మరో 20 ఏళ్లు వెనక్కి వెళ్లిన రాష్ట్రం

  • జగన్‌ ‌పాలనపై విరుచుకుపడ్డ చంద్రబాబు
  • పెట్టుబడులపై అబద్దాలు చెప్పారన్న యనమల

అమరావతి,సెప్టెంబర్‌ 22 : ‌వైసీపీ పాలనలో ఏపీ 20 ఏళ్లు వెనక్కెళ్లిందని టీడీపీ అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. రాష్ట్రంలో అభివృద్ధి లేదు, ఉపాధి, పెట్టుబడులు లేవన్నారు. సీఎం జగన్‌రెడ్డి పాలనలో వ్యవసాయరంగం సంక్షోభంలో పడిందని తెలిపారు. బుధవారం ఆయన డియాతో మాట్లాడుతూ ప్రభుత్వ సాయం అందక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, టీడీపీ హయాంలో వ్యవసాయాన్ని అన్ని విధాల ప్రోత్సహించామని తెలిపారు. అమరావతి, పోలవరం రెండు కళ్లుగా రాష్టాన్న్రి  అభివృద్ది చేశామన్నారు.

టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే  2020 జూన్‌ ‌నాటికి పోలవరం పూర్తయ్యేదని చంద్రబాబు చెప్పారు. జగన్‌ ‌వచ్చి అమరావతిని, పోలవరాన్ని నాశనం చేశారని దుయ్యబట్టారు. అఫ్ఘానిస్తాన్‌ ‌నుంచి ఏపీకి డ్రగ్స్ ‌దిగుమతి జరుగుతోందని, సీఎం ఇంటి సపంలో ఓ కంపెనీ పేరుతో రూ.21 వేల కోట్ల హెరాయిన్‌ ‌పట్టుబడిందన్నారు. డగ్స్ ‌వ్యాపారంతో ఉగ్రవాదుల్ని ప్రోత్సహిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రం బాగుపడాలంటే మళ్లీ టీడీపీ అధికారంలోకి రావాలని చంద్రబాబు పేర్కొన్నారు. ఇదిలావుంటే రెండేళ్ల జగన్‌ ‌రెడ్డి పాలనలో మూలధన వ్యయం గణనీయంగా తగ్గిపోయిందని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. బుధవారం ఆయన డియాతో మాట్లాడుతూ పారిశ్రామిక పెట్టుబడులు తగ్గిపోయి నిరుద్యోగం ప్రబలిపోయిందని చెప్పారు.

వాణిజ్య ఉత్సవంలో సీఎం జగన్‌ ‌వాస్తవ గణాంకాలను మరుగునబెట్టి.. అభివృద్ధి సాధించామని చెప్పడం పారిశ్రామికవేత్తలను వంచించడమేనని దుయ్యబట్టారు. గత రెండేళ్లలో పారిశ్రామిక, అనుబంధ రంగాలు తిరోగమనంలో ఉన్నాయని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి అయిదు నెలల్లో రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్లు.. 34శాతం పడిపోవడం వాణిజ్యరంగ దుస్థితికి అద్దం పడుతోందని యనమల రామకృష్ణుడు తెలిపారు.

Comments (0)
Add Comment