ఉదయించే సూర్యుడు

పుట్టుకతో దళితుడైనా
మానవీయ విలువలను
ఆవిష్కరించిన కవిదిగ్గజం
కుల వ్యవస్థపై తిరగబడ్డ
నవయుగ కవి చక్రవర్తి
దారిద్య్రం పై పోరాడిన
విశ్వకవి సామ్రాట్‌
‌స్వార్థం పై సమరం చేసిన
కవి విశారదుడు
మతసామరస్యాన్ని పెంచిన
మధుర శ్రీనాధుడు
అస్ఫృశ్యత పై గళమెత్తిన
సాహితీ కవి కోకిల
‘వడ గాల్పులు నా జీవితమైతే
వెన్నెల నా కవిత్వం …
సుకవి జీవించు ప్రజల నాల్కలయందు’
అని చాటి చెప్పిన థీరోధాత్తుడు
ఫిరదౌసి ,గబ్బిలం,ముంతాజ్‌ ‌మహల్‌
‌స్మశాన వాటిక ఆయన ఖండకావ్యాలు
నేటి సమాజాన్ని మేల్కొపు నవ్యాలు
కళాప్రపూర్ణ ,పద్మ భూషణ
బిరుదాంకితుడు
తెలుగు సాహితీ గగనంలో
నిత్యం ఉదయించే సూర్యుడు
ఆయనే గుర్రం జాషువా….

– కయ్యూరు బాలసుబ్రమణ్యం
             9441791239

prajatantra newsRising Sun Gurram Jhasuatelangana updatestelugu kavithaluTelugu News Headlines Breaking News NowToday Hilightsతెలుగు వార్తలు
Comments (0)
Add Comment