టోక్యో ఒలింపిక్స్ అప్‌డేట్స్

  • ‌హాకీలో 5-3 గోల్స్ ‌తేడాతో జపాన్‌పై భారత్‌ ‌విజయం
  • భారత్‌కు మరో మెడల్‌ ‌ఖరారు..సెమీస్‌లోకి బాక్సర్‌ ‌లవ్లీనా
  • బ్యాడ్మింటన్‌లో సెమీస్‌కు చేరిన పివి సింధు

టోక్యో, జూలై 30 : ఒలింపిక్స్‌లో ఇప్పటికే క్వార్టర్‌ ‌ఫైనల్‌ ‌చేరిన ఇండియన్‌ ‌హాకీ టీమ్‌ ‌విజయ పరంపర కొనసాగుతుంది. శుక్రవారం జరిగిన చివరి లీగ్‌ ‌మ్యాచ్‌లో టీమిండియా 5-3 గోల్స్ ‌తేడాతో జపాన్‌ను చిత్తు చేసింది. ఈ విజయంతో గ్రూప్‌ ఎలో టీమిండియా రెండో స్థానంతో లీగ్‌ ‌స్టేజ్‌ను ముగించింది. మొత్తం ఐదు మ్యాచ్‌లలో నాలుగు గెలిచి, ఒకదాంట్లో ఓడిన భారత్‌.. 12 ‌పాయింట్లతో ఆస్టేల్రియా (13) తర్వాతి స్థానంలో ఉంది. జపాన్‌తో మ్యాచ్‌లో గుర్జంత్‌ ‌సింగ్‌ 2, ‌హర్మన్‌‌ప్రీత్‌ ‌సింగ్‌, ‌షంషేర్‌, ‌నీలకంఠ శర్మ తలా ఒక గోల్‌ ‌చేశారు. క్వార్టర్‌ ‌ఫైనల్‌లో ఇప్పటికే బెర్త్ ‌ఖరారు చేసుకున్న భారత జట్టు పూల్‌-ఏ ‌లో చివరి మ్యాచ్‌ను విజయంతో ముగించింది.
భారత్‌కు మరో మెడల్‌ ‌ఖరారు..సెమీస్‌లోకి బాక్సర్‌ ‌లవ్లీనా

ఆడుతున్న తొలి ఒలింపిక్స్‌లోనే మెడల్‌ ‌ఖాయం చేసుకుంది ఇండియన్‌ ‌బాక్సర్‌ ‌లవ్లీనా బోర్గోహైన్‌. 69 ‌కేజీల కేటగిరీలో శుక్రవారం జరిగిన క్వార్టర్గ్ ‌ఫైనల్‌ ‌బౌట్‌లో గెలిచి సెమిస్‌లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇక సెవి•స్‌ ‌బౌట్‌ ‌ఫలితంతో సంబంధం లేకుండా లవ్లీనాకు కనీసం బ్రాంజ్‌ ‌మెడల్‌ ‌ఖాయమైంది. అయితే తాను మాత్రం గోల్డ్ ‌మెడలే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఈ చారిత్రక విజయం తర్వాత లవ్లీనా చెప్పింది. ఇండియాకు టోక్యో ఒలింపిక్స్‌లో మరో మెడల్‌ ‌ఖాయం చేసిన లవ్లీనాపై ప్రశంసల వర్షం కురుస్తుంది. అసోం రాష్ట్రం ఇప్పటికే ఆమెకు రూ.50 లక్షల నగదు బహుమతి ప్రకటించింది.
బ్యాడ్మింటన్‌లో సెమీస్‌కు చేరిన పివి సింధు

గత ఒలింపిక్స్‌లో రజతంతో మెరిసిన భారత అగశ్రేణి షట్లర్‌ ‌పివి సింధు మరోసారి సెమిస్‌కు చేరింది. తాజాగా జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్‌ ‌మహిళల సింగిల్స్ ‌విభాగంలోని క్వార్టర్‌ ‌ఫైనల్స్‌లో ఆమె జపాన్‌ ‌క్రీడాకారిణి యమగుచిపై విజయం సాధించింది. తొలి గేమ్‌లో 21-13తో ఆధిపత్యం చెలాయించిన ఆమె రెండో గేమ్‌లోనూ సత్తా చాటింది. రెండో గేమ్‌ ‌తొలి విరామానికి సింధు 11-6తో ఆధిపత్యం సాధించింది. అయితే విరామం తర్వాత యమగుచి గట్టిపోటీ ఇచ్చింది. ఒక దశలో ఇద్దరి పాయింట్లు సమానంగా నిలిచాయి. ఆఖరివరకు ఉత్కంఠ భరితంగా సాగిన రెండో గేమ్‌లో 22-20తో సింధు నెగ్గింది . దీంతో వరుస గేమ్‌లలో గెలిచిన సింధు సెమిస్‌కు దూసుకెళ్లింది.

breaking updates nowheadlines nowshortnews in teluguToday telangana newsTokyo Olympics Updates In Telugu
Comments (0)
Add Comment