‘‘‌గీ తీర్గ ముందుకు’’!….

రొండుకాళ్ళు లేక,సగం పెయి కదులకుంట చక్రాల బండిమీద మందుగోలీలు తినుకుంట బతికేటి బక్కపల్సని మనిషిని జూషి సుత బుగులు వడితిరి.కొరోనా పాజిటివైన ఎనుబైయేండ్ల మనిషిని దేశంగాని దేశం గొంటబోయి  లోపట నూకితిరి!ఏం జేషిండో ఇగురం జెప్పుడు లేదాయే! ఏమన్న జేషిండంటె,ఏం లేదు,మరి ఎందుకు లోపటేషిండ్లో జవాబు లేదు.రైళ్ళకింద బాంబు లేషినోళ్ళు,మనుషుల్ని పాణవుండంగ  బుగ్గివెట్టి జంపినోళ్ళు రాజ్జాలేల బట్టిండ్లు,బతుకుల తీరుజూపే అసలు సదువులు జెప్పెటోళ్ళందరిని ఆడోళ్ళు మొగోళ్ళు ముసలోళ్ళు,కాళ్ళుషేతులు లేనోళ్ళను జూషి బుగులు పడేటంత లోగుట్టు రాజ్జెం ఏం జేత్తాండ్లో గని వీళ్ళు కరోనా కాలంల ఏవేం జేయాల్నో అన్ని లెక్కవెట్టుకోని బరాబరి జేయబట్టిండ్లు.

 దేశం ముందుకు పోతాంది. కొరోనా బీమారి పెరుగుట్ల మన దేశం దునియాల అన్ని దేశాలు దాటే కాడికచ్చింది. ఇంక  జరింత జల్ది ముందుకు పోనీకి సప్పట్లుగొట్టుడు, గంటల గొట్టుడు ,పూలు జల్లుడు అయినయి గాబట్టి ఈ మల్క ఎం.పి. ప్రజ్ఞ కొత్త ఇగురం ఇనిపిచ్చింది.పది దినాలు దేశంలందరు హనుమంతుని భజన జేయాలని జెప్పింది. పదొద్దులయినంక పదకొండో దినం ఆగష్ట్ ‌నాలుగున దీపంతలు ఎలిగిచ్చి దీపాలి పండుగ  తీర్గ జేయాలన్నది.కొరోనా సంగతి జూషేందుకు మోడీ సర్కార్‌ ఆథ్యాత్మిక ప్రయోగం జేత్తానట్టు జెప్పింది. ఎర్రగడ్డ దావకాన్లకేలి గోడ దునికి తప్పిచ్చుకున్నోళ్ళు గిసోంటి ముచ్చట్లు బెట్టుడుతోనె వాళ్ళ ఇకమ్మతు సమజయితది.మోడీ సారేం తక్కువ! ఆయిన సుత ఇదే ముచ్చటం దుకున్నడు. రాముని గుడి గట్టేందుకుభూమిల గడ్డపారేషే రోజు దేశమంత ఆశ్రమాలల్ల సన్నాసులు, ఇండ్లల్ల సంసారులంత పొద్దటిసంది రాముని భజన  జేయమన్నడు. హనుమాన్‌ ‌భజనకు, ,రాముని పూజలకు కొరోనా దేశంల లేకుంటపోతదని ముందుగాల్నే జెప్తె కొరోనా ఇన్ని లచ్చలకోట్ల మందికి సోకకుంట పైలంగుందుము.  రాముడు పుట్టిన జాగ అదేనని నిఖరం, నిజమని పెద్దకోర్టే జెప్పినంక ఇంకేందాలిషెం!. ఎదురు జూషిందే కాబట్టింది. రాంలల్లా కు బేత్రిన్‌ ‌గుడి గట్టనీకి భూమిల గడ్డపారేషే రోజు రానే అచ్చె! ఏందోగని పూవు గుర్తోళ్ళ రాజ్జెంల వాళ్ళ ఎజెండాలే కోర్ట్తీ తీర్పులై ముందు పడబట్టినయి.వాళ్ళు అనుకున్నయన్ని అవ్వల్‌ ‌దర్జాగా జేసుకుంట బోతాండ్లు.ఒల్లెకాలేంకాదుల్లా! యేండ్ల సంది కన్న కలలు నిజం జేసుకోనీకి కార్పోరేట్‌ ఇత్తనం బెట్టి,మతం కంచె గట్టిండ్లు.సంఘపోళ్ళంత గనం చమటలు కారిచ్చి,చెట్టు బెంచి, పంట దీసే తిప్పలు ఇంతాంతది కాదని అందనబట్టె! గిసొంటి మందీ మార్బలమే కాదు!మతం మతలబుల తోలు గప్పుకున్న పెట్టుబడి శక్తులు మస్తుగున్నయి గాబట్టి వాళ్ళేం జేషినా ఖానూనైతాంది. ఒక్క దేశం,ఒక్క భాష,ఒక్క మతం,ఒక్క భాష గీ ఎజెండాలన్ని ఒకటెనుక ఒకటి ముందుకత్తానయి.కాశ్మీర్‌ ‌ను అర్సుకునే తీర్గ అర్సుకోని రావణ కాష్టం జేషిండ్లయిపాయెనా!

