అవకాశాలను వాస్తవాలుగా మార్చుకుందాం

నేడు జాతీయ యువజన దినోత్సవం
ప్రతి సంవత్సరం జనవరి 12న, స్వామి వివేకానంద జన్మదినాన్ని పురస్కరించుకుని జాతీయ యువజన దినోత్సవం జరుపుకు ంటున్నాం. ఇదిప్రతి వ్యక్తిలో ఒక ముఖ్యమైన అంతర్మథన సందర్భం. నూతన సంవత్సరాన్ని స్వాగతించడంలో భాగంగా కొత్త లక్ష్యాలను చేరుకోవాలనే సంకల్పాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇది మరో మంచి అవకాశం. కొనసాగుతున్న ఆజాదికా అమృత్‌ ‌మహోత్సవ్‌లో, దేశం రాబోయే స్వాతంత్య్ర శతాబ్దాన్ని స్వాగతించే అమృతసమయం కోసం పరివర్తన చెంది ప్రయాణం కొనసాగించడానికి దేశపాలకవర్గం ప్రణాళిక బ్లూప్రింట్‌ను సిద్ధం చేస్తోంది. దేశం ఈ ప్రతిపాదిత ప్రయాణంలో నేటి యువత నిర్వహించేందుకు గురుతరబాధ్యత ఉంది. ఒకవిధంగా జాతీయ యువజన దినోత్సవం యువతలో వెలుగుచూడని సామర్థ్యాలను క్రమబద్ధీకరించడానికి అవకాశాలను వాస్తవాలుగా మార్చడానికి జ్ఞానాన్ని ప్రసరింపజేస్తుంది.

స్వామీ వివేకానంద బోధనలే ఆత్మగౌరవాన్నితట్టిలేపి జాతీయ మేల్కొలుపును పునరుద్ధరించాయి. ప్రజలు తమని తాము అభివృద్ధి పరచుకోవాలని, దేశ ఉద్ధరణకు కృషి చేయాలని ఆయన ఒక స్పష్టమైన పిలుపు ఇచ్చారు. బ్రిటీష్‌ ‌పరిపాలనలో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ, భారతదేశం ఒక సజీవ అస్తిత్వమనీ, ప్రపంచ దేశాలకు మనదేషమే ఒక ఆదర్శ సందేశం అని ప్రజలలో అతని బోధనా నమ్మేలా చేసింది. ప్రపంచ మత పార్లమెంట్‌, ‌చికాగోలో అతని భాగస్వామ్యం, తదుపరి ప్రయాణాలు పాశ్చాత్య ప్రపంచానికి భారతీయ వేదాంత తత్వశాస్త్రాన్ని పరిచయం చేశాయి. భాషా, సాంస్కృతిక మతపరమైన తేడాలు ఎన్ని ఉన్నప్పటికీ దేశభక్తి భావాల తొలి వాస్తుశిల్పిగా, అతను రాబోయే 50 సంవత్సరాల పాటు భరతమాతను ప్రత్యక్ష దైవంగా ఆరాధించాలని దేశవాసులకు పిలుపునిచ్చారు. స్వామీజీ జీవించిన కాలంతో పోలిస్తే, ప్రపంచంలో అనేక మార్పులు సంభవించాయి. రెండు ప్రపంచ యుద్ధాలు జరిగాయి. 19వ శతాబ్దపు చివరి దశాబ్దంలో తన మిచిగాన్‌ ‌విశ్వవిద్యాలయంలో స్వామి వివేకానంద వెల్లడించిన మూడు అంచనాలలో రెండు అంచనాలు నిజమయ్యాయి. స్వామి వివేకానంద ఆధ్యాత్మిక స్పృహ, లోతైన అవగాహన ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తుంది. రాబోయే 50 సంవత్సరాలలో భారతదేశానికి స్వాతంత్య్రం, రష్యా శ్రామికవర్గ విప్లవం, తదనంతరం కమ్యూనిజం ప్రభావం తగ్గడం అనే స్వామీజీ అంచనాలు నిజమయ్యాయి. భారతదేశం శక్తివంతంగా మారడం, అత్యున్నతంగా నిలవడం, గొప్ప ఎత్తులకు ఎదుగుతుందనే మరో అంచనా సాకారమయ్యేందుకు రంగం సిద్ధంగా ఉంది. భారతీయ యువకుడు ఈ అంచనాను వాస్తవం చేయడానికి దేశాన్ని కోరుకున్న ప్రదేశానికి చేరుస్తాడు. దేశ నిర్మాణంలో యువత పాత్రను ప్రస్తావిస్తూ స్వామీజీ ‘‘నా విశ్వాసం యువ తరం, ఆధునిక తరం, వారిలో నుండి నా ఆశయ సాధకులుగా వస్తారు. వారు సింహాల మాదిరిగా మొత్తం సమస్యలను పరిష్కరిస్తారు.’’ అన్నారు.

