట్లు తెలిపారు.

.Case RegisterPossession of Gutka PacketsRural SiTandoor Rural Ci Jalandhar Reddy
Comments (0)
Add Comment