నేడు భారత్‌ ‌బంద్‌ ..!

  • సింబాలిక్‌గా వినూత్న నిరసన..
  • ఉదయం 11 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు  
  • ‌రవాణా సంఘాలతో సహా కార్మిక సంఘాలు..ప్రతిపక్ష పార్టీలు మద్దతు

అమలులోకి వచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులు తమ డిమాండ్లకు మద్దతుగా ఒత్తిడి పెంచడానికి కేంద్ర ప్రభుత్వంతో ఆరవ సమావేశానికి ఒక రోజు ముందు డిసెంబర్‌ 8‌న దేశవ్యాప్తంగా శాంతియుత ‘‘భారత్‌ ‌బంద్‌’’ ‌కు పిలుపునిచ్చారు.భారత్‌ ‌బంద్‌ ‌కు కార్మిక సంఘాలు..ప్రతిపక్ష పార్టీల మద్దతు పెరుగుతున్నందున దేశ రాజధానికి అందే పండ్లు మరియు కాయగూరల  సరఫరాతో సహా కొన్ని సేవలు ప్రభావితమవుతాయి. రైతుల నిరసనల కేంద్రం అయిన దేశ రాజధాని సరిహద్దులతో పాటుగా దేశంలోని మిగిలిన ప్రాంతాలలో  . నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు మూడు వివాదాస్పద వ్యవసాయ సంస్కరణ చట్టాలను రద్దు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడం అనేది ప్రధాన లక్ష్యంగా ఈ బంద్‌ ‌కొనసాగుతున్నది. ‘‘ప్రభుత్వ విధానాలకు మేము మద్దతు ఇవ్వడం లేదని చూపించడమే ఈ నిరసన’’ అని భారతీయ కిసాన్‌ ‌యూనియన్‌ ‌ప్రతినిధి రాకేశ్‌ ‌టికైట్‌ అన్నారు.నిరసన శాంతియుతంగా కొనసాగుతుందని’’ అని తెలిపారు. రైతులకు తమ మద్దతుకు అహింసాత్మక పద్దతిలో ఇవ్వాలని ప్రజలను కోరారు. తమ  నిరసన సామాన్యులకు తలనొప్పి సృష్టించేది కాదు అని అన్నారు.

భారత్‌ ‌బంద్‌ ఉదయం 11 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంటుంది. ఇది సింబాలిక్‌ ‌నిరసన. మేము ఉదయం 11 గంటలకు ప్రారంభిస్తాము కనుక ప్రజలు సమయానికి కార్యాలయానికి చేరుకోవచ్చు. అంబులెన్స్, ‌వివాహాలు వంటి సేవలు కొనసాగవచ్చు. ప్రజలు ఈ కారణాలు చూపితే  వారికీ ఆటంకం చేయబోమని అని భారతీయ కిసాన్‌ ‌యూనియన్‌ ‌ప్రతినిధి రాకేశ్‌ ‌టికైట్‌ అన్నారు. రైతు సంఘాల సభ్యులు జాతీయ రహదారులను బ్లాక్‌ ‌చేసి టోల్‌ ‌ప్లాజాలను కూడా ఆక్రమించుకుంటారని భారతీయ కిసాన్‌ ‌యూనియన్‌ ‌ప్రధాన కార్యదర్శి హరీందర్‌ ‌సింగ్‌ ‌లఖోవాల్‌ ‌గతంలో చెప్పారు. భారత్‌ ‌బంద్‌ ‌పంజాబ్‌లో బాగా అమలు అయ్యే అవకాశం ఉంది. కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌, ‌మరియు ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, అస్సాంలలో సిట్‌-ఇన్‌ ‌నిరసనలు జరిగే అవకాశం ఉంది. ఇది ట్రాఫిక్‌ ‌రద్దీని సృష్టించే అవకాశం ఉంది. బిజెపి పాలిత రాష్ట్రాలు ట్రావెల్‌ అడ్వైజరీలను జారీ చేసే అవకాశం ఉంది.