భారతదేశం ఎన్నో ఆకాంక్షలు కలిగిన యువదేశం. మన జనాభా• 65% మంది 35 ఏళ్ల లోపు వారే. మన జనాభాలో 62% మంది 15-59 సంవత్సరాల మధ్య పని చేసే వయస్సులో ఉన్నారు. 2022-23 నాటికి భారతదేశంలో సగటు వయస్సు 28 సంవత్సరాలు ఉంటుందని అంచనా. ఇది చైనాలో 37 ఏళ్ళ సగటు వయసుకి, పశ్చిమ ఐరోపాలో 45 సంవత్సరాల వయసుకంటే భిన్నం. ఇది భారతదేశంలో పని చేయని జనాభా కంటే శ్రామిక ప్రజల సంఖ్యా ఎక్కువగా ఉండటాన్ని ప్రతిబింబిస్తుంది, ఇది దేశ పురోగతిలో అనుకూలతకు దారి తీస్తుంది. ప్రభుత్వం బలమైన నాయకత్వం వల్ల యువతరం సంకల్పం నెరవేరే సుదీర్ఘ ప్రయాణం మొగ్గతొడుగుతుంది. ఇప్పుడు భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఎదుగుతోంది. పెరుగుతున్న యునికార్న్ ‌స్టార్టప్‌ల సంఖ్య, ఒలింపికే పోటీలలో మెరుగైన ప్రదర్శన, సిలికాన్‌ ‌వ్యాలీలో భారతీయ నాయకత్వం యొక్క నిరూపితమైన సామర్ధ్యం , అభివృద్ధి చెందుతున్న బలమైన మహిళా నాయకత్వం, శాస్త్ర సాంకేతిక పురోగతి, అంతరిక్ష రంగంలో సాధించిన విజయాలు, టీకాలు వేయడం వంటివి కొన్ని సూచికలు మనకు గర్వకారణం. బాహ్య ప్రపంచంలో సమర్ధంగా పని చేయడానికి వ్యక్తిగతంగా, సామూహికంగా ఆత్మపరిశీలన అవసరం.

నేటి సంక్లిష్ట ప్రపంచంలోని సమస్యలు మొత్తం మానవాళిని సవాలు చేస్తున్నాయి. 21వ శతాబ్దపు సవాళ్లకు వ్యతిరేకంగా ముందస్తు చర్య తీసుకోవడానికి భారతదేశ చారిత్రక, ప్రాచీన జ్ఞానభాండాగారం నుండి యువత పరిష్కారాలను వెలికితీయాలి. సరిగ్గా పరిష్కరించకపోతే, విశ్వంలోని అత్యంత అందమైన జీవి అయిన మానవునికి వినాశనం, సంక్షోభానికి దారితీసే తీవ్రమైన పరిణామాలను ప్రపంచం భరించాల్సివస్తుంది. ప్రస్తుతం కొనసాగుతున్న మహమ్మారి, గ్లోబల్‌ ‌వార్మింగ్‌, ‌పర్యావరణ మార్పులు, బయో-టెర్రరిజం, డ్రగ్స్ ‌ట్రాఫికింగ్‌ ‌నుండి ఉద్భవిస్తున్న బెదిరింపులు, అంతరిక్ష యుద్ధాలు తమ చర్యలను విస్తరించే పరిస్థితులు యువత ముందున్న సవాళ్లు. జనాభాలో వృద్ధుల అవసరాలను తీర్చడానికి యువతరం కూడా సహాయ హస్తాన్ని అందించాలి. ఇప్పుడు యువత వాతావరణ మార్పుల పట్ల అవగాహన పెంచుకోవడం, క్రియాశీలంగా నడచుకోవడం శుభ పరిణామం.

‘మార్పు అనేది ప్రపంచంలో ఎప్పుడూ స్థిరంగా సాగుతుంది. ఇప్పుడు, యువత ఈ మార్పుకి టార్చ్ ‌బేరర్‌/ ‌దిశానిర్దేశకులు. ప్రపంచలో మార్పు వేగం, స్థాయి గతంలో కంటే ఎక్కువగా ఉంది. డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ వైపు కొనసాగుతున్న నమూనా మార్పు, సమాంతరంగా అభివృద్ధి చెందుతున్న అవాస్తవిక ప్రపంచం ప్రపంచాన్ని గ్లోబల్‌ ‌విలేజ్‌గా మారుస్తుంది. ఇది ‘వసుధైక కుటుంబకం’ భావనను సూచిస్తుంది. అయితే, ఇటువంటి పరిణామాలు, వాటి ఫలితాల పట్ల నిరంతర నైతిక పునర్విమర్శ అవసరం. రాబోయే ఆవిష్కరణలు సాంకేతిక పురోగమనాలు మానవాళికి నైతికంగా మద్దతు ఇస్తాయని రూడీ చేసుకోవడం, అప్రమత్తంగా ఉండడం, సత్వర తనిఖీ చేయడం, విలువ ఆధారిత వ్యక్తుల బాధ్యత. లేకపోతే ఫలితాలు భారీ విపత్తులను కలిగిస్తాయి. ఘనమైన వ్యక్తిగత విలువల పునాది సామూహిక మంచిని సాధించగలదు. ప్రతి ఒక్కరూ ముఖ్యంగా యువత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది, అంటే ఈ తరుణంలో వారెంచుకున్న లక్ష్యాలు అంతే ముఖ్యమైనవి. పై సందర్భంలో, దేశాన్ని గొప్ప శిఖరాలకు తీసుకెళ్లే లక్ష్యాన్ని సాధించడానికి ప్రతి వ్యక్తి ముఖ్యంగా యువత దేశ ప్రయోజనాలకు అనుగుణంగా తమను తాము పెట్టుబడి పెట్టడం ఈ సమయంలో అవసరం. మన పూర్వీకులు ఊహించిన లక్ష్యాలను సాధించడానికి భారతదేశ యువతకు అపరిమితమైన సామర్థ్యం ఉంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో, భారత ప్రభుత్వం వారి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి వాతావరణాన్ని అందించడానికి ఎటువంటి అవకాశాన్నీ వదిలివేయడం లేదు.

