ఇక టిఆర్‌ఎస్‌ ‌తెరమరుగేనా ?

దేశ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ (టిఆర్‌ఎస్‌) ‌త్వరలో కనుమరుగు కానుందా అన్న విషయం ప్రధాన చర్చనీయాంశంగా మారింది. నేటికి ఇరవై ఒక్క సంవత్సరాల కింద కేవలం ఉద్యమపార్టీగా ఆవిర్భవించి తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం రాజకీయ పార్టీగా మారిన టిఆర్‌ఎస్‌ ఇప్పుడు ప్రాంతీయ పరిధిని వీడి దేశ రాజకీయాలవైపు చొచ్చుకు పోయే ప్రయత్నంలోఉంది. ఈ క్రమంలో ఆ పార్టీ పేరుకూడా మారబోతున్నది. ఇంతకాలం టిఆర్‌ఎస్‌ అనగానే ఉద్యమపార్టీగా, ఒక రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా పేరుంది. టిఆర్‌ఎస్‌ను తెలంగాణ ప్రజలు ఓన్‌ ‌చేసుకున్న సందర్భాలున్నాయి. ఇప్పటివరకు ఆ పార్టీ ఓటములకన్నా విజయాలే ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో తనకు ఎదురులేదన్న స్థాయికి ఆ పార్టీ ఎదిగింది. ఒక విధంగా ప్రతిపక్ష పార్టీల హోదానుకూడా తగ్గించింది. అలాంటి పార్టీ రాష్ట్ర ఎల్లలు దాటాలని చూస్తోంది. దేశ రాజకీయాలపై దృష్టి •సారించింది. ప్రస్తుతం దేశంలోని రాజకీయ పార్టీలు ఒకే మూసగా పనిచేస్తున్నాయని, దేశంలోని వనరులను ఉపయోగించుకుని అభివృద్ధి పథంలో నడపలేకపోతున్నాయని అందుకు ప్రత్యమ్నాయ రాజకీయ శక్తి ఒకటి అవసరమన్నది టిఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అభిప్రాయం.

దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకు రావాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ గత కొంత కాలంగా ఆయన దేశ వ్యాప్తంగా పర్యటిస్తూ తన అభిప్రాయాన్ని ఏకీభవించే రాజకీయ పార్టీలను కూడగట్టే ప్రయత్నం చేస్తూ వచ్చారు. అందుకు పరిస్థితులు అనుకూలంగా లేవనుకున్నారో ఏమోగాని తానే స్వయంగా జాతీయస్థాయిలో ఒక పార్టీని ఏర్పాటు చేయాలని నిశ్చయించారు. ఈ విషయంపైన కూడా పలువురు రాజకీయ ప్రముఖులు, వివిధ పార్టీల అధినేతలతో మంతనాలు జరిపారు. ఎవరు కలిసి వొచ్చినా లేకున్నా జాతీయ పార్టీ ఏర్పాటు లక్ష్యంగా పనిచేస్తూనే ఉన్నారు. దానికి ఒక రూపాన్ని తీసుకోచ్చే ప్రక్రియ ప్రారంభమయింది. త్వరలో పార్టీ ఆవిర్భావ ప్రకటన వెలువడనుంది. ఈలోగా ఫార్మాలిటీస్‌ ‌పూర్తిచేసుకునే పనిలో ఉన్నారు. తెరాస పోలికతోనే పార్టీ పేరు, జండా, సింబల్‌ను నిర్ణయించే పనిలో కెసిఆర్‌ ‌బిజీబిజీగా ఉన్నారు. పార్టీ పేరు లో స్వల్ప మార్పు విషయమై ఇంకా తర్జనభర్జన జరుగుతున్నది. జాతీయ స్థాయిలో ఏర్పాటు చేస్తున్న పార్టీ కావడంతో భారతీయ రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్‌)‌గా దీనికి నామకరణం చేయాలన్న సూచనలు వ్యక్తమయ్యాయి. టిఆర్‌ఎస్‌ ‌పార్టీ నాయకుడొకరు ఈ బిఆర్‌ఎస్‌ ‌పేరును ముందుగానే ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాతే పార్టీ అధికార వర్గాల్లో, మీడియాలో ఈ పేరు పాపులర్‌ అయింది. అయితే దాన్ని భారత రాష్ట్రీయ సమితిగా మార్చాలా, లేదా భారత్‌ ‌రాష్ట్ర సమితిగా మార్చాలా అన్న విషయలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

