దేశ ప్రగతికోసం పార్లమెంటులో చర్చ సాగాలి

  • సమస్యలపై చర్చల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు
  • పార్లమెంట్‌ ‌సమావేశాల సందర్భంగా ప్రధాని మోడీ ఆకాంక్ష
  • కేబినేట్‌ ‌సీనియర్లతో తొలుత ప్రధాని భేటీ

దేశ ప్రగతి కోసం పార్లమెంటులో చర్చ జరగాలని ప్రధాని మోదీ అన్నారు. ఇవి చాలా ముఖ్యమైన సమావేశాలని, ఉభయ సభలు సజావుగా సాగాలని ప్రజలంతా కోరుకుంటున్నారని చెప్పారు. ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంటు ఆవరణలో ప్రధాని మోదీ వి•డియాతో మాట్లాడారు. ప్రతి విషయం చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. నూతన సంకల్పంతో రాజ్యాంగ దినోత్సవం నిర్వహించామని చెప్పారు. రాజ్యాంగ దినోత్సవ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలనేది ప్రభుత్వ సంకల్పమని తెలిపారు. దేశ వ్యాప్తంగా ’ఆజాదీ కా అమృత్‌ ‌మహోత్సవ్‌’ ‌నిర్వహిస్తున్నామని చెప్పారు. అమృత్‌ ‌మహోత్సవాల్లో భాగంగా దేశం నలుమూలలా కార్యక్రమాలు చేపట్టామన్నారు. స్వాతంత్య దినోత్సవ సమయంలో కలల సాకారం దిశగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ప్రజలు తమ వంతు సాయం చేస్తున్నారని చెప్పారు.

ప్రజల సేవ.. దేశ ఉజ్వల భవిష్యత్తుకు శుభ సంకేతమన్నారు. ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలకు గురి చేస్తున్న కొత్త కరోనావైరస్‌ ‌వేరియంట్‌ ఓమైక్రాన్‌ ‌పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను కోరారు.పార్లమెంటు శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు వి•డియా ప్రతినిధులను ఉద్ధేశించి ప్రధానమంత్రి మోదీ మాట్లాడారు.కరోనా మహమ్మారి సమయంలో మేం 100 కోట్ల డోస్‌లకు పైగా కొవిడ్‌ ‌వ్యాక్సిన్లను వేశాం. ఇప్పుడు 150 కోట్ల డోస్‌ల వైపు వెళ్తున్నాం.అని మోదీ చెప్పారు. కొత్త కరోనావైరస్‌ ‌వేరియంట్‌ ఆవిర్భావం గురించి వెలువడుతున్న వార్తలు మమ్మల్ని మరింత అప్రమత్తం చేశాయన్నారు. కొవిడ్‌-19 ‌కొత్త వేరియంట్‌ ‌దృష్ట్యా మనమందరం అప్రమత్తంగా ఉండాలని ప్రధాని కోరారు. దేశప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ ప్రాధాన్యం అని ప్రధాని అన్నారు.

కొత్త వేరియెంట్‌ ‌ప్రమాదం నేపథ్యంలో అంతర్జాతీయంగా వచ్చిన వారందరినీ పర్యవేక్షించాలని ప్రధాని అధికారులను కోరారు. అంతర్జాతీయ ప్రయాణ పరిమితుల సడలింపు ప్రణాళికలను సవి•క్షించాలని ఆయన అధికారులను కోరారు. ఇదిలావుంటే పార్లమెంటు శీతాకాల సమావేశాల నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం తన కేబినెట్‌లోని సీనియర్‌ ‌మంత్రులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌, ‌హోం మంత్రి అమిత్‌ ‌షా, వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ ‌తోమర్‌, ‌వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ ‌గోయల్‌, ‌పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ ‌జోషీ పాల్గొన్నారు.

parliamentprajatantra newsprogresstelangana updatestelugu kavithaluToday Hilights
Comments (0)
Add Comment