మహిళా సాధికారతకు కృషి చేయాలి

“మహిళా రిజర్వేషన్‌ ‌కు సంబంధించిన బిల్లును 2014లోనే రాజ్యసభ ఆమోదం తెలిపినా, ఆ వెంటనే 15 వ లోక్‌ ‌సభ రద్దు కావడంతో బిల్లు ఆమోదం పొందలేదు.దేశ జనాభాలో 50 శాతం ఉన్న మహిళలకు రిజర్వేషన్లు కల్పించడంలో మీనమేషాలు లెక్కస్తున్నారనీ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.. వేద కాలం నుండి మహిళలను సమానంగా చూసే సంస్కృతి మన దేశానిది. అలాంటిది స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచిన మహిళలు ఇంకా వెనుకబడి ఉన్నారు. సమాజంలో కుమార్తె కన్నా, కుమారునికి ప్రాధాన్యం ఇచ్చే పద్ధతులు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. శిశు హత్యలు, భ్రూణ హత్యలు, అత్యాచారాలు, వరకట్న వేధింపులు లాంటి దురాచారాలు రూపుమాపినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని చెప్పవచ్చు.”

నేడు మహిళా సమానత్వ దినం

మహిళలకు వోటు హక్కు ఇచ్చే ప్రకటనపై యునైటెడ్‌ ‌స్టేట్స్ అఫ్‌ అమెరికా 1920 వ సంవత్సరంలో రాజ్యాంగంలోని 19వ సవరణ ద్వారా తీర్మానం చేసింది. సంవత్సరంలో అప్పటి అమెరికా విదేశాంగ కార్యదర్శి ఐన బై స్బ్రిడ్జే కో ల్టి అమెరికా మహిళలకు రాజ్యాంగపరమైన వోటు హక్కు ఇచ్చే ప్రకటన పై సంతకం చేసిన రోజు జ్ఞాపకార్ధంగా ఆగస్టు 26 తేదీని మహిళా సమానత్వం దినోత్సవం గా తీసుకున్నారు. ఈ సంవత్సరంలో దేశవ్యాప్తంగా సమ్మె చేశారు. 1971 లో సమానత్వం కోసం పోరాటాలు చేశారు. 1973 లో మహిళల సమాన హక్కులు, సమస్యలపై పోరాటాలు కొనసాగుతున్న సందర్భంలో లో న్యూయార్క్ ‌కు చెందిన కాంగ్రెస్‌ ‌మహిళ బెళ్ళా అబ్జుగ్‌ ఆగస్టు 26 మహిళా సమానత్వ దినం జరుపుకొనుటకు తీర్మానం ప్రవేశపెట్టగా అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ ‌నిక్సన్‌ ‌ప్రకటన విడుదల చేశాడు అలా 1973 లో అమెరికా కాంగ్రెస్‌ ఆమోదం తెలిపిన తర్వాత మొట్టమొదటి సారిగా సమానత్వ దినాన్ని జరుపుకున్నారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా మద్రాస్‌ ‌రాష్ట్రం మహిళలకు ఎన్నికల్లో వోటు హక్కు ను మంజూరు చేసింది. స్వాతంత్య్రానంతరం మన రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 326 ‌లో ప్రస్తావించబడిన ఈ విధంగా 1950లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మహిళలకు వోటు హక్కు కల్పించబడింది. ప్రపంచంలో జరిగిన కొన్ని సర్వేల ఆధారంగా రాజకీయాల్లో మహిళల ప్రాధాన్యత తక్కువనే ఉంది.

పార్లమెంట్‌ ‌లో మహిళా ప్రాతినిధ్యం విషయంలో భారతదేశం ప్రపంచంలో 20వ స్థానంలో ఉంది. మహిళా అధ్యక్షులుగా ఎన్నుకొన్న దేశాలను గమనిస్తే, గ్రేట్‌ ‌బ్రిటన్‌, ‌జర్మనీ, ఇజ్రాయిల్‌, ‌భారత్‌, ‌మరియు డెన్మార్క్ ‌వంటి మరికొన్ని దేశాలు మహిళా అధ్యక్షులను ఎన్ను కున్నాయి. కానీ అమెరికా ఇప్పటివరకు మహిళలను అధ్యక్షులుగా ఎన్నుకోలేదు.మహిళల హక్కుల సాధన కోసం రోసా పార్కస్, ఎలియనోర్‌ ‌రూజ్వెల్ట్, ‌మేరీ క్యూరీ, జేన్‌ ‌గుడాల్‌ ఇలాంటి మహిళలు సమాజంలో పురుషులు, మహిళలు సమానమని పోరాటం చేశారు. మహిళల వోటు హక్కు కోసం కాకుండా, విద్య, ఉపాధి అవకాశాల కోసం, రాజకీయాల్లో నిర్వహించడం కోసం పోరాటం చేయాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పని చేసే మహిళలు కోరుకుంటున్న సమస్యలు, అణచివేత, హింసకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అందుకోసం ఆగస్టు 26 మహిళా సమానత్వం దినోత్సవం సందర్భంగా సెమినార్లు, వర్క్ ‌షాపులు, సదస్సు లు, నిర్వహిస్తారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన మహిళలను గుర్తించడం కోసం అంతర్జాతీయ మహిళా దినోత్సవం, బాలికా దినోత్సవం జాతీయ ,అంతర్జాతీయ స్థాయిలో విశిష్ట సేవలు అందించిన మార్గరెట్‌ ‌థాచర్‌, ‌మాక్సిన్‌ ‌కింగ్‌, ‌మలాల యూసఫ్‌ ‌జాయ్‌ ఇలాంటి నేతలు చరిత్ర ను, ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వీర వీర వనితలు, సావిత్రిబాయి పూలే వంటి సంఘ సంస్కర్తలు, పి.టి.ఉష లాంటి క్రీడాకారులు, ఇందిరాగాంధీ లాంటి రాజకీయ నేతల చరిత్ర గురించి నేటి తరం మహిళలకు ఆయా వేదికల ద్వారా అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

