నగర రోడ్లపై గుంతలపై ఆరా తీయమంటారా?

జిహెచ్‌ఎం‌సి తీరుపై మండిపడ్డ హైకోర్టు
రోడ్లు పూడుస్తున్న దంపతులను సత్కరించిన గవర్నర్‌
జీహెచ్‌ఎం‌సీ తీరుపట్ల తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గంగాధర్‌ ‌తిలక్‌ ‌దంపతులు రోడ్లు మరమ్మతులు చేస్తుంటే జీహెచ్‌ఎం‌సీ అధికారులు ఏం చేస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. ఫించను డబ్బుతో తిలక్‌ ‌దంపతులు గుంతలు పూడుస్తున్నారు. రోడ్ల దుస్థితి చూడలేక వృద్ధ దంపతులు నడుం బిగించడం జీహెచ్‌ఎం‌సీకి సిగ్గుచేటని హైకోర్టు వ్యాఖ్యానించింది. జీహెచ్‌ఎం‌సీ అధికారుల వేతనాలను తిలక్‌ ‌దంపతులకు ఇవ్వడం మేలని హైకోర్టు సూచించింది.
పనిచేయనప్పుడు జీహెచ్‌ఎం‌సీకి బడ్జెట్‌ ‌తగ్గించడం మంచిదని కోర్టు పేర్కొంది. ప్రమాదాల్లో ప్రాణాలు పోతుంటే వాహనాలు దెబ్బతింటుంటే చూస్తూ కూర్చున్నారా? అని హైకోర్టు ప్రశ్నించింది. అద్భుతమైన రోడ్లను నిర్మిస్తున్నామని జీహెచ్‌ఎం‌సీ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. రోడ్లపై గుంతలే లేవా?.. న్యాయవాదులతో తనిఖీలు చేయించమంటారా? అని హైకోర్టు ప్రశ్నించింది. ఇదిలావుంటే రోడ్లవి•ద ఏర్పడే ప్రమాదకరమైన గుంతలను పూడ్చే పనిని స్వచ్ఛందంగా చేపట్టిన గంగాధర్‌ ‌తిలక్‌ను గవర్నర్‌ ‌డాక్టర్‌ ‌తమిళిసై సౌందరరాజన్‌ ఈరోజు రాజ్‌ ‌భవన్‌లో సత్కరించారు. ప్రమాదాలను నివారించడానికి, జీవితాలను కాపాడడానికి రోడ్లపై గుంతలు పూడ్చడమే లక్ష్యంగా చేసుకొని సొంత ఖర్చుతో ఈ కార్యక్రమాన్ని గత దశాబ్ద కాలం పైగా గంగాధర్‌ ‌చేపట్టడం అభినందనీయమని గవర్నర్‌ అన్నారు. గంగాధర్‌ను ’రోడ్‌ ‌డాక్టర్‌’ ‌గా గవర్నర్‌ అభివర్ణించారు. గంగాధర్‌, ఆయన భార్య వెంకటేశ్వరి స్వచ్ఛందంగా చేపట్టిన ఈ కార్యక్రమం ఎంతో స్ఫూర్తిదాయకం అని గవర్నర్‌ అన్నారు. గంగాధర్‌ను, ఆయన భార్యను మన కాలం  ‘అన్‌ ‌సంగ్‌ ‌హీరోస్‌’ ‌గా గవర్నర్‌ ‌కొనియాడారు.
ReplyForward
TS High Court Serious on GHMC Roads and Potholes
Comments (0)
Add Comment