ఏదిఏమైనా బిఆర్‌ఎస్‌ అన్నది మాత్రం ఖాయమని తెలుస్తున్నది. తెరాస గులాబీ జండాలో ఉన్న రాష్ట్ర పటం స్థానంలో భారతదేశ పటాన్ని ఏర్పాటుచేస్తారని తెలుస్తున్నది. అలాగే తెలంగాణ జండాలో కారు సింబల్‌ ఉన్నట్లే బిఆర్‌ఎస్‌ ‌జండాలోకూడా కారునే పార్టీ చిహ్నంగా ఉండనివ్వాలన్న వాదన పార్టీ నేతలు బలంగా వినిపిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ విషయంలో ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గం, పార్టీ ప్రధాన నాయకులతో సమాలోచన చేసిన కెసిఆర్‌ ‌త్వరలోనే నూతన పార్టీ ప్రకటన చేయబోతున్నట్లు తెలుస్తున్నది. ముందుగా ఈ నెల 19వ తేదీన్నే ఈ ప్రకటన చేస్తారన్న ప్రచారం జరిగినప్పటికీ, వివిధ కారణాలతో 21 లేదా 22 తేదీల్లో ప్రకటించవచ్చను కుంటున్నారు. న్యాయపరమైన విషయాల పరిశీలన అనంతరం ఎలక్షన్‌ ‌కమిషన్‌• అనుమతికోసం దరఖాస్తు చేసుకునే అవకావాలున్నాయి. దేశంలో కాంగ్రెస్‌, ‌బిజెపికి ప్రత్యమ్నాయ రాజకీయ పార్టీగా ఉద్భవిస్తున్న ఈ బిఆర్‌ఎస్‌ను ప్రజలు తప్పక ఆదరిస్తారన్న నమ్మకాన్ని టిఆర్‌ఎస్‌ ‌శ్రేణులు చెబుతున్నాయి. అయితే దేశ రాజకీయాల్లో ఇప్పటివరకు సంచ)నాత్మక పాత్ర పోషిస్తూ వొస్తున్న టిఆర్‌ఎస్‌ ‌పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ఉత్పన్న మవుతున్నది.

ముఖ్యంగా రాష్ట్ర రాజకీయాల్లో ఇంతవరకు ఎదురులేకుండా ముందుకు సాగుతున్న ఈ పార్టీ ఇక్కడితో తెరమరుగు అవడమేనా అన్నది అందరినీ ఆలోచింపజేస్తున్నది. త్వరలో శాసనసభ ఎన్నికలు వొస్తున్న వేళ ముఖ్యంగా గ్రామస్థాయి ప్రజలు వోటేసే విషయంలో ఇబ్బంది పడతారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరో ఒకటిన్నర రెండు సంవత్సరాల్లో ఎన్నికలు రాబోతున్న వేళ పార్టీ పేరును మారిస్తే వోటర్లు ఇబ్బంది పడే అవకాశాలున్నాయంటున్నారు పార్టీ నేతలు. అందుకు రానున్న శాసనసభ ఎన్నికలవరకు టిఆర్‌ఎస్‌ను అలాగే కొనసాగించాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక కారు గుర్తు విషయంలో.. జాతీయ పార్టీ గుర్తుగా ఉండబోతున్నందున ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించేందుకు ఎన్నికల కమిషన్‌•తో, న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇకపోతే దేశంలో ఈ పార్టీ ఏవిధంగా దూసుకుపోతున్నదన్న విషయంలో కెసిఆర్‌ ‌మొదటినుండి ప్రత్యామ్నాయ పార్టీకన్నా ఎజండా అవసరమని చెబుతున్నారు. తెలంగాణ సాధనకు తెరాస ఏర్పాటు ఎలా విశ్వసనీయంగా పనిచేసిందో భవిష్యత్‌లో బిఆర్‌ఎస్‌కూడా అలా పనిచేస్తుందన్న విశ్వసనీయతను ప్రజల్లో కలిగిస్తామని చెబుతున్నారు కెసిఆర్‌. ‌ముఖ్యంగా ఉత్తరాది ఆధిపత్య ధోరణిని తగ్గించే విషయంలో దక్షిణాది రాష్ట్రాలను ఐక్యంచేసే పనిలో ఆయన ఉన్నారు.

prajatantra newstelangana updatestelugu kavithaluToday HilightsTRS politics starts in national wideతెలుగు వార్తలు
Comments (0)
Add Comment