దేశంలోని అన్ని మోటారు రవాణా సంఘాలు రైతులకు మద్దతు తెలపటం వలన అనేక రాష్ట్రాల్లో సరఫరా ట్రక్కుల కదలిక ప్రభావితం కానుంది. ట్రాన్స్పోర్ట్ ‌యూనియన్లు  శాంతియుత ప్రదర్శనలను నిర్వహిస్తారు.రైతుల సమస్యలను పరిష్కరించడానికి జిల్లా కలెక్టర్లు  కమిషనర్లకు మెమోరాండం సమర్పించడానికి ప్రయత్నిస్తారు.ఢిల్లీ వ్యాపారులు భారత్‌ ‌బంద్‌ ‌పిలుపుకు మద్దతు ఇస్తున్నారు.అందువల్ల,ఢిల్లీ మండిలు బంధ్‌ ‌పాటిస్తాయి అని ఆజాద్పూర్‌ ‌మండి ఛైర్మన్‌ ఆదిల్‌ అహ్మద్‌ ‌ఖాన్‌ అన్నారు – ఆసియాలో అతిపెద్ద పండ్లు మరియు కూరగాయల హోల్‌సేల్‌ ‌మార్కెట్‌ ఇది రేపు తక్కువ స్థాయిలో పనిచేస్తుంది. మహారాష్ట్రలో, వాషి ఏపిఎమ్‌సి బంద్‌ ‌పాటిస్తుంది. దీని  వలన ముంబైలో పండ్లు, కూరగాయల సరఫరా ప్రభావితం కానుంది.ముంబైలో ఇతర మండీలు మూసివేయబడతాయో లేదో ఇనక ధృవీకరించ లేదు. క్యాబ్‌ ‌మరియు టాక్సీ యూనియన్లు బంద్‌ ‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినందున ఢిల్లీ మరియు తమిళనాడు ప్రయాణికులు సమస్యలను ఎదుర్కొంటారు. ఐతే ఆటోలు కొనసాగుతూనే ఉంటాయని యూనియన్లు తెలిపాయి.రైతులకు మద్దతుగా అనేక బ్యాంకు సంఘాలు బ్లాక్‌-‌బ్యాండ్‌ ‌నిరసనకు పిలుపునిచ్చాయి. అంచేత బ్యాంకింగ్‌ ‌సేవలు ప్రభావితం అయ్యే అవకాశం లేదు.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ ‌కేజ్రీవాల్‌ ‌సోమవారం సింద్‌ ‌సరిహద్దును సందర్శించారు.వేలాది మంది రైతులు నిరసన వ్యక్తం చేస్తున్న స్థలంలో ఢిల్లీ ప్రభుత్వం వారి కోసం చేసిన ఏర్పాట్లను సమీక్షించారు. డిసెంబరు 8 భారత్‌ ‌బంద్‌ ‌కు ఆమ్‌ ఆద్మీ పార్టీ తన మద్దతును ప్రకటించిన ఒక రోజు తరువాత ఈ పర్యటన చోటు చేసుకుంది. ‘‘నేను ఏర్పాట్లను తనిఖీ చేసాను. స్టేడియంలను తాత్కాలిక జైళ్లుగా మార్చాలి అని మాపై చాలా ఒత్తిడి వచ్చింది. ఐతే  మేము అనుమతించ లేదు. మా నిర్ణయం ఉద్యమానికి సహాయపడిందని నేను భావిస్తున్నాను. మొదటి నుండి మా పార్టీ ఎమ్మెల్యేలు మరియు మంత్రులు రైతులతో వున్నారు.’’అని కేజ్రీ తెలిపారు. తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌మినహా మిగతా ప్రతిపక్ష పార్టీలు అన్ని రంగంలోకి దిగాయి.శివసేన, కాంగ్రెస్‌, ‌డిఎంకె, కమల్‌ ‌హాసన్‌ ‌యొక్క ఎంఎన్‌ఎమ్‌, ఆర్జెడి, సమాజ్‌ ‌వాదీ పార్టీ, ఎన్‌సిపి, ఆమ్‌ ఆద్మీ పార్టీ, కొత్తగా పుట్టిన కాశ్మీర్‌ ‌పార్టీ పీపుల్స్ అలయన్స్ ‌ఫర్‌ ‌గుప్కర్‌ ‌డిక్లరేషన్‌ ‌ఫర్‌ ‌జె అండ్‌ ‌కె వామపక్షాల శ్రేణులు.. రైతులకు మద్దతుగా నగరాల్లో ప్రదర్శనలు నిర్వహిస్తామని తెలిపాయి.

వ్యవసాయ చట్టాలను రద్దు చేయడానికి పెరుగుతున్న మద్దతును ప్రభుత్వం తోసిపుచ్చుతూ ఇది రైతుల ఆందోళన కాదు.. ఇది ప్రతిపక్ష పార్టీల నకిలీల ఆందోళన అని నిర్వచించింది.ఆందోళనకి దిగిన ప్రతిపక్షం గతంలో వ్యవసాయ రంగంలోకి ప్రైవేట్‌ ‌వారిని అనుమతించడం అనేది వారి డిమాండ్‌ ‌వుంది అనే విషయాన్ని ప్రభుత్వం ప్రతిపక్షానికి గుర్తు చేసింది.

Comments (0)
Add Comment