‘ఆకలి కేకల గానం ..’ ఆగిపోయింది ..!

  • అశ్రునయనాల తో గద్దర్‌ అం‌త్య క్రియలు ..
  • జనసంద్రమైన ఎల్బీ స్టేడియం
  • నివాళులర్పించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు, మాజీ సిజెఐ జస్టిస్‌ ఎన్వీ రమణ,ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు
  • గద్దర్‌ అమర్‌ ‌హై అంటూ ‘దద్దరిల్లిన ఎల్బీ స్టేడియ్నవందలాది వాహనాలలో తరలివచ్చిన అభిమానులు

హైదరాబాద్‌/‌ముషీరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్7:‌ప్రజా యుద్ధనౌక, విప్లవోద్యమ సాహిత్యకారుడు గద్దర్‌ అం‌త్యక్రియలు సోమవారం సాయంత్రం 7.30 గం .ల ప్రాంతంలో  భౌద మత పద్ధతిలో జరిగాయి. పోలీసుల గౌరవ వందనం చేశారు. గద్దర్‌ ఆఖరి కోరిక మేరకు అల్వాల్‌లోని మహాబోధి స్కూల్‌ ‌గ్రౌండ్‌లో అంత్యక్రియలు జరిగాయి. అంతకు ముందు ఇంటి వద్దకు సీఎం కేసీఆర్‌ ‌వొచ్చి నివాళి అర్పించారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అపోలో హాస్పిటల్‌ ‌ల్లో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు.  ఆకస్మికంగా మృతి చెందిన ప్రజా గాయకుడు గద్దర్‌ అం‌తిమ యాత్ర మధ్యాహ్నం ఎల్బి స్టేడియం నుంచి మొదలయ్యింది. అంతకు ముందుకు ఆయన భౌతిక కాయాన్ని పలువురు ప్రముఖులు సందర్శించి నివాళులర్పించారు. గద్దర్‌ అమర్‌ ‌హై, జోహార్లు గద్దర్‌ ‌వంటి నినాదాలు, విప్లవ గీతాల అలావన, డప్పుల మోత, లంబాడీ గిరిజనులు నృత్యాలు, కోలాటం, కన్నీట సంద్రంగా విషాద నినాదాలతో బషీర్‌ ‌బాగ్‌ ‌లోని ఎల్బీ స్టేడియం దద్దరిల్లింది. వందలాది వాహనాలలో వేలాది మంది విచ్చేసి గద్దర్‌ ‌భౌతిక కాయాన్ని అభిమానులు, శ్రేయోభిలాషులు, బంధువులు, ఉద్యమ కారులు సందర్శనార్ధం సోమ వారం ఎల్బీ స్టేడియంలోకి వచ్చారు. వేలాది మంది నందర్శించి వుష్పగుచ్చాలు ఉంచి అంజలి ఘటించారు.

గద్దర్‌ ‌భౌతిక కాయాన్ని సందర్శించిన వారిలో కేంద్ర మంత్రి జి.కిషన్‌ ‌రెడ్డి, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టీస్‌ ఎన్‌.‌వి.రమణ, రాష్ట్ర శాసన నభ స్పీకర్‌ ‌పోచారం శ్రీనివాస్‌ ‌రెడ్డి, ఎఐసిసి నేత, తెలంగాణ పిసిసి ఇన్చార్జీ మానిక్‌ ‌రావు ఠాక్రే, పిసిసి అధ్యక్షుడు, ఎంపి, రేవంత్‌ ‌రెడ్డి, సిఎల్పీ నేత భట్టివిక్రమార్క, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు డి.శ్రీధర్‌ ‌బాబు, సీతక్క, పార్లమెంట్‌ ‌సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి, కాంగ్రెస్‌ ‌నేతలు మధుయాష్కీ గౌడ్‌, ‌వి.హనుమంతరావు, మల్లు రవి, మందడి అంజన్‌ ‌కుమార్‌ ‌యాదవ్‌, అద్దంకి దయాకర్‌, ‌బెల్లయ్య నాయక్‌, ‌రాష్ట్ర మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌ ‌రావు, తలసాని శ్రీనివాస్‌ ‌యాదవ్‌, ఇం‌ద్రకరణ్‌ ‌రెడ్డి, నిరంజన్‌ ‌రెడ్డి, ఎమ్మెల్యే కాంత్రి కిరణ్‌, ‌మైనంపల్లి హనుమంతరావు, దానం నాగేందర్‌, ‌రసమయి బాలకిషన్‌, ‌మాజీ ముఖ్యమంత్రి నాదేండ్ల భాస్కర్‌ ‌రావు, ఎపి రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, టిడిపి నేతలు రావుల చంద్రశేఖర్‌ ‌రెడ్డి, బిజెపి ఎమ్మెల్యే రఘునందన్‌ ‌రావు, పరిటాల శ్రీరామ్‌, ‌జిహెచ్‌ఎం‌సి మేయర్‌ ‌గద్వాల్‌ ‌విజయలక్ష్మి, అస్కార్‌ అవార్డు గ్రహీత ఎంఎం. కీరవాణి, సినీ నటులు మోహన్‌ ‌బాబు, కొణిదల నాగబాబు, మనోజ్‌, ‌నిహరిక, ఆర్‌.‌నారాయణమూర్తి, ఆలీ, ఆర్టీసీ ఎండి నజ్జనార్‌, ‌సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, లోక్‌ ‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డా.జయప్రకాష్‌ ‌నారాయణ తదితరులు హాజరై నివాళులర్పించారు.