దేశం మొత్తంల కొరోనా గత్తరైతాంటె లాక్‌ ‌డౌన్‌ ‌లు పెట్టుడు తప్ప జేషిందేమిలేదని ఎవలనకుంట జేషేటియన్ని జేయబడ్తిరి. అన్ని పనులు సర్కార్‌ ‌జేసుడేందని సగంకన్న ఎక్కువ పనులు ప్రయివేటోళ్ళకు పంచి పెడితిరి.జనానికి గంటలు గొట్టే పని జెప్పి వీళ్ళు ప్రయివేట్‌ ‌రైలుబండ్లకు గంట గొడితిరి.సర్కార్‌ ‌దావకాన వైద్దులమీద జనం పూలు జల్లుతాంటె వీళ్ళు కార్పొరేట్‌ ‌దొరల కాళ్ళు కందిపోకుంట పూలు జల్లుకుంట సాగతం పల్కితిరి. వందల రైల్వే టేషన్లను ప్రయివేటోళ్ళకు అప్పజెప్పితిరి. విమానాలు, రైళ్ళు,బీమాలు లట్టరపొట్టర లన్ని కార్పొరేటోళ్ళ పరం జేషి కరోనా కాలంల గీ తీర్గ పని జేషిండ్లు. ఇరువై లచ్చల కోట్ల రూపాల ఆత్మ నిర్భర భారతం దేశమంత పంచేటాలకు మనిషికో కోటి రూపాలుజమై కొరోనా సావుపాట ఎవలికిఇనరాకుంటైంది జేషె! అదేందో గని ఇంట్ల ఇగురం యెటమట మైనప్పుడల్ల పెరట్ల యుద్ధటాంకులు పేలుతయి.గీ ఇచ్ఛంత్రం కొత్తేంగాదుగని దేశమంత’’జై జవాన్‌ !‌భారత్‌ ‌మాతాకి జై!చౌకీదార్‌ ‌జిందాబాద్‌’’  ‌జెప్పి కొరోనా సంగతే మరిషిపోయిండ్లుసుమీ! అంబానీ గాలిమోటర్లు, అదానీ రైలు బండ్లు,  కడక్‌ ‌గొడ్తాంటె కొరోనా సావుల లెక్కలెవలు ఇనే కత కానత్తలేదు.

                 ‘‘వారీ! దేశంల దొంగలు పడ్డరు కండ్లు తెరిషి జూడు,నీ లోపలి లాగు సుత గుంజుకుంటాండ్లు! గింత గనం ఓట్లేషి నౌకరిత్తె ,గద్దెక్కినోళ్ళే గద్దలై నీ ఎనుక ముందేం లేకుంట సదురుకోని ముల్లెలు గడ్తాండ్లు!పైలం!అని జెప్పినోళ్ళను,జెప్పెటోళ్ళను జెప్పిగిట్ల ఇగురం ఎల్లబెడుతరు గాచ్చు అనుకునెటోళ్ళను సుత ‘‘అసొంటి తిప్పలు’’ పడకుంట పైలంగ లోపట్కి పంపబడ్తిరి. రొండుకాళ్ళు లేక,సగం పెయి కదులకుంట చక్రాల బండిమీద మందుగోలీలు తినుకుంట బతికేటి బక్కపల్సని మనిషిని జూషి సుత బుగులు వడితిరి.కొరోనా పాజిటివైన ఎనుబైయేండ్ల మనిషిని దేశంగాని దేశం గొంటబోయి  లోపట నూకితిరి!ఏం జేషిండో ఇగురం జెప్పుడు లేదాయే! ఏమన్న జేషిండంటె,ఏం లేదు,మరి ఎందుకు లోపటేషిండ్లో జవాబు లేదు.రైళ్ళకింద బాంబు లేషినోళ్ళు,మనుషుల్ని పాణవుండంగ  బుగ్గివెట్టి జంపినోళ్ళు రాజ్జాలేల బట్టిండ్లు,బతుకుల తీరుజూపే అసలు సదువులు జెప్పెటోళ్ళందరిని ఆడోళ్ళు మొగోళ్ళు ముసలోళ్ళు,కాళ్ళుషేతులు లేనోళ్ళను జూషి బుగులు పడేటంత లోగుట్టు రాజ్జెం ఏం జేత్తాండ్లో గని వీళ్ళు కరోనా కాలంల ఏవేం జేయాల్నో అన్ని లెక్కవెట్టుకోని బరాబరి జేయబట్టిండ్లు.

