న్యూ దిల్లీ, జూన్ 24 : టిఆర్ఎస్ తరఫున రాజ్యసభకు ఎన్నికైన దీవకొండ దామోదర్‌రావు, హెటిరో ఫార్మా వ్యవస్థాపకుడు బండి పార్థసారథిరెడ్డిలు శుక్రవారం రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేశారు. రాజ్యసభ చైర్మెన్ వెంకయ్యనాయుడు సమక్షంలో దామోదర్‌రావు, పార్థసారధిరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఇద్దరు ఎంపీలూ తెలుగు భాషలో ప్రమాణ స్వీకారం చేశారు. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం మద్దునూరుకు చెందిన దీవకొండ దామోదర్ రావు తెలంగాణ ఉద్యమంలో కెసార్ వెన్నంటి నిలిచారు.
2001 నుంచి టీఆర్ఎస్ పార్టీలో పలు హోదాల్లో పని చేశారు. పొలిట్ బ్యూరో సభ్యుడిగా, ప్రధాన కార్యదర్శిగా, పార్టీ సెక్రటరీ ఫైనాన్స్‌గా వ్యవహరించారు. టీ న్యూస్ చానెల్‌కు తొలి మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరించిన దామోదర్ రావు.. ప్రస్తుతం డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. పార్థసారథి రెడ్డి ఖమ్మం జిల్లా వాసి.