ఎల్పీస్టేడియంలో ఉన్న గద్దర్‌ ‌భౌతిక కాయానికి కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌ ‌రెడ్డి నివాళి అర్పించారు.  ఆయన పాటలు, మాటలను గుర్తు చేసుకున్నారు. గద్దర్‌ • ‌లాంటి ఉద్యమకారులు, ప్రజాగాయకుడి మరణం రాష్టాన్రికి తీరని లోటని బాధని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఆశయాలు నెరవేరకుండానే ఆయన కాలం చెందారని బాధపడ్డారు. వొచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని తనతో చెప్పినట్టు కిషన్‌ ‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. తాము ఊహించిన తెలంగాణ ఇంకా సాకారం కాలేదని అన్నారని తెలిపారు. మార్పు కోసం మరో ఉద్యమం రావాలని కోరుకున్న వ్యక్తి ఇలా అర్దాంతరంగా వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్‌ ‌తెలంగాణ ఇంచార్జ్ ‌మాణిక్‌ ‌రావు ఠాక్రే, జానారెడ్డి, కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం, బూర న్సయ్య గౌడ్‌, ‌గరికపాటి నర్సింహరావు గద్దర్‌ ‌భౌతిక కాయాన్ని సందర్శించి సంతాపం తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్‌ ‌మంత్రి మంత్రి బొత్స సత్యనారాయణ కూడా గద్దర్‌ ‌భౌతిక కాయానికి నివాళి అర్పించారు. సుప్రీంకోర్టు మాజీ సీజే ఎన్వీరమణ కూడా ఎల్బీ స్టేడియానికి వొచ్చి గద్దర పార్థివ దేహానికి నివాళి అర్పించారు. గద్దర్‌ ‌తన రూమ్‌ ‌మెట్‌ అని గుర్తు చేసుకున్నారు. రిటైర్‌ అయిన తర్వాత రాజకీయాల్లోకి రావాలని తనను కోరారని తెలిపారు.

తెలంగాణ మంత్రులు కూడా గద్దర్‌ ‌పార్ధివ దేహానికి నివాళి అర్పించారు. జనసేన అధినేత పవన్‌ ‌కల్యాణ్‌, ‌నటుడు మోహన్‌ ‌బాబు, హాస్యనటుడు అలీ, బండ్ల గణెళిష్‌, ‌మంచు మనోజ్‌, ‌సింగర్‌ ‌మధు ప్రియ నివాళి అర్పించారు. అన్ని యూనివర్శిటీల నుంచి విద్యార్థులు తరలి వొచ్చి అశ్రునివాళి అర్పించారు. గద్దర్‌ ‌రాసిన పాటలను గుర్తుచేసుకున్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతన్న గద్దర్‌.. ఆదివారం సాయంత్రం కన్నుమూశారు. దీంతో ప్రజల సందర్శనార్ధం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఆయన పార్థివదేహాన్ని ఉంచారు. ఈనేపథ్యంలో  మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌ ‌రావు, తలసాని శ్రీనివాస్‌ ‌యాదవ్‌, ‌సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్‌ ‌రెడ్డి, మేయర్‌ ‌గద్వాల విజయలక్ష్మి, కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్‌ ‌రావు, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీనియర్‌ ‌నేత జానారెడ్డి, సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూనంనేని, సీఎం నేత జూలకంటి రంగారెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌, ‌నివాళులర్పించారు. ఆయన భౌతికకాయం వద్ద పుష్పాంజలి ఘటించారు. నాగబాబు, ఆయన కుతూరు నిహారిక.. గద్దర్‌ ‌పార్ధివదేహానికి నివాళులర్పించారు. అనంతరం గద్దర్‌ అం‌తిమయాత్ర ఎల్బీ స్టేడియం నుంచి ప్రారంభం అయ్యింది.ఎల్బీస్టేడియం నుంచి అశ్రు నయనాల మధ్య ప్రజా యుద్ధనౌక గద్దర్‌ అం‌తిమ యాత్ర ప్రారంభమైంది.

పోలీసుల గౌరవ వందనం.. స్లో మార్చ్, ‌డెత్‌ ‌మార్చ్‌లతో గన్‌ ‌పార్క్‌కు అంతిమ యాత్ర బయలుదేరింది. గద్దర్‌ ‌పార్థివదేహాన్ని ఎల్బీస్టేడియం నుంచి అమరవీరుల స్థూపానికి తీసుకెళ్లారు. అమరవీరుల స్థూపం వద్ద ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఈ అంతిమ యాత్రలో వేలాది మంది కళాకారులు, గద్దర్‌ అభిమానులు పాల్గొన్నారు. రాజకీయ నాయకులు, ప్రజాకళాకారులు వెంట నడిచారు. గగద్దర్‌ ‌పాటలతో హోరెత్తించారు. గద్దర్‌ అమర్‌ ‌హై అన్ననినాదాలు మిన్నంటాయి.   గన్‌పార్క్, అం‌బేద్కర్‌ ‌విగ్రహం, అమరవీరుల స్థూపం, ట్యాంక్‌బండ్‌ ‌దుగా అల్వాల్‌లోని ఆయన నివాసం వరకు సాగింది. అల్వాల్‌ ‌గద్దర్‌ ‌నివాసంలో  పార్థవదేహాన్ని కొంత సమయం ఉంచారు.. అనంతరం సపంలోని బోధి విద్యాలయం వరకు తీసుకెళ్లి అక్కడ ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు..

Comments (0)
Add Comment