కర్మయోగి స్వామి వివేకానంద ప్రబోధించినట్లుగా మోడీ ప్రభుత్వం సమష్టి స్ఫూర్తిని పాటిస్తోంది. అది ప్రభుత్వ పథకాల అమలులో ప్రతిబింబిస్తుంది. 150 కోట్లకు పైగా వ్యాక్సిన్‌లను సమయానుకూలంగా అందించడం, వ్యాక్సిన్‌ ‌మైత్రి కార్యక్రమం, స్వచ్ఛ్ ‌భారత్‌ అభియాన్‌, ‌మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆత్మ నిర్భర్‌ ‌భారత్‌ అభియాన్‌, అం‌తర్జాతీయ సౌర విద్యుత్‌ ‌విజయాలు, పరీక్షల ద్వారా నిర్ధారించి దేశీయంగా తయారు చేసిన వ్యాక్సిన్‌లు 95 కంటే ఎక్కువ దేశాలకు సరఫరా చేసి సహాయపడడం 2024-25 నాటికి భారతదేశాన్ని 5 ట్రిలియన్‌ అమెరికన్‌ ‌డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ప్రపంచంలోని నాలెడ్జ్ ‌సూపర్‌ ‌పవర్‌గా మార్చడానికి విధానాలు రూపొందించారు. జాతీయ విద్యా విధానం, పరిశ్రమలూ -విద్యాసంస్థల లింకేజీలు, వ్యవస్థాపక నైపుణ్యాలను పెంపొందించడం, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, క్రీడా సంస్కృతిని ప్రోత్సహించడం, మెరుగైనR&D, అనుకూల పర్యావరణ వ్యవస్థ వంటివి యువతను దేశ నిర్మాణంలో ఏకీకృతం చేయడానికి కొన్ని చర్యలు. ప్రభుత్వ నిశ్చయాత్మకమైన చర్యలు సమాజంలోని అణగారిన వర్గాల సామాజిక అభ్యున్నతికి న్యాయమైన సమాజాన్ని నిర్మించడానికి దారితీస్తున్నాయి. అయినప్పటికీ, పౌర సంఘాలు, స్థానిక,రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్‌ ‌ప్లేయర్‌లు, మీడియా, నాగరీకులు, ఇతర సంబంధిత వాటాదారుల సత్వర ప్రయత్నాలతో, కార్యక్రమాల అమలును స్ఫూర్తితో నిర్ధరించడం అవసరం. ఈ జాతీయ యువజన దినోత్సవం సమకాలీన జాతీయ లక్ష్యాలతో మన వ్యక్తిగత లక్ష్యాన్ని సాధించడానికి సంకల్పం తెలపడం ద్వారా కార్యక్రమాల స్ఫూర్తిని మెరుగుపరచడానికి తగిన తరుణం. భారతదేశాన్ని 21వ శతాబ్దపు అగ్రగామిగా మార్చే అవకాశాలను వాస్తవంగామార్చడం ద్వారా స్వామి వివేకానంద 3వ ప్రవచనాన్ని/అంచనాని సాకారం చేసుకో వడానికి అమృత్‌కాల్‌ ‌సందర్భంగా మన చర్యలని ఏకీకృతం చేద్దాం.

(అర్జున్‌ ‌రామ్‌ ‌మేఘ్వాల్‌, ‌కేంద్ర సాంస్కృతిక & పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి & లోక్‌సభలో బికనీర్‌ ‌నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు)

గమనిక : స్వామి వివేకానంద మూడు అంచనాల సూచన
పుస్తకం శీర్షిక : My India, the India Eterna
(పేజీ నం. – 7-8)
ప్రచురణ కర్త : రామకృష్ణ మఠం, నాగ్‌పూర్‌.

My Indiaprajatantra newstelangana updatesthe India EternaToday HilightsToday is National Youth Dayతెలుగు వార్తలు
Comments (0)
Add Comment