రాజకీయాలతో తో పాటు ఉ మహిళలకు అన్ని రంగాల్లో అవకాశం కల్పిస్తే దేశం పురోగమిస్తుంది అని చెప్పవచ్చును. వివక్షత లేని సమాజాన్ని నిర్మించాలి. చట్టసభల్లో మహిళలకు తగిన రిజర్వేషన్లు కల్పించాలనే ఆలోచన, ప్రతిపాదనపై అన్ని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయానికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మహిళా రిజర్వేషన్‌ ‌కు సంబంధించిన బిల్లును 2014లోనే రాజ్యసభ ఆమోదం తెలిపినా, ఆ వెంటనే 15 వ లోక్‌ ‌సభ రద్దు కావడంతో బిల్లు ఆమోదం పొందలేదు.దేశ జనాభాలో 50 శాతం ఉన్న మహిళలకు రిజర్వేషన్లు కల్పించడంలో మీనమేషాలు లెక్కస్తున్నారనీ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.. వేద కాలం నుండి మహిళలను సమానంగా చూసే సంస్కృతి మన దేశానిది. అలాంటిది స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచిన మహిళలు ఇంకా వెనుకబడి ఉన్నారు. సమాజంలో కుమార్తె కన్నా, కుమారునికి ప్రాధాన్యం ఇచ్చే పద్ధతులు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. శిశు హత్యలు, భ్రూణ హత్యలు, అత్యాచారాలు, వరకట్న వేధింపులు లాంటి దురాచారాలు రూపుమాపినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని చెప్పవచ్చు. అలాగే ఈ మధ్య హిందూ కుటుంబం ఆస్తి లో కొడుకులతో బాటు, కూతుళ్లకు సమానం హక్కు ఉండదని సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడం హర్షించదగ్గ విషయం.

హిందూ వారసత్వ సవరణ చట్టం 2005 కు ముందు తండ్రి మరణించిన కూడా కూతురికి ఆ హక్కులు దక్కుతాయని స్పష్టం చేసింది. పాకిస్తాన్‌ ‌లో విద్య కోసం పోరాటం చేసిన గొప్ప వ్యక్తి, నోబెల్‌ ‌బహుమతి గ్రహీత న్యాయవాది, మలాల యూసఫ్‌ ‌జాయ్‌ ‌మాటల్లో ప్రపంచం మొత్తం నిశ్శబ్దం గా ఉన్నప్పుడు ఒక స్వరం కూడా శక్తివంతమవుతుంది ఆన్నారు. అందుకే సమాజం నుండి స్త్రీ పురుషుల వివక్షత లేకుండా చూసినప్పు డే మహిళా సాధికారత సాధ్యం అవుతుందని ఆ దిశగా ప్రభుత్వాలు వారికి అవకాశాలు ఇవ్వాలని పలువురు శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు వివిధ సందర్భాల్లో అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మహిళలను చైతన్యవంతం చేయుటకు ఈ మధ్య తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో అధికారంలో ఉన్న మహిళల స్థానంలో భర్తల పెత్తనం, వారి బంధుగణం కూడా ప్రత్యక్షంగా సమావేశాల్లో పాల్గొనకూడదని పంచాయతీరాజ్‌ ‌శాఖ ఉత్తర్వులు జారీ చేయడం హర్షించదగ్గ విషయం అని చెప్పవచ్చు. అయితే నేడు ఏ రంగంలో తీసిపోరనే విధంగా అవకాశాలు కల్పించాలని,వారిని అన్ని రంగాల్లో భాగస్వాములను చేసినప్పుడే మహిళా సమానత్వం దినోత్సవ సార్ధకత అవుతుందని చెప్పవచ్చును.
– కామిడి సతీష్‌ ‌రెడ్డి, జడలపేట
జయశంకర్‌ ‌భూపాలపల్లి జిల్లా..9848445134..

prajatantra newsTelangana news updatestelugu short newstelugu vaarthalutoday breaking updatesWomen's Equality Dayకామిడి సతీష్‌ ‌రెడ్డి
Comments (0)
Add Comment