       కరోనా కాలవంత సర్కార్‌  ‌దావకాన్లు కట్టింది లేదు,వు న్న దావకాన్లండ్ల కొత్త మంచాలేషింది లేదు. మందులు పెంచింది లేదు. కరోనా వచ్చి గల్మ కాడున్నది, నీ పాణం నువ్వే కాపాడుకోవాలె!పైలం! అని ఎవలి సందాన వాళ్ళ పాణం పైలం అని జెప్పుడుతప్ప!కొరోనా బీమారి పారిచ్చుట్ల దునియా మొత్తంల మనదేశమే ముందుగాలున్నదని లెక్కలల్ల ఎరుకైనట్టున్నది! జనాలందరు గీ రంధి మరిషేందుకు రొండు మందు గోలీలు తెచ్చిండు మోడీ సారు. రాముని గుడిగట్టే పని ముందటేసుకున్నరు,భూమిల గడ్డపారేషే మంచిమూర్తం ఐలాన్‌ ‌జేషిండ్లు. బుద్దిజీవులు రికావుంటె తిప్పలని వాళ్ళకోసం ‘‘కొత్త సదువుల’’ ఒయ్య ముందటేషిండ్లు. అగ్గొ! పక్కదేశమోళ్ళు తీగపొంటి అచ్చిండ్లని రాఫెల్‌ ‌యుద్ధ ఇమానాలు కొనుడు జూపెట్టుకొచ్చిండ్లు. కొరోనా సావులు దేశామంత పీనుగలను జేత్తాంటె రాములోరి గుడి జాగల గడ్డపారేషే ఇగురం ముందటేసుకునుడు,కొత్త సదువుల ఒయ్య బయటికి తీసుడు,రాఫెల్‌ ‌రీఫెల్లు కొనుడు గిసోంటి గారడాటలు జనాల ధిమాకులనుపక్కదారి బట్టిచ్చుడు గాకుంటె యేంటిదుల్గా! కొరోనాకు మందుమాకుల సంగతేందో జూసుడు లేదు గని కొరోనా కాలవంత పూవు గుర్తు అధికారం గద్దెమీదుండి గిసోంటి గారడాటలు మస్తు జేయబట్టిండ్లు. అచ్చేదిన్‌ ఆయే!అంటె గిదే గావచ్చు! సూడ్రా!బయ్‌!ఇ‌క్రమార్క్!ఇం‌టివి కద!

          కొరోనా కాలవంత మోడీ సర్కార్‌ ఎసోంటి కతలు వడ్డదో జూషినవు గద!ఇంతకు ఆత్మ నిర్భర భారతంపేరుతోని ఇచ్చిన ఇరవై లచ్చల కోట్ల కొత్తలల్ల నీకే మన్నఅచ్చినయా! ఆవేమైనయి!?సంగతేందో జెప్పినంకనే పోవాలె!?లేకుంటె నువు సుత అండా జేలు తొవ్వబడ్తవు!పైలం!అని బెదిరిచ్చేటి భేతాళున్ని యెప్పటి తీర్గనే భుజాన మోసుకుంట’’ఇను!భేతాళ్‌! ‌సంఘపరివారం కన్న కలలన్ని నిజం జేసుకునే పనిలున్నది, సంఘం మాస్క్ ‌బెట్టుకోని కొరోనా కాలమంత కార్పొరేట్ల కాళ్ళు పిసుకుడు పనిల సర్కార్‌తీరొక్క తిప్పలు బడుతాంది.జనం కండ్లు చీకట్లు బారేందుకు ఆత్మ నిర్భర భారతం మందు జల్లిండ్లు. దాంట్ల గుడ్డి గవ్వ సుత ఎవలికేం రాలింది లేదు. గీ పది దినాలు హనుమాన్‌ ‌చాలీసా సదువంకుంటె కొరోనా బోతదట! గీ ఇగురం అందరి షెవులెయ్యాలె! అని నవ్వుకుంట నడ్వ బట్టిండు…నడ్వబట్టిండు…
– ఎలమంద.తెలంగాణ
Gi Tirga Mundukutelugu articlevikramarkuduYelamanda prajatantra article
Comments (0)
Add Comment